ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ‘జాతిర్ పిత’ బంగబంధు, శేఖ్ ముజీబుర్ రహమాన్ యొక్క శతజయంతి సమారోహం లో ఒక వీడియో సందేశాన్ని అందించారు.
గడచిన శతాబ్ది లో ఆవిర్భవించిన మహనీయుల లో శేఖ్ ముజీబుర్ రహమాన్ ఒకరు అంటూ శ్రీ మోదీ అభివర్ణించారు. ‘‘వారి యొక్క యావత్తు జీవితం మనకు అందరికీ ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రేరణ ను ప్రసాదిస్తుంది’’ అని ఆయన అన్నారు.
బంగబంధు ను ధైర్యశాలి గా, శాంతి పిపాసి గా ప్రధాన మంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ యొక్క ‘జాతిర్ పిత’ ఆ కాలం లో సవాళ్ళ ను ఎదుర్కొనేందుకు యువత లో స్ఫూర్తి ని నింపారు అని శ్రీ మోదీ అన్నారు.
తిరోగామి ధోరణి ని ఒంటబట్టించుకొన్న ఒక క్రూరమైన హయాం అన్ని ప్రజాస్వామిక విలువల ను బేఖాతరు చేసి ‘బాంగ్లా భూమి’ మీద అన్యాయపు ఏలుబడి ని వ్యాపింపచేసిందని, ఆ దేశ నివాసుల జీవితాల ను దుస్సహం చేసిందని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. బంగబంధు ను ప్రధాన మంత్రి శ్రీ మోదీ స్మరించుకొంటూ సదరు అత్యంత కష్టదాయకమైన కాలం బారి నుండి మరియు మారణకాండ బారి నుండి బాంగ్లాదేశ్ ను బయట కు తీసుకు వచ్చి, దాని ని ఒక ప్రగతిశీలమైనటువంటి మరియు సకారాత్మకమైనటువంటి సమాజం గా తీర్చిదిద్దడం లో బంగబంధు ఆయన యొక్క జీవితం లోని క్షణ క్షణాన్ని సమర్పణం చేశారన్నారు.
‘‘ద్వేషం, నకారాత్మకత లు ఏ దేశం అభివృద్ధి కి అయినా పునాదలు గా ఎన్నటికీ నిలువజాలవు అని బంగబంధు సుస్పష్టం గా ఎరుగుదురు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. అయితే, బంగబంధు యొక్క ప్రయత్నాలు మరియు ఆలోచనలు కొందరికి గిట్టలేదని, వారు ఆయన ను మన నుండి దూరం చేశారని శ్రీ మోదీ అన్నారు.
‘‘భయం మరియు హింస అనేవాటిని రాజకీయ అస్త్రాలు గా చేసుకొని, దౌత్యం గా చేసుకొని ఒక దేశ ప్రజల ను మరియు ఒక సమాజాన్ని ఏ విధం గా వినాశం పాలు చేయవచ్చో మనమంతా గమనిస్తున్నాము. ప్రస్తుతం హింస మరియు భయం ఈ రెండిటి మద్ధతుదారులు ఎక్కడ తిష్ట వేసిందీ కూడా ప్రపంచం వీక్షిస్తున్నది. కాగా, బాంగ్లాదేశ్ క్రొత్త శిఖరాల కు ఎగబాకుతున్నది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
శేఖ్ ముజీబుర్ రహమాన్ కలగన్న ‘శోనార్ బాంగ్లా’ మాదిరి గా దేశాన్ని తీర్చిదిద్దుకోవడం కోసం బాంగ్లాదేశ్ ప్రజలు రేయింబగళ్ళు తమను తాము సమర్పణం చేసుకోవడాన్ని చూస్తున్న తనకు ఎంతో సంతోషం వేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.
