Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని గ్రామాలు 100 శాతం ‘ఒడిఎఫ్ ప్లస్’ స్థాయి సాధించడంపై ప్రధానమంత్రి అభినందన


   రిశుభ్ర భారతం-గ్రామీణ (ఎస్‌బిఎం-గ్రామీణ) 2.0 కింద ‘ఆదర్శ’ విభాగంలో జమ్ముకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని గ్రామాలు 100 శాతం ‘ఒడిఎఫ్‌ ప్లస్‌’ స్థాయిని సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఈ కృషి ప్రశంసనీయం… ఈ విజయంపై జమ్ముకశ్మీర్ ప్రజలకు నా అభినందనలు. పరిశుభ్ర, ఆరోగ్యకర భారతం దిశగా మన ప్రయాణంలో ఇదొక చిరస్మరణీయ ముందడుగు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS