ఘనత వహించిన మహాశయులారా, సోదర సోదరీమణులారా,
నమస్కార్,
నమ్మ బెంగళూరు కు నేను మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈ నగరం, శాస్త్ర సాంకేతిక రంగానికి, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ ప్రేరణకు నిలయం. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చించడానికి బెంగళూరు ను మించిన ప్రదేశం మరోకటి లేదు.
మిత్రులారా,
భారతదేశపు డిజిటల్ పరివర్తన గత 9 సంవత్సరాలుగా మున్నెన్నడూ చూడని రీతిలో ముందుకు సాగుతున్నది. ఇదంతా 2015 లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా చొరవతో ఇదంతా ప్రారంభమైంది. ఆవిష్కరణలలో మనకు గల తిరుగులేని విశ్వాసపు శక్తితో ముందుకు సాగాం. సత్వర అమలుకు మన చిత్తశుద్ధి ఇందుకు దోహదపడిరది. సమ్మిళితత్వం, అందరినీ కలుపుకుపోయే తత్వం ఇందుకు ప్రేరణ. డిజిటల్ పరివర్తన వేగం, అది అందుకున్న స్థాయి ఊహించని రీతిగా
సాగింది. ఇవాళ దేశంలో 850 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలోనే అతి తక్కవ ధరకు డాటా సేవలు అందుతున్నాయి. పరిపాలనను పరివర్తన చెందించడానికి మనం సాంకేతికతను వినియోగిస్తున్నాం. ఇది మరింత సమర్ధత, సమ్మిళితత్వం, సత్వరం, పారదర్శకతతో సేవలు అందించడానికి దోహదపడుతోంది. మనదైన ప్రత్యేక డిజిటల్ గుర్తింపు ప్లాట్‌ఫారం, ఆధార్, మన దేశంలోని 1.3 బిలియన్ల మంది ప్రజలకు సేవలు అందిస్తోంది. జె.ఎ.ఎం (జామ్) ఈ మూడిరటిని, అంటే `జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు, ఆధార్, మొబైల్ వంటి వాటిని దేశంలో ఆర్థిక లావాదేవీలు విప్లవాత్మక ం చేయడానికి వినియోగించడం జరిగింది.
మన తక్షణ చెల్లింపు వ్యవస్థ అయిన యుపిఐలో ప్రతి నెలా సుమారు పది బిలియన్ లావాదేవీలు జరుగుతున్నాయి. 45 శాతం అంతర్జాతీయ రియల్‌టైం చెల్లింపులు ఇండియాలోనే జరుగుతున్నాయి. ప్రభుత్వం వివిధ పథకాలకింద ఇస్తున్న మద్దతును ప్రత్యక్షనగదు ద్వారా చేపడుతుండడంతో లీకేజీలు అరికట్టడానికి వీలు కలగడంతో పాటు 33 బిలియన్ డాలర్లకుపైగా ఆదా అయింది.
కోవిన్ పోర్టల్ ఇండియా కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమానికి మద్దతునిచ్చింది.ఇది రెండు బిలియన్లకు పైగా వాక్సిన్ డోస్ లను సరఫరా చేయడానికి ,డిజిటల్ గా సరిచూసి సర్టిఫికేట్ జారీచేయడానికి దోహదపడిరది. గతి శక్తి ప్లాట్‌ఫాం సాంకేతికతను ఉపయోగించి స్పేషియల్ ప్లానింగ్ నుంచి మౌలికసదుపాయాలు, లాజిస్టిక్స్ సదుపాయాలు గుర్తించడం వరకు దీనిద్వారా సాగుతోంది. ఇది ప్లానింగ్, ఖర్చు తగ్గింపు, సత్వర ఫలితాల సాధనకు వీలు కల్పిస్తోంది.
మన ఆన్‌లైన్ పబ్లిక్ ప్రోక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫారం అయిన ప్రభుత్వ పోర్టల్, ఈ ` మార్కెట్ ప్లేస్ ప్రొక్యూర్ మెంట్ ప్రక్రియలో కి పారదర్శకతను, నిజాయితీని తీసుకువచ్చింది. డిజిటల్ కామర్స్‌కు ఓపెన్ నెట్ వర్క్, ఈ కామర్స్‌ను ప్రజాస్వామీకరిస్తోంది. పూర్తిస్థాయి డిజిటలైజేషన్ కలిగిన పన్ను వ్యవస్థ పారదర్శకత, ఈ `పరిపాలనకు వీలు కల్పిస్తోంది. మనం భాషిణిని రూపొందిస్తున్నాం. ఇది కృత్రిమ మేధ ఆధారిత భాషా అనువాద ప్లాట్‌ఫారం. ఇది భారతదేశంలోని అన్ని భాషలకు డిజిటల్ సమ్మిళితత్వం ద్వారా మద్దతు నిస్తుంది.
ఎక్సలెన్సీస్….
