Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ సాహస అవార్డులను ప్రదానం చేసిన ప్రధాన మంత్రి

జాతీయ సాహస అవార్డులను ప్రదానం చేసిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 25 మంది బాలలకు ఈ రోజు జాతీయ సాహస అవార్డులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంలో అవార్డు స్వీకర్తలతో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వారి సాహసకృత్యాలు వారి యొక్క ధైర్యంతో పాటు వారి నిర్ణయాత్మకతను కూడా సూచిస్తున్నాయన్నారు. ఈ అవార్డు వారి జీవిత పరమార్థానికి ఆఖరుది కాకుండా చూసుకోవాలని, దీనిని ఒక ఆరంభంగా మాత్రమే ఎంచాలని చెబుతూ బాలలను ఆయన ఉత్సాహపరిచారు.

ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రధాన మంత్రి బాలలకు గుర్తు చేశారు. ఈ రోజు జనవరి 23వ తేదీ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి. బాలలు వీలయినంత ఎక్కువగా చదువుతూ ఉండాలని, ప్రత్యేకించి నాయకులు, క్రీడా రంగ ప్రముఖులు, మరియు తమ జీవిత కాలంలో గొప్ప పనులు సాధించిన ఇతర వ్యక్తుల జీవిత చరిత్ర పుస్తకాలను పఠించవలసిందంటూ ప్రధాన మంత్రి బాలలకు విజ్ఞ‌ప్తి చేశారు.

ధైర్యమనేది మనస్సు యొక్క స్థితి; ఆరోగ్యవంతమైన శరీరం దీనికి తోడ్పడుతుంది, అయితే ప్రధానమైన చోదక శక్తి మాత్రం మనస్సే అని శ్రీ మోదీ అన్నారు. కాబట్టి, మనం మన యొక్క మనస్సును దృఢంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారికి దక్కుతున్న ముఖస్తుతి మరియు ఖ్యాతి వారి భావి పురోగతికి అడ్డుపడకుండా జాగ్రత్త తీసుకోవాలని కూడా ప్రధాన మంత్రి బాలలకు చెప్పారు.

మహిళలు, బాలల వికాస శాఖ మంత్రి శ్రీమతి మేనకా గాంధీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు.

జాతీయ సాహస అవార్డు పథకాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ ఫేర్ (ఐసిసిడబ్ల్యు) ప్రవేశపెట్టింది. అసాధారణ సాహసకృత్యాలను, ప్రతిభావంతమైన సేవను ప్రదర్శించి ప్రత్యేకంగా నిలిచే పిల్లలకు గుర్తింపుగా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు గ్రహీతలను చూసి ఇతర బాలలు కూడా స్ఫూర్తిని పొందేటట్లు చేయడం ఈ అవార్డుల ముఖ్యోద్దేశం.

***