Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జి-20  కి భారతదేశం అధ్యక్షత అంశం పైఏర్పాటైన సమన్వయ సంఘం యొక్క తొమ్మిదో సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రిప్రిన్సిపల్ సెక్రట్రి


జి-20 సమన్వయ సంఘం తొమ్మిదో సమావేశం 2023 ఆగస్టు 30 వ తేదీ న జరగగా ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి డాక్టర్ శ్రీ పి.కె. మిశ్రా ఆ సమాశాని కి అధ్యక్షత వహించారు. న్యూ ఢిల్లీ లో జి-20 నేతల శిఖర సమ్మేళనం కోసం చేస్తున్న ఏర్పాటుల ను, ఇంకా లాజిస్టిక్స్, ప్రోటోకాల్, భద్రత మరియు ప్రసార మాధ్యమాల కు సంబంధించిన ఏర్పాటుల ను గురించి ప్రిన్సిపల్ సెక్రట్రి అడిగి తెలుసుకొన్నారు. ఈ సమావేశం లో జి-20 సెక్రటేరియట్ కు చెందిన సీనియర్ అధికారులతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం శాఖ, సంస్కృతి శాఖ, సమాచారం మరియు ప్రసారం మంత్రిత్వ శాఖ ల సీనియర్ అధికారులు, అలాగే టెలికమ్యూనికేశన్స్ విభాగం యొక్క సీనియర్ అధికారులు పాలుపంచుకొన్నారు.

 

క్షేత్ర స్థాయి లో మరియు సభా స్థలి ‘భారత్ మండపమ్’ లో జరుగుతున్న పనుల పురోగతి సంతృప్తికరం గా ఉన్నట్లు గమనించారు. భారతదేశాని కి సంబంధించి విశిష్టమైన అనుభూతి కలిగేటట్లు గా, సంస్కృతి సంబంధి ప్రదర్శనలతో పాటు ప్రజాస్వామ్యాని కి జననిగురించిన ప్రదర్శన ను భారత్ మండపమ్ లో ఏర్పాటు చేస్తున్నారు. సభా స్థలి వద్ద నెలకొల్పుతున్నటువంటి నటరాజ్ ప్రతిమ తాలూకు పురోగతి ని మరియు భారతదేశాని కి విచ్చేసే నేతల జీవన భాగస్వాముల కోసం నిర్వహించే కార్యక్రమం యొక్క పురోగతి ని కూడా ప్రిన్సిపల్ సెక్రట్రి సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని అతిథుల ను దృష్టి లో పెట్టుకొని ప్రత్యేకం గా రూపొందిస్తున్నారు.

 

జి-20 కోసం ఒక మొబైల్ ఏప్ ను జి-20 ఇండియాపేరుతో మొట్ట మొదటిసారి గా సిద్ధం చేయడం జరిగింది. ఈ మొబైల్ ఏప్ ఏండ్రాయిడ్ లో, ఐఒఎస్ లో డౌన్ లోడ్ చేసుకోవడానికి ప్రస్తుతం అందుబాటు లో ఉంది. జి-20 ప్రతినిధులు మరియు ప్రసార మాధ్యమాల కు చెందిన సభ్యులు భారత్ మండపమ్ లో ఏర్పాటు అవుతున్న ఇనొవేశన్ హబ్మరియు డిజిటల్ ఇండియా ఎక్స్ పీరియన్సియల్ హబ్మాధ్యాల ద్వారా డిజిటల్ ఇండియా ను గురించి స్వయం గా తెలుసుకోగలుగుతారు కూడాను.

 

లాజిస్టిక్స్ విషయాని కి వస్తే, విన్యాసాల ను జరుపుతున్నారు. రాబోయే రోజుల లో డ్రెస్ రిహార్సల్ స్ ను కూడా నిర్వహించ దలచారు. సంబంధిత అధికారులు భద్రత పరమైన అంశాల ను గురించి ప్రిన్సిపల్ సెక్రట్రి కి వివరించారు. ప్రజల కోసం ట్రాఫిక్ అడ్వైజరీ ని జారీ చేయడమైంది. భద్రత మరియు ప్రోటోకాల్ కారణాల వల్ల ఆంక్షల ను అమలు లోకి తీసుకు వస్తున్నప్పటికీ, వాటి వల్ల ప్రజల కు కలిగేటటువంటి అసౌకర్యాన్ని సాధ్యమైనంత తక్కువ స్థాయి కి పరిమితం చేసే విధం గా జాగ్రతల ను తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రట్రి స్పష్టం చేశారు. నగరం లో అత్యవసర సేవల కు లోటు రాకూడదని ఆయన ఆదేశించారు. అంతకు మించి, ట్రాపిక్ ఆంక్షల తాలూకు కమ్యూనికేశన్స్ ను వినియోగదారుల కు సాధ్యమైనంత మిత్రపూర్వకం గా ఉండేలా రూపొందించాలని ఆయన సూచన చేశారు.

 

శిఖర సమ్మేళనాని కి సంబంధించిన ప్రసార మాధ్యమాల ఏర్పాటుల ను కూడా సమీక్షించడమైంది. ఇంతవరకు, విదేశీ ప్రసార మాధ్యమాలు సహా 3,600 కు పైగా అభ్యర్థన లు అందాయి. ప్రాతినిధ్య లేఖల ను జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. భారత్ మండపమ్ లో ఏర్పాటు చేసే మీడియా సెంటర్ ఈ వారం చివరి కల్లా పూర్తి స్థాయి లో సిద్ధం కాగలదు.

 

శిఖర సమ్మేళనం లో ఏర్పాటు లు బ్రహ్మాండం గా ఉండే విధం గా సంబంధిత అధికారులు మరియు సంస్థ ల ముఖ్యులు శాయశక్తుల కృషి చేయాలి అంటూ ప్రిన్సిపల్ సెక్రట్రి ఆదేశించారు. వేరు వేరు ఏజెన్సీ ల మధ్య సమన్వయం సాఫీ గా ఉండేందుకు గాను భారత్ మండపమ్ లో ఒక మల్టీ-ఏజెన్సీ కంట్రోల్ రూము ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైంది. ప్రిన్సిపల్ సెక్రట్రి రాబోయే కొన్ని రోజుల లో క్షేత్ర స్థాయి సన్నద్ధత స్థితి ని పరిశీలించడం కోసం ప్రత్యక్ష పర్యవేక్షణ ను చేపట్టనున్నారు.

 

***