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు భారతదేశపు డిజిటల్ పబ్లిక్ మౌలికసదుపాయాలు గుర్తించదగిన, భద్రమైన, సమ్మిళిత పరిష్కారాలను
చూపగల స్థితిలో ఉంది. ఇండియా అద్భుతమైన వైవిధ్యతగల దేశం. మనకు డజన్ల కొద్ది భాషలు ఉన్నాయి. వందలకొద్ది మాండలికాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి మతానికీ ఇక్కడ స్థానం ఉంది. లెక్కలేనన్ని సాంస్కృతిక పద్ధతులు ఉన్నాయి. ప్రాచీన సంప్రదాయాల నుంచి అత్యాధునిక సాంకేతికత వరకు అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇండియా ఏదో ఒక రకంగా ప్రత్యేకం. ఇలాంటి వైవిధ్యతతో వివిధ పరిష్కారాలకు అనువైన ప్రయోగకేంద్రం. ఇండియాలో విజయవంతమైన పరిష్కారం, ప్రపంచంలో ఎక్కడికైనా పనికివస్తుంది. ఇండియా తన అనుభవాలను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగాఉంది. మనం కోవిన్ ప్లాట్‌ఫారం ను కోవిడ్ మహమ్మారి సమయంలో అంతర్జాతీయ బాగు కోసం అందించాం. మనం ఇప్పుడు ఆన్‌లైన్ గ్లోబల్ పబ్లిక్ డిజిటల్ గూడ్స్ రిపాజిటరీ, ఇండియా స్టాక్ ని రూపొందించాం. ఎవరూ వెనుబడకూడదనే ఉద్దేశంతో దీనిని తీసుకువచ్చాం. ప్రత్యేకించి వర్థమాన దేశాల నుంచి ఎవరూ వెనకబడకూడదని దీనిని తెచ్చాం.
.ఎక్సలెన్సీస్….
మనం జి 20 వర్చువల్ గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిపాజిటరీని ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నాం. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలకు సంబంధించి ఉమ్మడి ఫ్రేమ్ వర్క్ పారదర్శకమైన, జావాబుదారిత్వంతో కూడిన, నిష్పాక్షిక డిజిటల్ ఆర్థిక వ్యవస్థను అందరికీ అందిస్తుంది. డిజిటల్ నైపుణ్యాలకు సంబంధించి వివిధ దేశాలమధ్య పోలికను గమనించేందుకు వీలుగా ఒక రోడ్ మ్యాప్‌ను అభివృద్ధిచేసేందుకు. డిజిటల్ నైపుణ్యాల విషయంలో వర్చువల్ సెంటర్ ఆఫ్ ఏక్సలెన్స్ ఏర్పాటుకు మీ కృషిని నేను స్వాగతిస్తున్నాను.భవిష్యత్‌కు సన్నద్ధమైన శ్రామిక శక్తిని తయారు చేయడంలో ఇదోక ముఖ్య కృషిగా చెప్పుకోవచ్చు. డిజిటల్ ఎకానమీ అంతర్జాతీయంగా విస్తరించి ఉన్నందున, భద్రతా పరమైన సవాళ్లు, ముప్పు ఉంటాయి. ఈ నేపథ్యంలో భద్రమైన, విశ్వసనీయమైన, పటిష్టమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి జి 20 ఉన్నతస్థాయి సూత్రాల విషయంలో ఏకాభిప్రాయం సాదించడం అవసరం.
మిత్రులారా,
సాంకేతికత మనల్ని మున్నెన్నడూ లేనంతగా దగ్గర చేసింది. ఇది అందరికీ సుస్థిర, సమ్మిళిత అభివృద్ధికి హామీ ఇస్తోంది. మనం, జి20 సభ్యదేశాలుగా, సమ్మిళిత, సుసంపన్న, భద్రమైన, అంతర్జాతీయ డిజిటల్ భవిష్యత్‌కు పునాదివేసే అవకాశం వచ్చింది. మనం ఆర్థిక సమ్మిళితత్వం, ఉద్పాదకతను డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాల ద్వారా సాధించవచ్చు. మనం రైతులు, చిన్న వ్యాపారులు డిజిటల్‌సాంకేతిక వినియోగించేలా ప్రోత్సహించవచ్చు. అంతర్జాతీయంగా డిజిటల్‌ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించవచ్చు. భద్రమైన, సురక్షితమైన రీతిలో కృత్రిమ మేథను వినియోగించడానికి ఫ్రేమ్ వర్క్‌ను అభివృద్ధి చేయవచ్చు.
మానవాళి ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు మనం సాంకేతికత ఆధారిత పరిష్కారాలను రూపొందించవచ్చు. ఇందుకు మన నుంచి కావలసినది, నాలుగు ‘సి’ లు అవి, కన్విక్షన్, కమిట్‌మెంట్, కో ఆర్డినేషన్, కొలాబరేషన్. ఈ దిశగా మన గ్రూప్ ముందుకు పోతుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ సమావేశంలో అత్యంత ఫలప్రదమైన చర్చలు జరగగలవని ఆకాంక్షిస్తున్నాను.
ధన్యవాదాలు..
***
Sharing my remarks at G20 Digital Economy Ministers Meeting in Bengaluru. @g20org https://t.co/ai6pbrR6wl
— Narendra Modi (@narendramodi) August 19, 2023