Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఒమర్ అబ్దుల్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు


జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఒమర్ అబ్దుల్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఒమర్ అబ్దుల్లాకు శుభాకాంక్షలు. ప్రజలకు సేవ చేసే విషయంలో ఆయన చేసే ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటున్నాను. జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి ఆయన బృందంతో కలసి కేంద్రం పనిచేస్తుంది.’’ అని ఎక్స్ లో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు.