భారతదేశం యొక్క విపత్తు ప్రతిస్పందన వ్యవస్థ ను పటిష్ట పరచడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్ఎఫ్) లో 4 అదనపు బెటాలియన్ లను 637 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో స్థాపించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
వివరాలు:
దేశం లో గల విశాల భౌగోళిక ప్రాంతాన్ని దృష్టి లో పెట్టుకొని ప్రతిస్పందన కాలాన్ని తగ్గించడం కోసం ఈ నాలుగు అదనపు బెటాలియన్ లను స్థాపించడం జరుగుతుంది.
వీటిలో మొదట రెండు బెటాలియన్ లను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) లోను, మిగిలిన రెండు బెటాలియన్ లను సరిహద్దు భద్రత దళం (బిఎస్ఎఫ్) తో పాటు అసమ్ రైఫిల్స్ (ఎఆర్ స్ )లోను స్థాపిస్తారు.
ఆ తరువాత, ఈ నాలుగు బెటాలియన్ లను ఎన్‌డిఆర్ఎఫ్ బెటాలియన్ లుగా మార్చుతారు. అవసరాల మేరకు ఈ నాలుగు బెటాలియన్ లను జమ్ము & కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇంకా ఢిల్లీ నేశనల్ కేపిటల్ రీజియన్ లలో ఉంచుతారు.
పూర్వరంగం:
ఎన్‌డిఆర్ఎఫ్ ఒక ప్రత్యేక బలగంగా ఉంది. దీనిని 2006 సంవత్సరం లో ఏర్పాటు చేశారు. ప్రాకృతిక విపత్తుల వేళ, మానవ ప్రమేయం తో తలెత్తే విపత్తుల వేళ/ ముప్పు పరిస్థితులలో ప్రతిస్పందించడాన్ని దీనికి లక్ష్యం గా నిర్దేశించారు. ప్రస్తుతం ఎన్‌డిఆర్ఎఫ్ లో 12 బెటాలియన్ లు తక్షణ ప్రతిస్పందనకై దేశ వ్యాప్తంగా వ్యూహాత్మక ప్రాముఖ్యం గల ప్రాంతాలలో నియుక్తమయ్యాయి.
**