Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జర్మన్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఏంజెలా మెర్కెల్‌తో కలసి నిర్వహించిన సంయుక్త విలేఖరుల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన పాఠం.

చాన్స్‌లర్‌ మెర్కెల్‌

జర్మనీ ప్రతినిధి బృంద సభ్యులు,

నా సహచరులు,

మీడియా ప్రతినిధులారా!

చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ను, ఆ మెతో పాటు భారతదేశ పర్యటనకు వచ్చిన ప్రతిష్ఠాత్మక బృందాన్ని స్వాగతించడం నాకు అత్యంత సంతోషదాయకమైన విషయం.

రెండూ జర్మనీలు ఏకమై ఇప్పటికి 25 ఏళ్లు. ఈ సమైక్య రజతోత్సవం సందర్భంగా భారత ప్రజానీకం తరఫున నేను జర్మనీకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇన్నేళ్లుగా మీరు దేశ విదేశాల్లో సాధించిన ఘన కీర్తిని,, అద్భుత గతాన్ని ఈ ముఖ్యమైన మైలురాయి సందర్భంగా గర్వకారణంగా తలచుకోవచ్చు. ఐ రోపా ఖండం, యావత్‌ ప్రపంచము కష్టకాలం ఎదుర్కొంటున్న ఈ తరుణంలో జర్మనీకి ఛాన్స్‌లర్‌ మెర్కెల్‌ నాయకత్వం సరికొత్త వి శ్వాసాన్ని, భరోసాను అందించగలదని నేను నమ్ముతున్నాను.

మీ ప్రాంతంలో ముందే నిర్ణయింపబడిన అనేక కార్యక్రమాల్లో మీరు పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, భారత్‌ను సందర్శించాలని మీరు నిర్ణయించుకోవడం గమనార్హం. మీతో వచ్చిన ప్రతిష్ఠాత్మక ప్రతినిధి బృందాన్ని చూస్తే చాలు, భారత్‌లో సంబంధాలకు మీరు ఎంత విలువ ఇస్తున్నారో అ ర్థమవుతుంది. అంతర్‌ప్రభుత్వ సంప్రదింపుల్లో మీరు ప్రాముఖ్యతతో పాల్గొంటారో కూడా అ వగతమవుతుంది. భారత్‌- జర్మనీ రెండు దేశాల మధ్య సంబంధాల్లోని ఈ ప్రగతికి మీ నిబద్ధతే అత్యంత కీలకమైనది. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.

ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు అనే విధానం అత్యంత వి శేషమైనది, ప్రత్యేకమైనది. దీనివల్లే మన రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఎంతో పురోగతి సాధ్యమైంది. దీనికి తోడు గత ఏడాది కాలంగా , మన రెండు పక్షాలూ సంప్రదింపుల ప్రక్రియను మరింత దృఢపరచుకున్నాయి. భారత్‌ను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే క్రమంలో జర్మనీని మేం మా సహజ భాగస్వామిగా భావిస్తున్నాం. జర్మనీ- భారత్‌ రెండింటి ప్రాథమ్యాలూ ఏ కరూపమైనవి. ఇవి పరస్పర సుహృద్భావానికి ఉపయోగపడేవి.

ఆర్థిక సంబంధాల బలోపేతంపైనే మన రెండు దేశాలూ దృష్టి పెట్టాల్సి ఉంది. అ యితే అదే సమయంలో, అపరిమితమైన సవాళ్లకు, అవకాశాలకు నెలవైన ఈ ప్రపంచానికి, మరింత మానవీయమైన, శాంతియుతమైన, న్యాయమైన, సుస్థిర భవిష్యత్తును కల్పించడంలో కూడా భారత్‌, జర్మనీలు పటిష్ఠ భాగస్వాములుగా ఉండగలవని నేను వి శ్వసిస్తున్నాను. కలసి పనిచేయడంలో మనకు అద్భుతమైన చరిత్ర ఉంది. విలువల వారసత్వాన్ని, సత్సంబంధాల్లోని సానుకూలతను, స్ఫూర్తిదాయక బాధ్యతను మనం ఈ ప్రపంచంతో పంచుకుంటున్నాం.

ఈ రోజు మనం దాదాపు 3 గంటల పాటు సమావేశమయ్యాం. మనం ఇ క్కడా, రేపు బెంగళూరులో కూడా సంప్రదింపుల్ని కొనసాగించబోతున్నాం. చర్చలు జరిగిన తీరు, సాధించిన విస్తృత ఫలితాల పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.

మా అభివృద్ధి ఎజెండా పట్ల జర్మనీ ప్రతిస్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది. జర్మనీ నుంచి పెట్టు బడులు, వాణిజ్యంలో మరింత వృద్ధి, తయారీ రంగం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, నైపుణ్యాల మెరుగుదలలో మరింత సాంకేతిక భాగస్వామ్యం మేం ఆశిసున్నాం. జర్మన్‌ ఇంజనీరింగ్‌, భారత ఐటీ నైపుణ్యం కలిస్తే తదుపరి తరం పరిశ్రమలను సృష్టించగలదు. ఇది మరింత అద్భుతంగా, చౌకగా, పర్యావరణ హితంగా ఉంటుంది.

భారత్‌లో 1600 జర్మన్‌ కంపెనీలు ఉన్నాయి. ఇవి ఇంకా పెరుగుతున్నాయి. భారత్‌లో ప్రపంచ స్థాయి మానవ వనరుల్ని తయారు చేయడంలో ఈ కంపెనీలు కీలక భాగస్వాములు కాబోతున్నాయి.

