Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జల్ జీవన్ మిషన్ మహిళా సాధికారతను, ప్రత్యేకించి మన గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతను పెంపొందిస్తోంది: ప్రధానమంత్రి


మహిళా సాధికారతను, ప్రత్యేకించి మన గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సాధికారతను జల్ జీవన్ మిషన్ పెంపొందింపచేస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టంచేశారు. స్వచ్ఛమైన నీరు మహిళలకు వారి ఇంటి ముంగిటే లభిస్తుండడంతో, వారు ఇక నైపుణ్యాభివృద్ధిపైన, స్వయంసమృద్ధిపైన దృష్టిని కేంద్రీకరించగలుగుతారని ఆయన అన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక దృశ్యప్రధాన సందేశాన్ని ప్రధాని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘జల్ జీవన్ మిషన్ మహిళా సాధికారతను, ప్రత్యేకించి మన గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతను మరింత మేలైన దృష్టికోణంతో ముందుకు తీసుకుపోతోంది.

స్వచ్ఛమైన నీరు మహిళలకు వారి ఇంటి వద్దే అందుబాటులోకి రావడంతో, వారు ఇక  నైపుణ్యాభివృద్ధిపైన, స్వయంసమృద్ధిపైన తమ దృష్టిని కేంద్రీకరించగలుగుతారు’’.