ప్రస్తుతం అమలు లో ఉన్న జిఎస్ఎల్‌వి నాలుగో దశ యొక్క కొనసాగింపు కార్యక్రమాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 2021-2024 సంవత్సరాల మధ్య కాలం లో మొత్తం అయిదు జిఎస్ఎల్‌వి ప్రయోగాలు దీని లో భాగం గా ఉంటాయి.
జియో-ఇమేజింగ్, నేవిగేశన్, డేటా రిలే కమ్యూనికేశన్, ఇంకా అంతరిక్ష శాస్త్రాల కై టన్ను శ్రేణి ఉపగ్రహాలు రెండిటి ప్రయోగాని కి జిఎస్ఎల్‌వి ప్రోగ్రామ్- నాలుగో దశ మార్గాన్ని సుగమం చేస్తుంది.
ఆర్థిక ప్రభావం:
దీని కోసం మొత్తం 2,729.13 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఈ మొత్తం లో అయిదు జిఎస్ఎల్‌వి వాహక నౌకల కు అయ్యే వ్యయం, ఎసెన్శియల్ ఫెసిలిటీ ఆగ్మెంటేశన్, కార్యక్రమ నిర్వహణ, ఇంకా లాంచ్ క్యాంపేన్ తో పాటు ఇప్పటికే అమలవుతున్న జిఎస్ఎల్‌వి కంటిన్యుయేశన్ కు వెచ్చించవలసిన అదనపు నిధులు కూడా కలసివున్నాయి.
ప్రయోజనాలు:
క్లిష్టతరమైన ఉపగ్రహ మార్గనిర్దేశక సేవలు, మానవ ప్రమేయం ఉండేటటువంటి అంతరిక్ష నౌక కార్యక్రమాని కి మద్ధతు గా డేటా రిలే కమ్యూనికేశన్ మరియు అంగారక గ్రహానికి తదుపరి గ్రహాంతర యాత్ర కు అవసరమయ్యే ఉపగ్రహాల ప్రయోగాని కి జిఎస్ఎల్‌వి కంటిన్యుయేశన్ ప్రోగ్రామ్ యొక్క నాలుగో దశ ఉపయోగపడుతుంది. ఇది భారతీయ పరిశ్రమ లో ఉత్పత్తి కొనసాగేందుకు కూడా దోహదం చేయనుంది.
అమలు సంబంధిత వ్యూహం మరియు లక్ష్యాలు:
ప్రతి ఒక్క సంవత్సరం లో భారతీయ పరిశ్రమ యొక్క గరిష్ఠ స్థాయి తోడ్పాటు తో రెండు సార్ల వంతు న ఉపగ్రహాల ను ప్రయోగించవలసిన అవసరాన్ని జిఎస్ఎల్‌వి కంటిన్యుయేశన్ ప్రోగ్రామ్ తాలూకు నాలుగో దశ నెరవేర్చనుంది. అన్ని ఆపరేశనల్ ఫ్లయిట్స్ 2021-24 మధ్య కాలం లో పూర్తి కాగలవు.
ప్రధాన ప్రభావం:
జిఎస్ఎల్‌వి నిర్వహణ కమ్యూనికేశన్, ఇంకా వాతావరణ అధ్యయన సంబంధిత ఉపగ్రహాల లో 2 టన్నుల శ్రేణి శాటిలైట్ లను ప్రయోగించడం లో దేశాన్ని స్వయం సమృద్ధం చేసింది. తదుపరి తరం మార్గదర్శక ఉపగ్రహాలు, సమాచార ప్రసార సంబంధ ఉపగ్రహాలు, ఇంకా గ్రహాంతర యాత్ర లు సహా, దేశ ఆవశ్యకతల ను నెరవేర్చేటటువంటి ఇదే విధమైన ఉపగ్రహాల ప్రయోగం లో స్వయం సమృద్ధి ని మరియు తత్సంబంధ సామర్ధ్యాన్ని బలోపేతం చేయడం లో కూడాను ఈ జిఎస్ఎల్‌వి కంటిన్యుయేశన్ ప్రోగ్రామ్ తోడ్పాటు ను అందించనుంది.
పూర్వరంగం:
జిఎస్ఎల్‌వి అనేది 2 టన్నుల బరువు కలిగినటువంటి ఉపగ్రహాల ను జియోసింక్రనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ (జిటిఒ) కు పంపించడం లో స్వతంత్రమైనటువంటి సత్తా ను అందించింది. అత్యంత సంక్లిష్టమైన క్రయోజనిక్ ప్రొపల్శన్ టెక్నాలజీ లో అందె వేసిన చేయి గా
నిరూపణ కావడం జిఎస్ఎల్‌వి కంటిన్యుయేశన్ ప్రోగ్రామ్ యొక్క అతి ముఖ్య ఫలితాల లో ఒకటి. ఇది కమ్యూనికేశన్ శాటిలైట్స్ ను జిటిఒ లోపల కు ప్రవేశపెట్టేందుకు అత్యంత అవసరమైనటువంటి సాంకేతిక విజ్ఞాన సంబంధ సామర్థ్యం. అంతేకాకుండా ఇది హై థ్రస్ట్ క్రయోజనిక్ ఇంజన్ ను అభివృద్ధి చేసేందుకు కూడా బాట ను పరచింది. దీని కి తోడు తదుపరి తరానికి చెందిన వాహక నౌక అయిన జిఎస్ఎల్‌వి ఎంకె-III కి కూడా రంగాన్ని సిద్ధం చేసింది.
ఇటీవలే 2018వ సంవత్సరం డిసెంబర్ 19వ తేదీ నాడు జిఎస్ఎల్‌వి-ఎఫ్11ను ప్రయోగించడం లో సఫలమైన జిఎస్ఎల్‌వి 10 జాతీయ ఉపగ్రహాల ను విజయవంతం గా కక్ష్య లోకి ప్రవేశపెట్టింది. జిఎస్ఎల్‌వి దేశవాళీ క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ తనంతట తాను కమ్యూనికేశన్ కై ఒక ఆధారపడదగినటువంటి వాహక నౌక గా నిరూపించుకొంది. అంతేకాదు భవిష్యత్తు లో చేపట్టబోయే గ్రహాంతర యాత్రల కు కూడా ఇది సమర్ధం గా ఉంది.
జిఎస్ఎల్‌వి కంటిన్యుయేశన్ ప్రోగ్రామ్ ను తొలుత 2003వ సంవత్సరం లో మంజూరు చేయడమైంది. మరి దీని తాలూకు రెండు దశ లు ఈ సరికే పూర్తి అయ్యాయి. ఇక మూడో దశ పురోగామి పథం లో ఉంది; ఇది 2020-21 నాలుగో త్రైమాసికానికల్లా పూర్తి కాగలదని ఆశించడమైంది.
**