ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో సందేశం ద్వారా జమ్ముకశ్మీర్ ఉపాధి ఉత్సవంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- జమ్ముకశ్మీర్‌లోని ప్రతిభగల యువతరానికి ఇదొక ముఖ్యమైన రోజని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాష్ట్రంలోని 20 వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు పొందిన 3 వేల మందిని ప్రధాని అభినందించారు. వీరందరికీ ప్రజా పథకాలు (పీడబ్ల్యూడీ), ఆరోగ్య, ఆహార-పౌరసరఫరాలు, పశుసంవర్ధక, జలశక్తి, విద్య-సంస్కృతి వగైరా శాఖల పరిధిలోని వివిధ విభాగాల్లో సేవలందించే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో ఇతర విభాగాల్లో 700కు పైగా నియామక పత్రాలు అందించేందుకు ముమ్మర సన్నాహాలు సాగుతున్నాయని ప్రధాని నొక్కిచెప్పారు.
జమ్ముకశ్మీర్ చరిత్రలో 21వ శతాబ్దంలోని ప్రస్తుత దశాబ్ద ప్రాముఖ్యాన్ని వివరిస్తూ- “పాత సవాళ్లను వదిలి… కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకునే సమయం వచ్చింది. దీనికి అనుగుణంగా తమ ప్రాంతంతోపాటు ప్రజల ప్రగతి కోసం పెద్ద సంఖ్యలో యువత ముందుకు రావడం నాకెంతో సంతోషంగా ఉంది” అన్నారు. జమ్ముకశ్మీర్‌లో సరికొత్త ప్రగతి గాథను రచించేది మన యువతేనని, ఆ మేరకు ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఉపాధి ఉత్సవం నిర్వహణకు చాలా ప్రత్యేకత ఉందని శ్రీ మోదీ నొక్కిచెప్పారు.
సరికొత్త, పారదర్శక, అవగాహనతో కూడిన పాలన ద్వారా జమ్ముకశ్మీర్ నిరంతర అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ- “సత్వర ప్రగతి కోసం కొత్త విధానంతో.. కొత్త ఆలోచనలతో మనమంతా పనిచేయాలి” అని ప్రధాని అన్నారు. ఈ ప్రాంతంలో 2019 నుంచి ఇప్పటిదాకా దాదాపు 30 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరిగాయని, ఇందులో గత ఏడాదిన్నరలోనే 20 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఈ దిశగా విశేష కృషి చేశారంటూ జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హాతోపాటు పాలన యంత్రాంగాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. “సామర్థ్యంతో ఉపాధి’ మంత్రం జమ్ముకశ్మీర్ యువతలో కొత్త విశ్వాసం నింపుతోంది” అని శ్రీ మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఉపాధి, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు గత 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో భాగంగానే అక్టోబరు 22 నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ‘ఉపాధి ఉత్సవం’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. “ఈ కార్యక్రమం ప్రకారం తొలిదశకింద రాబోయే కొద్ది నెలల్లో 10 లక్షలకు పైగా నియామక లేఖలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది” అని ప్రధానమంత్రి వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో ఉపాధికి ఊపునిచ్చే దిశగా వ్యాపార వాతావరణ అవకాశాల పరిధిని ప్రభుత్వం విస్తరించిందని ఆయన చెప్పారు. కొత్త పారిశ్రామిక విధానం, వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికతో వ్యాపార సౌలభ్యానికి మార్గం సుగమమైందని ప్రధానమంత్రి అన్నారు. దీంతో ఇక్కడ పెట్టుబడులకు విశేష ప్రోత్సాహం లభించిందని పేర్కొన్నారు. “అభివృద్ధి-సంబంధిత ప్రాజెక్టులలో పని వేగం ఇక్కడి ఆర్థిక వ్యవస్థను ఆమూలాగ్రం మార్చేస్తుంది” అని ప్రధానమంత్రి తెలిపారు. రైళ్ల నుంచి అంతర్జాతీయ విమానాల వరకు కశ్మీర్‌కు అనుసంధానం పెంపు పథకాలను ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. శ్రీనగర్ నుంచి షార్జాకు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇప్పటికే మొదలయ్యాయని ప్రధాని గుర్తుచేశారు. జమ్ముకశ్మీర్ యాపిల్ రైతులు ఇప్పుడు తమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు సులభమైందని తెలిపారు. అనుసంధానం పెరుగుదలతో ఇక్కడి ఇతర రైతులూ ఎంతో ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా రవాణాను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రధాని తెలిపారు.
