Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జయ శ్రీ మహా బోధి మందిరాన్ని సందర్శించిన ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనురా కుమార దిసనాయకేతో కలసి అనురాధపురలో పావన జయ శ్రీ మహా బోధి మందిరానికి వెళ్లి, అక్కడి ఆరాధనీయ మహా బోధి వృక్షానికి పూజ చేశారు.

 

క్రీస్తుకు పూర్వం మూడో శతాబ్దంలో సంగమితా మహాథేరీ బో మొక్కను భారత్ నుంచి శ్రీలంకకు తీసుకువచ్చారని, ఆ మొక్క పెరిగి పెరిగి ఈ వృక్షంగా రూపుదాల్చిందని ప్రజల విశ్వాసం. ఈ మందిరం దృఢ నాగరికతా సంబంధాలకు నిదర్శనంగా ఉంది. ఇండియా, శ్రీలంకల మధ్య ఏర్పడ్డ సన్నిహిత భాగస్వామ్యానికి పునాదిగా నిలుస్తోంది ఈ దృఢ నాగరికతా సంబంధాలే.

***