Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జల్జీవన్ మిశన్ లో భాగం గా హర్ ఘర్ జల్ ఉత్సవ్ ను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారాప్రసంగించిన ప్రధాన మంత్రి

జల్జీవన్ మిశన్ లో భాగం గా హర్ ఘర్ జల్ ఉత్సవ్ ను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారాప్రసంగించిన ప్రధాన మంత్రి


జల్ జీవన్ మిశన్ లో భాగం గా జరిగిన హర్ ఘర్ జల్ ఉత్సవ్ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం గోవా లోని పణజీ లో జరిగింది. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్ తదితరులు ఉన్నారు. మంగళప్రదమైనటువంటి జన్మాష్టమి సందర్బం లో శ్రీకృష్ణ భక్తుల కు ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ, ‘అమృత కాలం’ లో భారతదేశం పాటుపడుతున్నటువంటి మూడు భారీ లక్ష్యాల కు సంబంధించిన ముఖ్యమైన మూడు మైలురాళ్ల ను చూసుకొని భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వపడుతున్నారని, ఆ మైలురాళ్లు ఈ రోజు న ఆవిష్కారం అయ్యాయన్నారు. ‘‘వాటి లో, గొట్టపు మార్గాల ద్వారా స్వచ్ఛమైన నీటి ని అందుకొనేటట్టు గా 10 కోట్ల గ్రామీణ కుటుంబాల ను ఈ రోజు న జోడించడమనేది ఒకటో మైలురాయి అని చెప్పాలి. ప్రతి కుటుంబాని కి జలాన్ని అందజేయాలి అనే ప్రభుత్వ ప్రచార ఉద్యమం యొక్క పెద్ద సాఫల్యం గా ఇది నిలుస్తోంది. ఇది ‘‘సబ్ కా ప్రయాస్’’ తాలూకు ఒక ఘనమైనటువంటి నిదర్శన గా ఉంది. ప్రతి ఒక్క కుటుంబం గొట్టపు మార్గం ద్వారా నీటి ని అందుకొంటున్న హర్ ఘర్ జల్ ధ్రువీకరణ ను పొందినటువంటి ప్రథమ రాష్ట్రం గా గోవా నిలవడం రెండో మైలురాయి’’ అని ఆయన అన్నారు. దాద్ రా నగర్ హవేలీ మరియు దమన్ దీవ్ ఈ అసాధారణ కార్యాన్ని సాధించిన మొదటి కేంద్ర పాలిత ప్రాంతాలు గా నిలచాయి అని కూడా ఆయన గుర్తించారు. ఈ దిశ లో చేసిన కృషి కి గాను ప్రజల ను, ప్రభుత్వాన్ని మరియు స్థానిక ప్రభుత్వ సంస్థల ను మంత్రి కొనియాడారు. అనేక రాష్ట్రాలు ఈ జాబితా లో త్వరలో చేరనున్నాయి అని ఆయన తెలియజేశారు.

దేశం లోని వేరువేరు రాష్ట్రాల కు చెందిన ఒక లక్ష గ్రామాలు ఒడిఎఫ్ ప్లస్ గా మారడం మూడో కార్యసిద్ధి అని ప్రధాన మంత్రి వెల్లడించారు. కొన్ని సంవత్సరాల కిందట ఓపెన్ డిఫకేశన్ ఫ్రీ (ఒడిఎఫ్.. మల మూత్రాదుల విసర్జన బారి నుంచి విముక్తం అయినటువంటి ఆరుబయలు ప్రాంతాలు కలిగిన) దేశం గా ప్రకటించిన అనంతరం, గ్రామాల ను ఒడిఎఫ్ ప్లస్ స్థాయి కి చేర్చాలన్నదే తదుపరి సంకల్పం గా ఉండింది; అంటే, గ్రామాల లో సాముదాయిక మరుగుదొడ్లు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, గ్రే వాటర్ మేనిజ్ మెంట్ లతో పాటు గోబర్ ధన్ ప్రాజెక్టు లు నిర్వహణ లో ఉండాలి అన్నదే.

ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి జల భద్రత పరమైన సవాలు ను గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్తూ, అభివృద్ధి చెందిన భారతదేశం (‘వికసిత్ భారత్’) సంకల్పాన్ని నెరవేర్చుకోవడం లో నీటి ఎద్దడి అనేది ఒక ప్రధానమైన అడ్డంకి కాగలదు అన్నారు. ‘‘మా ప్రభుత్వం జల భద్రత సంబంధి ప్రాజెక్టుల కోసం గడచిన 8 సంవత్సరాలు గా నిరంతరమూ పాటుపడుతూ వస్తున్నది’’ అని ఆయన అన్నారు. స్వార్థం నిహితమైన స్వల్ప కాలిక విధానాని కి మిన్న గా దీర్ఘ కాలిక విధానం అవసరం అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ, ‘‘ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అందుకోసం ఒక దేశాన్ని నిర్మించడానికి పాటుపడవలసినంత కఠోరం గా పనిచేయనక్కరలేదు అనేది వాస్తవం. మేమంతా దేశ నిర్మాణం కోసం కృషి చేయాలని కంకణం కట్టుకొన్నాం. ఈ కారణం గానే మేం వర్తమాన సవాళ్ల మరియు భావి సవాళ్ల విషయం లో పనిచేస్తున్నాం. ఎవరు దేశాన్ని గురించి పట్టించుకోరో, వారు దేశం యొక్క వర్తమానం తో పాటు భవిష్యత్తు ను పాడు చేసే విషయం లో ఆందోళన చెందరు. అటువంటి వారు తప్పక పెద్ద పెద్ద కబురు లు చెబుతారు గాని జలం విషయం లో ఒక విశాలమైన దృష్టికోణం తో ఎన్నటికీ పని చేయలేరు.’’ అన్నారు.

జల భద్రత కు పూచీ పడటానికి గాను ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి బహుళ ముఖ విధానాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘కేచ్ ద రేన్’ (వర్షపు నీటి ని ఒడిసిపట్టండి), అటల్ భూజల్ స్కీము, ప్రతి జిల్లా లో 75 అమృత సరోవరాలను ఏర్పాటు చేయడం, నదుల ను కలపడం, ఇంకా జల్ జీవన్ అభియాన్ ల వంటి కార్యక్రమాల ను గురించి వివరించారు. భారతదేవం లో రాంసర్ మాగాణి నేల ప్రదేశాల సంఖ్య 75 కు పెరిగిందని, వాటిలో 50 ప్రదేశాల ను గడచిన 8 ఏళ్ల లో జోడించడం జరిగిందని ఆయన అన్నారు.

కేవలం 3 సంవత్సరాల లో 7 కోట్ల గ్రామీణ కుటుంబాల కు గొట్టపు మార్గాల ద్వారా నీటి సరఫరా సదుపాయాన్ని సమకూర్చిన అసాధారణమైనటువంటి కార్యాన్ని ఆయన కొనియాడుతూ, ఇది ఇలా ఉంటే దేశాని కి స్వాతంత్ర్యం లభించిన తరువాత 7 దశాబ్దుల లో 3 కోట్ల కుటుంబాలు మాత్రమే ఈ సదుపాయాని కి నోచుకొన్నాయి అని వివరించారు. ‘‘అమృత కాలాని కి మరింత మంచి ఆరంభం అంటూ ఉండబోదు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘జలం కోసం బయటి వనరుల పై ఆధారపడవలసివచ్చిన కుటుంబాలు దేశం లో దాదాపు గా 16 కోట్ల సంఖ్య లో ఉండేవి. ఈ మౌలిక అవసరమైనటువంటి నీటి కోసం అంత భారీ సంఖ్య లోని పల్లెవాసుల ను పోట్లాడుకొనే స్థితి లో ఉంచలేం మనం. అందువల్లే 3 సంవత్సరాల క్రితం నేను ఎర్ర కోట మీది నుంచి ప్రసంగించేటప్పడు, ప్రతి ఇల్లూ గొట్టపు మార్గం ద్వారా నీటి ని అందుకొంటుంది అని ప్రకటించాను. ఈ ప్రచార ఉద్యమానికై మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయల ను వెచ్చించడం జరుగుతున్నది. 100 సంవత్సరాల లో ఎరుగనంతటి మహా మహమ్మారి కారణం గా అవాంతరాలు ఎదురైనప్పటికీ ఈ అభియాన్ యొక్క వేగం ఎంతమాత్రం నెమ్మదించింది లేదు. ఈ యొక్క నిరంతర ప్రయాస ల ఫలితం గా దేశం 7 దశాబ్దాల లో జరిగిన పని కి రెండింతల పని ని కేవలం 3 సంవత్సరాల లోనే పూర్తి చేసింది. మనిషి కేంద్ర స్థానం లో ఉండే అభివృద్ధి కి ఇది ఒక దృష్టాంతం.. ఈ మారు ఎర్ర కోట మీది నుంచి నేను చెప్పింది ఇదే.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

