Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ కు ప్రధాని నివాళి; వివిధ క్రీడల్లో అవార్ఢులు పొందుతున్న క్రీడాకారులు, కోచ్ లకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ


జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ కు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. వివిధ క్రీడల్లో అవార్ఢులు పొందుతున్న క్రీడాకారులు, కోచ్ లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

“జాతీయ క్రీడల దినోత్సవ సందర్భంగా ధ్యాన్ చంద్ కు నివాళులు, క్రీడాభిమానులకు శుభాశీసులు. ఈ దేశం క్రీడలు, క్రీడాకారుల స్ఫూర్తితో ఓ వెలుగు వెలుగుతోంది.

వివిధ క్రీడల్లో అవార్ఢులు పొందుతున్న క్రీడాకారులకు, శిక్షణనిచ్చే కోచ్ లకు అభినందనలు. క్రీడాకారుల కఠిన కఠోర దీక్షకు వాళ్ల కృషికి నా అభినందనలు” అని ప్రధాని నరేంద్రమోదీ క్రీడాకారులనుద్దేశించి అన్నారు.