శేఖ్ హసీనా యొక్క నాయకత్వం లో అభివృద్ధి ప్రధానమైనటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకుపోయేటటువంటి విధానాల బాట లో బంగబంధు అందించిన ప్రేరణ తో బాంగ్లాదేశ్ పురోగమిస్తోందంటూ ప్రధాన మంత్రి ప్రశంసలు కురిపించారు. ఆర్థిక వ్యవస్థ, క్రీడలు, మరి ఇతర సమాజిక సూచీల లో బాంగ్లాదేశ్ సరిక్రొత్త కొలమానాల ను ఏర్పరుస్తున్నదని కూడా ఆయన అన్నారు. నైపుణ్యాలు, విద్యార్జన, ఆరోగ్యం, మహిళల కు సాధికారిత కల్పన, ఇంకా మైక్రో ఫినాన్స్.. తదితర అనేక రంగాల లో బాంగ్లాదేశ్ ఇదివరకు ఎరుగనటువంటి ప్రగతి ని సాధిస్తోందంటూ ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.
‘‘గడచిన కొన్ని సంవత్సరాల లో బాంగ్లాదేశ్ మరియు భారతదేశం ద్వైపాక్షిక సంబంధాల లో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించాయి. అంతేకాదు, మన భాగస్వామ్యాని కి ఒక నూతన దిశ ను మరియు ఒక నూతన పార్శ్వాన్ని జోడించాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సంక్లిష్టమైనటువంటి సరిహద్దు సంబంధిత అంశాల ను ఒక సమరస రీతి న పరిష్కరించుకోవడం ఉభయ దేశాల నడుమ విశ్వాసం అధికం అవుతున్న కారణంగానే సాధ్యపడిందన్నారు.
బాంగ్లాదేశ్ దక్షిణ ఆసియా లో భారతదేశాని కి అతిపెద్ద వ్యాపార భాగస్వామి గానే కాకుండా, ఒక అభివృద్ధి ప్రధాన భాగస్తురాలు కూడా అని ఆయన పేర్కొన్నారు. విద్యుత్తు పంపిణీ, ఫ్రెండ్ శిప్ పైప్ లైన్, రహదారి మార్గాలు, రైలు మార్గాలు, ఇంటర్ నెట్, ఎయర్ వేస్, ఇంకా జల మార్గాలు వంటి సంధానాన్ని పెంపొందించే పలు రంగాల లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు.
శ్రీయుతులు టాగూర్, కాజీ నజ్‌రూల్ ఇస్లామ్, ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్, లాలాన్ శాహ్, జీబానందా దాస్ మరియు ఈశ్వర్ చంద్ర్ విద్యాసాగర్ ల వంటి పండితుల నుండి ఉభయ దేశాల కు లభించిన వారసత్వ సంపద అని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు.
బంగబంధు యొక్క ప్రేరణ, వారసత్వం ఉభయ దేశాల వారసత్వాన్ని మరింత సంపూర్ణమైంది గాను, దృఢతరమైంది గాను మార్చివేసిందని, మరి బంగబంధు చూపిన మార్గం గడచిన దశాబ్ద కాలం లో రెండు దేశాల భాగస్వామ్యాని కి, పురోగతి కి, ఇంకా సమృద్ధి కి ఒక బలమైన పునాది ని వేసిందని ప్రధాన మంత్రి అన్నారు.