హర్ ఘర్ జల్ (ఇంటింటికి నీటి సరఫరా) యొక్క లబ్ధి భావి తరాని కి మరియు మహిళల కు ఎలా ఉండబోయేదీ ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. నీటి కి సంబంధించిన సమస్యల ను మౌనం గా భరించేది ప్రధానం గా స్త్రీ లు.. అలాంటి మహిళ లు ప్రభుత్వం యొక్క ప్రయాసల లో కేంద్ర స్థానం లో నిలుస్తున్నారు అని ఆయన అన్నారు. ఇది నారిమణుల కు జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తూ, మరి జల పరిపాలన లో వారికి ఒక ముఖ్య పాత్ర ను ఇస్తున్నది. ‘‘జల్ జీవన్ అభియాన్ అనేది ఒక ప్రభుత్వ పథకం ఒక్కటే కాదు కానీ అది సముదాయం ద్వారా సముదాయం కోసం నడపబడుతున్నటువంటి పథకం’’ అని ఆయన అన్నారు.

జల్ జీవన్ మిశన్ యొక్క సాఫల్యానికి నాలుగు మూల స్తంభాలు ఉన్నాయి; అవి.. ప్రజల భాగస్వామ్యం, సంబంధి వర్గాల (స్టేక్ హోల్డర్స్) భాగస్వామ్యం, రాజకీయ సంకల్పం మరియు వనరుల ను వీలయినంత అనుకూలమైన విధం గా వినియోగించుకోవడం.. అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రచార ఉద్యమం లో స్థానిక ప్రజానీకాని కి, గ్రామ సభల కు, మరియు ఇతర స్థానిక పరిపాలన సంస్థల కు ఇదివరకు ఎన్నడు లేనంత స్థాయి లో భూమిక ను ఇవ్వడం జరిగింది. నీటి ని పరీక్షించడం ఎలాగో స్థానిక మహిళల కు శిక్షణ ను ఇవ్వడం జరుగుతున్నది. వారు ‘పానీ సమితిల’ సభ్యులు గా కూడా ఉన్నారు. పంచాయతులు, ప్రభుత్వేతర సంస్థ లు (ఎన్ జిఒ స్), విద్య బోధన సంస్థలు మరియు అన్ని మంత్రిత్వశాఖ ల ఉత్సాహాన్ని చూస్తే సంబంధి వర్గాల భాగస్వామ్యం స్పష్టం గా తెలుస్తోంది. అదే విధం గా, గడచిన 7 దశాబ్దాల లో సాధించిన దాని కంటే ఎంతో ఎక్కువ గా గత 7 సంవత్సరాల లో సాధించడం అనేది రాజకీయ సంకల్పాన్ని సూచిస్తున్నది. గొట్టపుమార్గాల ద్వారా నీటి సరఫరా అందరికీ లభించినప్పుడు ఎటువంటి భేదభావాని కి ఉన్నటువంటి ఆస్కారాన్ని అయినా నివారించగలుగుతుంది అని కూడా ఆయన అన్నారు. వనరుల ను అత్యంత అనుకూల స్థాయి లో వినియోగించుకోవడం అనేది ఎమ్ జిఎన్ఆర్ఇజిఎ వంటి పథకాల సమన్వయం లో ప్రతిబింబిస్తున్నది.

జల సంబంధి ఆస్తుల కు జియోటేగింగ్, నీటి సరఫరా ఇంకా నాణ్యత నియంత్రణ ల కోసం ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత పరిష్కార మార్గాలు వంటి ప్రక్రియల లో సాంకేతిక విజ్ఞ‌ానాన్ని వినియోగించుకోవడం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రజల శక్తి, నారీ శక్తి, మరియు సాంకేతిక విజ్ఞ‌ానం యొక్క శక్తి.. ఇవి జల్ జీవన్ మిశన్ కు అండదండల ను అందిస్తున్నాయన్నారు.

*****

DS/TS