Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో  కెనడా ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో  కెనడా ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో తో కలసి జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022 జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో ఒక ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.

 

ఉమ్మడి విలువలు కలిగిన బలమైన ప్రజాస్వామ్యదేశాల నేతలు గా ఇద్దరు నేతల మధ్య ఒక ఫలప్రదమైన సమావేశం జరిగింది. సమావేశ క్రమం లో, నేతలు ఇరువురు భారతదేశం- కెనడా ద్వైపాక్షిక సంబంధాల ను గురించి చర్చించడం తో పాటుగా, వ్యాపార సంబంధాల ను మరియు ఆర్థిక సంబంధాల ను మరింత గా బలపరచుకోవడం, రక్షణ మరియు ఉగ్రవాదాని కి ఎదురొడ్డి నిలవడం తో పాటుగా ప్రజల మధ్య సంబంధాల ను ఇప్పటి కంటే పరిపక్వంగా తీర్చిదిద్దాలి అనే అంశం లో సైతం సమ్మతి ని వ్యక్తం చేశారు.

 

వారు పరస్పర హితం ముడిపడినటువంటి ప్రపంచ అంశాలు మరియు ప్రాంతీయ అంశాల పైన కూడా ఒకరి అభిప్రాయాల ను మరొకరి కి వెల్లడించుకొన్నారు.

 

**