Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను విడుదల చేసిన ప్రధాన మంత్రి

జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను విడుదల చేసిన ప్రధాన మంత్రి


భారతదేశాన్ని విపత్తులకు తట్టుకొనేదిగా చేయడం, ఇంకా ప్రాణ నష్టాన్ని తగ్గించడం ఈ ప్రణాళిక ధ్యేయాలు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్లాన్.. ఎన్ డి ఎమ్ పి) ని విడుదల చేశారు. దేశంలో రూపొందించిన మొట్టమొదటి జాతీయ ప్రణాళిక ఇది.

భారతదేశాన్ని విపత్తులకు తట్టుకొనేదిగా చేయడంతో పాటు ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించడాన్ని ధ్యేయంగా పెట్టుకొని ఈ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక “సెండయ్ ఫ్రేమ్ వర్క్” యొక్క నాలుగు ప్రాథమ్య ప్రాతిపదికలపై ఆధారపడి రూపొందింది. ఆ నాలుగు ప్రాతిపదికలలో విపత్తు యొక్క నష్టభయాన్ని అర్థం చేసుకోవడం, విపత్తు వల్ల వాటిల్లగల రిస్క్ తాలూకు గవర్నెన్స్ ను మెరుగుపరచడం, విపత్తు వల్ల తలెత్తే నష్ట భయాన్ని తగ్గించడం కోసం (నిర్మాణ సంబంధి చర్యలు, నిర్మాణేతర సంబంధి చర్యల ద్వారా) పెట్టుబడులు పెట్టడం, విపత్తు ను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండడం, ముందస్తుగా హెచ్చరికలు చేయడం మరియు ఏదైనా విపత్తు సంభవించిన అనంతరం చేపట్టదగిన చర్యలను మరింత ఉత్తమమైన రీతిలో చేపట్టడం వంటివి ఉన్నాయి.

ప్రణాళిక ముఖ్యాంశాలు

విపత్తుల నిర్వహణ తాలూకు అన్ని దశలను, అంటే.. నివారణ, తగ్గించడం, ప్రతిస్పందన, రికవరి వంటివి ఈ ప్రణాళిక తన పరిధిలోకి తీసుకొంటుంది. ఇది ప్రభుత్వ ఏజెన్సీలు, విభాగాలన్నింటి మధ్య చక్కని సమన్వయాన్ని నెలకొల్పుతుంది. ప్రభుత్వంలోని అన్ని స్థాయిలు- పంచాయతీలు మొదలుకొని పట్టణ స్థానిక సంస్థల వరకు- అవి పోషించవలసిన పాత్రలను, వాటికి బాధ్యతలను ఈ ప్రణాళిక నిర్దేశిస్తుంది. ఆ ప్రణాళిక ప్రాంతీయ వైఖరిని కలిగి ఉంటుంది. ఇది విపత్తు నిర్వహణకు ప్రయోజనాన్ని కలిగించేదిగా ఉండడమే కాక అభివృద్ధి ప్రధానమైన ప్రణాళిక రచన పరంగా కూడా ప్రయోజనాన్ని కలగజేయగలదు.

దీనిని విపత్తు నిర్వహణ తాలూకు దశలన్నింటిలోను ప్రమాణాల వంతున అమలు చేయదగ్గ రీతిలో రూపొందించారు. ఇది ముందుగానే హెచ్చరికలు చేయడం, సమాచారాన్ని వ్యాప్తిలోకి తీసుకురావడం, వైద్యపరమైన సంరక్షణను అందజేయడం, ఇంధనం, రవాణా, అన్వేషణ మరియు కాపాడడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం వగైరా ప్రధాన ప్రక్రియలను గుర్తిస్తుంది. తత్ఫలితంగా- ఏజెన్సీలు ఆపద సమయంలో దీటుగా ప్రతిస్పందించడానికి- ఈ కార్యక్రమాలను అన్నింటినీ చేపట్టిందీ లేనిదీ ఒకసారి సరిచూసుకొనేందుకు వీలవుతుంది. రికవరి కి ఉద్దేశించిన ఒక జనరలైజ్ డ్ ఫ్రేమ్ వర్క్ ను, పరిస్థితిని అంచనా వేసి తగిన పరిష్కార చర్యలు తీసుకొనే సారళ్యాన్ని కూడా ఈ ప్రణాళిక అందిస్తుంది.

విపత్తును సర్దుబాటు చేసుకోవడానికి ప్రజా సమూహాలను సన్నద్ధులను చేసేందుకు సమాచారం, విద్య మరియు కమ్యూనికేషన్ కార్యకలాపాలపైన మరింతగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నదని ఈ ప్రణాళిక స్పష్టం చేస్తున్నది.

ఈ కార్యక్రమంలో హోం అఫైర్స్ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్, ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు, ఇంకా హోం అఫైర్స్ మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం మరియు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ల లోని అనుభవయుక్త అధికారులు పాల్గొన్నారు.