Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జయలలిత జయంతి సందర్భంగా ఆమెను సంస్మరించుకున్న ప్రధానమంత్రి


జయలలిత జయంతి సందర్భంగా ఆమెను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంస్మరించుకున్నారు. తమిళనాడు అభివృద్ధి కోసం జీవితాన్ని వెచ్చించిన విశిష్ట పరిపాలనాదక్షురాలు, ప్రజల పట్ల ఆదరం చూపిన నేత జయలలిత అని శ్రీ మోదీ కొనియాడారు.

ఎక్స్ వేదికపై రాసిన వివిధ పోస్టుల్లో ప్రధాని నివాళి అర్పిస్తూ:  

“జయలలిత జీ జయంతి సందర్భంగా ఆమెను సంస్మరించుకుంటున్నాను. తమిళనాడు అభివృద్ధి కోసం తన జీవితాన్ని వెచ్చించిన మేటి పరిపాలనాదక్షురాలు, ప్రజల పట్ల సదా ఆదరం చూపిన నేతగా ఆమె ఎందరి  అభిమానాన్నో పొందారు. అనేక సందర్భాల్లో ఆమెతో సంభాషించే అవకాశం కలగడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ప్రజలకు మేలు చేసే ఏ పథకానికైనా ఆమె తమ సంపూర్ణమైన మద్దతుని అందించేవారు”  అని పేర్కొన్నారు.

 “జయలలిత జీ జయంతి నాడు ఆమెను సంస్మరించుకుంటున్నాను. తమిళనాడు రాష్ట్రాభివృద్ధి కోసం సదా తపించిన  మేటి పరిపాలనాదక్షురాలు, ప్రజల పట్ల ఆదరాభిమానాలు చూపిన నేతగా ఆమె అందరి ప్రేమనూ చూరగొన్నారు.  పలు సందర్భాల్లో ఆమెతో సంభాషించే అవకాశం కలగడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ప్రజా సంక్షేమం కోసం చేపట్టే ఏ పథకానికైనా ఆమె తమ మద్దతుని అందించేవారు”  అని పేర్కొన్నారు.

“ஜெயலலிதா அவர்களின் பிறந்தநாளில் அவரை நினைவுகூர்கிறேன். தமிழ்நாட்டின் வளர்ச்சிக்காக தமது வாழ்க்கையை அர்ப்பணித்துக் கொண்ட அவர், கருணைமிக்க தலைவராகவும், திறமைமிக்க நிர்வாகியாகவும் நன்கு அறியப்பட்டவர். பல சந்தர்ப்பங்களில் அவருடன் உரையாடும் வாய்ப்பை நான் பெற்றிருந்தது எனது கௌரவமாகும். அவர் எப்போதும் அன்பாகவும் மக்கள் நலன் சார்ந்த முன்முயற்சிகளுக்கு ஆதரவாகவும் இருந்தவர்.”

 

 

***

MJPS/SR