విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు, శ్రేష్ఠులారా,
జి-20 విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశాని కి మిమ్ముల ను అందరి ని నేను ఆహ్వానిస్తున్నాను. జి-20 కి భారతదేశం అధ్యక్ష బాధ్యతల ను నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణం లో ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసింది. ఇది ఉద్దేశ్యం తాలూకు ఏకత్వం మరియు కార్యాచరణ తాలూకు ఏకత్వం అనేవి ఎంతైనా అవసరం అని సూచిస్తున్నది. ఈ రోజు న జరుతున్న ఈ మీ యొక్క సమావేశం ఉమ్మడి లక్ష్యాల మరియు నిర్దిష్ట ఉద్దేశ్యాల సాధన కోసం గుమికూడిన భావన కు అద్దం పడుతుంది అని నేను ఆశపడుతున్నాను.
శ్రేష్ఠులారా,
బహుళ పార్శ్విక వాదం అనేది ప్రస్తుతం సంకట స్థితి ని ఎదుర్కొంటోంది అనే విషయాన్ని మనం అందరం అంగీకరించి తీరాలి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ పాలన తాలూకు స్వరూపం ఏదైతే ఉందో అది రెండు విధుల ను నెరవేర్చడాని కి సంబంధించింది. వాటిలో ఒకటోది స్పర్ధాత్మక హితాలు తులతూగి ఉండేటట్టుగా జాగ్రతలు తీసుకొంటూ, రాబోయే కాలం లో యుద్ధాల ను నివారించాలి అనేది. రెండోది ఏమిటి అంటే అది ఉమ్మడి హితం ముడిపడ్డ విషయాల లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందింప చేయాలి అనేదే. గడచిన కొన్ని సంవత్సరాల లో ఎదురుపడిన అనుభవాలు – ఆర్థిక సంకట స్థితి, జలవాయు పరివర్తన, మహమ్మారి, ఉగ్రవాదం, మరియు యుద్ధాలు – ఇవి గ్లోబల్ గవర్నెన్స్ అనేది దాని రెండు ఆశయాల అనుసరణ లో విఫలం అయింది అని స్పష్టం గా చాటిచెప్తున్నాయి. ఈ వైఫల్యం తాలూకు శోచనీయ పర్యవసానాల ను అభివృద్ధి చెందుతున్న దేశాల లో చాలా వరకు దేశాలు ఎదుర్కొంటున్నాయి అనే సంగతి ని మనం ఒప్పుకొని తీరాలి. ఏళ్ళ తరబడి ప్రగతి పథం లో మునుముందుకు సాగుతూ వచ్చిన అనంతరం, మనం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజి స్) పరం గా వెనుకకు నడుస్తున్నామా అనే స్థితి లో ప్రస్తుతం ఉన్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాల లో అనేక దేశాలు తమ ప్రజల కు ఆహార భద్రత ను అందించడం కోసం మరియు శక్తి సంబంధి భద్రత ను అందించడం కోసం యత్నిస్తూ తలకు మించిన రుణ భారం తో సతమతం అయిపోతున్నాయి. ఆ దేశాలు సంపన్న దేశాల వల్ల దాపురించిన గ్లోబల్ వార్మింగ్ తో కూడాను అత్యం ప్రభావితం అయ్యాయి. ఈ కారణం గానే ప్రపంచం లో నిరుపేద దేశాల కు మరియు చాలా కొంచెం పారిశ్రమికీకరణ కు మాత్రమే నోచుకొన్న దేశాలకు ఒక వాణి ని ప్రసాదించాలనే ప్రయత్నాన్ని జి-20 కి ప్రస్తుతం అధ్యక్షత బాధ్యత ను వహిస్తున్న భారతదేశం యత్నించింది. ఏ కూటమి అయినా దాని నిర్ణయాల ద్వారా అత్యంత ప్రభావితం అయినటువంటి దేశాల స్వరాన్ని వినకుండా ప్రపంచ నాయకత్వం తనదని వాదించ జాలదు.