స్మార్ట్‌ సిటీలు, గంగానదీ ప్రక్షాళన, వ్యర్థాల నిర్వహణ, తదితర రంగాల్లో జర్మనీ సహకారం, సహాయం ఇప్పటికే నిర్దిష్ట రూపానికి వచ్చింది. ఇంజనీరింగ్‌ నుంచి హ్యుమానిటీస్‌ వరకు విద్యలో కూడా మన మధ్య ఇప్పటికే గట్టి సహకారం కొనసాగుతోంది.

క్లైమేట్‌ (వాతావరణ) మార్పుల నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటంలో జర్మనీ నిబద్ధతను,, క్లీన్‌ ఎనర్జీ (పర్యావరణ హిత ఇంధనం) తయారీ విషయంలో జర్మనీ చూపుతన్న నాయకత్వ పాత్రను నేను ప్రశంసిస్తున్నాను. మన రెండు దేశాలకు ఉ మ్మడి అభిప్రాయాలు, వేగంగా సహకారం వృద్ధి చెందే అ వకాశం ఉన్న రంగాలివి. వాతావరణ మార్పుల నియంత్రణ కోసం తయారుచేసుకున్న సమగ్ర ఎజెండాలో భాగంగానే, దీర్ధకాలిక దృష్టితోనే భారత్‌- జర్మనీ క్లైమేట్‌ అండ్‌ రెన్యూవబుల్‌ అలయన్స్‌కు మేం అంగీకరించాం. భారతదేశ పర్యావరణ హిత (గ్రీన్‌ ఎనర్జీ )కారిడార్‌కు వంద కోట్ల యూరోలకు పైగా, భారత్‌లో సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు మరో వంద కోట్లకు పైగా జర్మనీ చేసిన సాయాన్ని నేనెంతో ప్రశంసిస్తున్నాను. పర్యావరణ హిత, పునరుత్పాదక ఇంధన రంగాలకు సంబంధించిన పరిశోధనలో మనం మరింత సహకరించుకోవాలని నేను ఆ శిస్తున్నాను. ఉ ష్ణోగ్రతల్లో (టెంపరేచర్‌) పెరుగుదలను నియంత్రించాలంటే మన ఉమ్మడి స్వభావాలు (టెంపర్‌మెంట్‌) కూడా మారాలి మరి!

పారిస్‌లో జరిగే సీవోపీ 21 సదస్సు నుంచి నిర్దిష్టమైన ఫలితం కోసం మేం ఎదురు చూస్తున్నాం. ప్రపంచం, మరీ ముఖ్యంగా పేద, అసహాయ దేశాలు మరింత సుస్థిరమైన ప్రగతి పథంలోకి మారడానికి ఈ సదస్సు తీర్మానాలు తగిన సామర్థాన్ని, నిబద్ధతను అందించాలి.

రక్షణ పరికరాల తయారీ, అత్యాధునిక పరిజ్ఞాన వాణిజ్యం, ఇంటెలిజెన్స్‌, ఉగ్రవాదంగా మారుతున్న అతివాద నియంత్రణ, తదితర రంగాల్లో కూడా మన మధ్య సహకారం వృద్ధి చెందనుంది. విస్తృతమవుతున్న మన బంఽధంలో ఇవి అత్యంత ముఖ్యమైన భద్రతా కోణాలు.

అంతర్జాతీయ ఎ గుమతి ఒప్పందాల్లో భారతదేశ సభ్యత్వానికి జర్మనీ గట్టి మద్దతు పలకడం నాకెంతో సంతోషం కలిగించింది. న్యూయార్క్‌లో జీ-4 సదస్సులో మనం చర్చించినట్టుగా, ఐక్యరాజ్యసమితిలో, ముఖ్యంగా భద్రతా మండలిలో సంస్కరణలకు నేను, ఛాన్స్‌లర్‌ కట్టుబడి ఉన్నాం.

పశ్చిమాసియలో అ శాంతి, ఐ రోపా ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆసియా- పసిఫిక్‌, హిందూ మహాసముద్ర మండలాలను శాంతియుతంగా, సుస్థిరంగా తీర్చిదిద్దడం అనే అంశాల పట్ల మన మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఆఫ్ఘానిస్థాన్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు, అభివృద్ధికి జర్మనీ ఇచ్చిన అ మూల్య సహకారానికి, మద్దతుకు చాన్సలర్‌ మెర్కెల్‌కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

చివరగా చాన్స్‌లర్‌ మెర్కెల్‌, జర్మనీ ప్రజలు చూపిన ఓ ఔదార్యానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. జమ్మూకాశ్మీర్‌కు చెందిన పదో శతాబ్దం నాటి మహిషాసుర మర్దిని అ వతారంలో ఉన్న దుర్గామాత విగ్రహాన్ని జర్మనీ మాకు తిరిగివ్వడం ఎంతో సంతోషం కలిగించింది. దుష్ట శక్తులపై మంచి సాధించిన విజయానికి మా దుర్గామాత ఒ క సంకేతం.

ఈ శక్తిమాతను జర్మనీ మాకు తిరిగివ్వడం, సంక్షోభాల, పరివర్తనల యుగంలో భారత్‌- జర్మనీ భాగస్వామ్యం ప్రపంచానికి మేలు చేసే కొత్త శక్తి అనే సందేశాన్ని కూడా పంపింది.

మన ఇ రు దేశాల సంస్కృతుల్లోనూ ఓ సామెత ఉంది. స్నేహం ఓ మొక్క. దాన్ని నీరు పోసి పెంచుకోవాలి అని! ఛాన్స్‌లర్‌ మెర్కెల్‌ ప్రస్తుత అ సాధారణ పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య స్నేహ లత వి కసిస్తుందనే నమ్మకం నాకుంది.

ధన్యవాదాలతో..