Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సమావేశాన్ని ఆగస్టు 31న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సమావేశాన్ని ఆగస్టు 31న ఉదయం పది గంటలకు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపమ్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తుగా తపాలా బిళ్లను, నాణేన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు.

సర్వోన్నత న్యాయస్థానం నిర్వహిస్తున్న రెండు రోజుల సమావేశంలో ఐదు కార్యాచరణ సదస్సులు భాగం కానున్నాయి. ఆ సదస్సుల్లో మౌలిక సదుపాయాలు– మానవ వనరులు, అందరికి ఉపయోగపడేందుకు ఉద్దేశించిన కోర్టురూములు, న్యాయసంబంధిత భద్రత, న్యాయ సంబంధిత శ్రేయం, వ్యాజ్య నిర్వహణ– న్యాయ సంబంధిత శిక్షణల వంటి జిల్లా న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశాలపై చర్చోపచర్చలు సాగనున్నాయి.

ప్రారంభిక కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు కు చెందిన ఇతర న్యాయమూర్తులు, కేంద్ర చట్టంన్యాయం శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ మన్ లు కూడా పాల్గొంటారు.  

 

***