Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జల్ జీవన్ మిషన్‌ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం: ప్రధానమంత్రి పునరుద్ఘాటన


   ల్‌జీవన్‌ మిషన్‌ను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ప్రజారోగ్యంలో పరిశుభ్ర-సురక్షిత తాగునీటి సౌలభ్యం ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. కాగా, సార్వత్రిక కొళాయి నీటి సరఫరా ద్వారా డయేరియా వంటి వ్యాధివల్ల సంభవించే మరణాల నుంచి 4 లక్షల మందికి ప్రారణరక్షణ లభిస్తుందని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో వెల్లడించడాన్ని కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్‌ వరుస ట్వీట్లద్వారా ప్రకటించారు.

ఈ వరుస ట్వీట్లకు స్పందనగా పంపిన సందేశంలో:

“ప్రతి భారతీయుడికీ పరిశుభ్ర-సురక్షిత తాగునీటి సౌలభ్యమే ప్రజారోగ్యానికి పటిష్ట పునాది. అందుకే దేశంలో ప్రతి ఒక్కరికీ కొళాయిద్వారా నీరందించే లక్ష్యంతో జల్‌జీవన్ మిషన్ రూపొందించబడింది. ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు నూతనోత్తేజం కల్పించడాన్ని కొనసాగిస్తాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.