Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ విజ్ఞ‌ానశాస్త్ర దినోత్సవం ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


ఈ రోజు జాతీయ విజ్ఞ‌ానశాస్త్ర దినోత్సవంఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ అభినందనలు తెలిపారుఆయన ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూఅందులో:

‘‘జాతీయ విజ్ఞ‌ానశాస్త్ర దినోత్సవం సందర్భంగా విజ్ఞ‌ానశాస్త్రం విషయంలో మక్కువను కలిగి ఉన్న వారందరికీముఖ్యంగా మన యువ ఆవిష్కర్తలకు ఇవే అభినందనలురండిసైన్సుకూనవకల్పనలకూ మరింత మంది ఆదరణ లభించేటట్లుగానుసైన్సును ‘వికసిత్ భారత్‌’ను సాధించడానికి వినియోగించుకొనేందుకుగాను మనం కృషిచేద్దాం.

మన్ కీ బాత్’ (‘మనసులో మాట’కార్యక్రమ పరంపరలో భాగంగా ఈ నెల నిర్వహించిన ఎపిసోడ్‌లో ‘వన్ డే యాజ్ ఎ సైంటిస్ట్’ను గురించి నేను ప్రస్తావించాను.. యువతీయువకులు వీలు చేసుకొనిఒక రోజున విజ్ఞ‌ానశాస్త్రానికి సంబంధించిన ఏదైనా ఒక కార్యకలాపాన్ని చేపట్టాలన్నది దీని ఉద్దేశం’’ అని పేర్కొన్నారు.

 

***