రెండు దేశాల లో రాబోయే చారిత్రిక ఘట్టాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వాటిలో బాంగ్లాదేశ్ విముక్తి తాలూకు 50వ వార్షికోత్సవం వచ్చే సంవత్సరం లో ఉందని, అలాగే భారతదేశాని కి స్వాతంత్య్రం లభించిన తరువాత 75వ వార్షికోత్సవం 2022వ సంవత్సరం లో రానుందని ఆయన తెలిపారు. ఈ రెండు చారిత్రిక ఘట్టాలు బాంగ్లాదేశ్ మరియు భారతదేశం ల అభివృద్ధి ని క్రొత్త శిఖరాల కు చేర్చడం మాత్రమే కాకుండా, ఉభయ దేశాల మధ్య మైత్రీ బంధాన్ని దృఢతరం చేస్తాయని కూడా ప్రధాన మంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
शेख हसीना जी ने मुझे इस ऐतिहासिक समारोह का हिस्सा बनने के लिए व्यक्तिगत तौर पर निमंत्रण दिया था।
— PMO India (@PMOIndia) March 17, 2020
लेकिन कोरोना वायरस की वजह से ये संभव नहीं हो पाया।
फिर शेख हसीना जी ने ही विकल्प दिया, और इसलिए मैं वीडियो के माध्यम से आपसे जुड़ रहा हूं: PM @narendramodi
बंगबंधु शेख मुजीबुर-रहमान पिछली सदी के महान व्यक्तित्वों में से एक थे। उनका पूरा जीवन, हम सभी के लिए बहुत बड़ी प्रेरणा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2020
आज मुझे बहुत खुशी होती है, जब देखता हूं कि बांग्लादेश के लोग, किस तरह दिन-रात अपने प्यारे देश को शेख मुजीबुर-रहमान के सपनों का ‘शोनार-बांग्ला’ बनाने में जुटे हुए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2020
एक दमनकारी, अत्याचारी शासन ने, लोकतांत्रिक मूल्यों को नकारने वाली व्यवस्था ने, किस तरह बांग्ला भूमि के साथ अन्याय किया, उसके लोगों को तबाह किया, ये हम सभी भली-भांति जानते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2020
उस दौर में जो तबाही मचाई गई थी, जो Genocide हुआ, उससे बांग्लादेश को बाहर निकालने के लिए, एक Positive और Progressive Society के निर्माण के लिए उन्होंने अपना पल-पल समर्पित कर दिया था: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2020
बंगबंधु की प्रेरणा से और प्रधानमंत्री शेख हसीना जी के नेतृत्व में बांग्लादेश आज जिस प्रकार Inclusive और Development Oriented Policies के साथ आगे बढ़ रहा है, वो बहुत प्रशंसनीय है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2020
मुझे इस बात की भी खुशी है कि बीते 5-6 वर्षों में भारत और बांग्लादेश ने आपसी रिश्तों का भी शोनाली अध्याय गढ़ा है, अपनी पार्टनरशिप को नई दिशा, नए आयाम दिए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2020
ये हम दोनों देशों में बढ़ता हुआ विश्वास है, जिसके कारण हम दशकों से चले आ रहे Land Boundary, Maritime Boundary से जुड़े Complex मुद्दों को, शांति से सुलझाने में सफल रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2020
बांग्लादेश आज साउथ एशिया में भारत का सबसे बड़ा ट्रेडिंग पार्टनर भी है और सबसे बड़ा डेवलपमेंट पार्टनर भी है।
— PMO India (@PMOIndia) March 17, 2020
भारत में बनी बिजली से बांग्लादेश के लाखों घर और फैक्ट्रियां रोशन हो रही है। Friendship Pipeline के माध्यम से एक नया Dimension हमारे रिश्तों में जुड़ा है: PM @narendramodi
हमारी विरासत टैगोर की है, काज़ी नज़रुल इस्लाम, उस्ताद अलाउद्दीन खान, लालॉन शाह, जीबानंदा दास और ईश्वर चंद्र विद्यासागर जैसे मनीषियों की है।
— PMO India (@PMOIndia) March 17, 2020
इस विरासत को बंगबंधु की प्रेरणा, उनकी Legacy ने और व्यापकता दी है: PM @narendramodi
भारत और बांग्लादेश के आत्मीय संबंध, इस साझा विरासत की मज़बूत नींव पर ही गढ़े गए हैं।
— PMO India (@PMOIndia) March 17, 2020
हमारी यही विरासत, हमारे आत्मीय संबंध, बंगबंधु का दिखाया मार्ग, इस दशक में भी दोनों देशों की Partnership, Progress और Prosperity का मजबूत आधार हैं: PM @narendramodi
अगले वर्ष बांग्लादेश की ‘मुक्ति’ के 50 वर्ष होंगे और उससे अगले वर्ष यानि 2022 में भारत की आज़ादी के 75 वर्ष होने वाले हैं।
— PMO India (@PMOIndia) March 17, 2020
मुझे विश्वास है कि ये दोनों पड़ाव, भारत-बांग्लादेश के विकास को नई ऊँचाई पर पहुंचाने के साथ ही, दोनों देशों की मित्रता को भी नई बुलंदी देंगे: PM @narendramodi