Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ఎంతో సంతోషదాయకమైన విషయం, ప్రత్యేకించి భారతదేశం అంతటా కష్టపడి పనిచేసే మన పసుపు రైతులకుఎంతో ప్రయోజనకరం: ప్రధాన మంత్రి


జాతీయ పసుపు బోర్డు ఏర్పాటును ప్రశంసించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, పసుపు ఉత్పత్తిలో నూతన ఆవిష్కరణలకు, ప్రపంచవ్యాప్త ప్రోత్సాహానికి, విలువ జోడింపునకు ఇది మంచి అవకాశాలను కల్పిస్తుందని అన్నారు.

కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ‘ఎక్స్‘ పై చేసిన  పోస్ట్ కు స్పందిస్తూ, “జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చాలా సంతోషకరమైన విషయం, ముఖ్యంగా భారతదేశం అంతటా కష్టపడి పనిచేసే మన పసుపు రైతులకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఇది పసుపు ఉత్పత్తిలో సృజనాత్మకత, అంతర్జాతీయంగా ప్రోత్సాహం, విలువ జోడింపునకు మంచి అవకాశాలను కల్పిస్తుంది. ఇది సరఫరా వ్యవస్థలను బలోపేతం చేస్తుంది, రైతులకు, వినియోగదారులకు సమానంగా ప్రయోజనం చేకూరుస్తుంది” అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. 

 

***