శ్రేష్ఠులారా,
ప్రపంచం లో తీవ్రమైన విభజన లు చోటు చేసుకొన్నటువంటి కాలం లో మీరు అందరు ఒక చోటు లో సమావేశం అవుతున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల హోదా లో మీరు తీసుకొనేటటువంటి నిర్ణయాలు వర్తమాన భౌగోళిక మరియు రాజకీయ ఉద్రిక్తత ల వల్ల ప్రభావితం కావడం సహజమే. ఈ ఉద్రిక్తతల ను ఏ విధం గా పరిష్కరించాలి అనే అంశం లో మనకు అందరి కి మనవి అయినటువంటి స్థితులు మరియు మనవి అయినటువంటి దృష్టికోణాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ, ప్రపంచం లో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలు గా మనకు ఉన్నటువంటి హోదాల పరం గా చూసుకొన్నప్పుడు ఈ గది లో లేని అటువంటి వారి పట్ల సైతం మనం ఒక బాధ్యత ను కలిగి వున్నాం. వృద్ధి, అభివృద్ధి, ఆర్థికం గా ఆటుపోటుల ను తట్టుకొని నిలబడడం, విపత్తుల ను తట్టుకొని నిలబడడం, ఆర్థిక స్థిరత్వం, దేశాల సరిహద్దులకు ఆవల జరిగే నేరాలు, అవినీతి, ఉగ్రవాదం, ఆహారపరమైన భద్రత మరియు శక్తి సంబంధి భద్రత అనే సవాళ్ళ ను పరిష్కరించడం కోసం జి-20 దోహద పడుతుంది అని ప్రపంచ దేశాలు ఆశ పెట్టుకొన్నాయి. ఈ అన్ని రంగాల లో ఏకాభిప్రాయాన్ని సాధించడాని కి మరియు ఖచ్చితమైనటువంటి ఫలితాల ను అందించడానికి జి-20 కి తాహతు ఉంది. మనం కలిసికట్టు గా పరిష్కరించలేని అటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనం కలిసికట్టు గా పరిష్కరించగలిగిన అంశాల దోవ లో అడ్డు పడేందుకు మనం ఎంతమాత్రం అవకాశాన్నీ ఇవ్వకూడదు. గాంధీ మరియు బుద్ధుడు పుట్టిన గడ్డ మీద మీరు భేటీ అవుతున్నందువల్ల మనల ను విభజించే అంశాల పైన కాకుండా మనల ను ఒక్కటి చేసే అంశాల పైన దృష్టి ని నిలపాలి అని బోధిస్తున్న అటువంటి భారతదేశం యొక్క నాగరకత సంబంధి మర్యాద నుండి మీరు స్ఫూర్తి ని పొందుదురు గాక అని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను.
శ్రేష్ఠులారా,
ఇటీవలి కాలం లో, మనం ఒక వందేళ్ళ లో తలెత్తేటటువంటి అత్యంత వినాశకారి మహమ్మారి ని గమనించాం. ప్రాకృతిక విపత్తుల లో వేల కొద్దీ ప్రాణాలు అంతం అయిపోవడాన్ని మనం చూశాం. ఒత్తిడి ఎదురైనప్పుడల్లా ప్రపంచం లోని సరఫరా వ్యవస్థ లు చెదరిపోవడాన్ని మనం అనుభవం లోకి తెచ్చుకొన్నాం. నిలకడ గా ఉన్న ఆర్థిక వ్యవస్థ లు కాస్తా ఒక్కసారి గా రుణం మరియు ఆర్థిక సంకటాల ధాటి కి అల్లాడిపోవడాన్ని మనం గ్రహించాం. ఈ పరిణామాలు మన సమాజాల లో, మన ఆర్థిక వ్యవస్థల లో, మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల లో, అలాగే మన మౌలిక సదుపాయాల రంగం లో ఆటుపోటుల ను తట్టుకొని నిలబడవలసిన అగత్యాన్ని స్పష్టం గా తెలియజేస్తున్నాయి. త్రాసు లో ఒక పక్క వృద్ధి మరియు దక్షత లకు, మరో పక్క ప్రతికూల పరిస్థితుల కు తట్టుకుని నిలబడటాని కి మధ్య సమతూకాన్ని సాధించడం లో జి-20 కి ఒక కీలకమైన భూమికంటూ ఉంది. ఈ సమతూకాన్ని మనమంతా కలసి కృషి చేయడం ద్వారా మరింత సులభం గా సాధించవచ్చును. ఈ కారణం గానే మీ యొక్క ఈ సమావేశం ఎంతో ముఖ్యమైనటువంటిది గా ఉంది. మీ సామూహిక వివేకాన్ని మరియు మీ సామూహిక సామర్థ్యాలను నేను పూర్తి గా విశ్వసిస్తున్నాను. నేటి సమావేశం మహత్వాకాంక్ష యుక్తమైనదిగాను, అన్ని వర్గాల ను కలుపుకొని పోయేదిగాను, కార్యాచరణ కు ప్రాధాన్యాన్ని ఇచ్చేదిగాను మరియు వ్యత్యాసాల కు అతీతం గా నడుచుకొనేది గాను ఉంటుంది అని నాకు నమ్మకం ఉంది.
మీకు ఇవే నా యొక్క ధన్యవాదాలు, మరి ఫలప్రదంగా నిలచేటటువంటి సమావేశాన్ని కోరుకొంటూ మీకు అందరి కి ఇవే నా యొక్క శుభాకాంక్షలు.
***
Addressing the Opening Segment of G20 Foreign Ministers' meeting. @g20org https://t.co/s73ypWruBf
— Narendra Modi (@narendramodi) March 2, 2023
India's theme of ‘One Earth, One Family, One Future’ for its G20 Presidency, signals the need for unity of purpose and unity of action. pic.twitter.com/ZfaRaqAUtH
— PMO India (@PMOIndia) March 2, 2023
We must all acknowledge that multilateralism is in crisis today. pic.twitter.com/5PZooUANTY
— PMO India (@PMOIndia) March 2, 2023
India’s G20 Presidency has tried to give a voice to the Global South. pic.twitter.com/lDg6gjvgxX
— PMO India (@PMOIndia) March 2, 2023
G20 has capacity to build consensus and deliver concrete results. pic.twitter.com/gKJdpvb0kF
— PMO India (@PMOIndia) March 2, 2023