జమ్ముకశ్మీర్ సందర్శకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడాన్ని ప్రస్తావిస్తూ- మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుసంధానంలో పెరుగుదల కారణంగా జమ్ముకశ్మీర్ పర్యాటక రంగం ఊపందుకుందని ప్రధానమంత్రి అన్నారు. “ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సమాజంలోని అన్నివర్గాలకూ చేరేవిధంగా చూడటం మన కర్తవ్యం” అని ప్రధాని పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని వర్గాలకు, పౌరులకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో 2 కొత్త ‘ఎయిమ్స్’ 7 కొత్త వైద్య కళాశాలలు, 2 కేన్సర్ చికిత్స సంస్థలు, 15 నర్సింగ్ కాలేజీలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. తద్వారా ఆరోగ్యం-విద్యా మౌలిక సదుపాయాల బలోపేతానికి కృషి కొనసాగుతున్నదని ప్రధానమంత్రి తెలిపారు.
జమ్ముకశ్మీర్ ప్రజలు సదా పారదర్శకతకు పెద్దపీట వేస్తారని ప్రధానమంత్రి వివరిస్తూ- ప్రభుత్వ విధుల్లో ప్రవేశిస్తున్న యువతరం ఈ అంశానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా “జమ్ముకశ్మీర్ ప్రజలతో లోగడ మమేకమైన సమయాల్లో వారి ఆవేదనను నేనూ అనుభవించాను. ఇది వ్యవస్థలోని అవినీతి ఫలితంగా పడిన బాధ. అందుకే ఇక్కడి ప్రజలు అవినీతిని ద్వేషిస్తారు” అని ఆయన పేర్కొన్నారు. అనినీతి, అక్రమాలను రూపుమాపడంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, ఆయన బృందం విశేష కృషి చేసిందంటూ ప్రధాని కొనియాడారు.
చివరగా- ఇవాళ ఉద్యోగ నియామక లేఖలు అందుకుంటున్న యువతరం తమ బాధ్యతలను చిత్తశుద్ధి, అంకితభావంతో నెరవేరుస్తుందన్న భరోసా తనకుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “జమ్ముకశ్మీర్ ప్రతి భారతీయుడికీ గర్వకారణం… మనం సమష్టిగా దీన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలి. అలాగే 2047నాటికి ప్రగతిశీల భారతదేశం అనే బృహత్తర లక్ష్యం కూడా మన ముందుంది. దాన్ని నెరవేర్చడానికి మనం దృఢ దీక్షతో దేశ నిర్మాణంలో నిమగ్నం కావాలి” అని ఉద్బోధిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
Addressing the Rozgar Mela in Jammu and Kashmir. Such initiatives will open up new avenues for youth in the region. https://t.co/3zIBu8Okou
— Narendra Modi (@narendramodi) October 30, 2022
आज जम्मू-कश्मीर के होनहार नौजवानों के लिए बहुत महत्वपूर्ण दिन है।
— PMO India (@PMOIndia) October 30, 2022
आज जम्मू-कश्मीर में 20 अलग-अलग जगहों पर 3 हजार युवाओं को सरकार में काम करने के लिए नियुक्ति पत्र सौंपे जा रहे हैं: PM @narendramodi
21वीं सदी का ये दशक जम्मू-कश्मीर के इतिहास का सबसे अहम दशक है।
— PMO India (@PMOIndia) October 30, 2022
अब समय पुरानी चुनौतियों को पीछे छोड़कर नई संभावनाओं का पूरा लाभ उठाने का है।
मुझे खुशी है जम्मू-कश्मीर के नौजवान अपने प्रदेश के विकास के लिए, जम्मू-कश्मीर के लोगों के विकास के लिए बड़ी संख्या में सामने आ रहे हैं: PM
जम्मू-कश्मीर में जिस तरह इंफ्रास्ट्रक्चर का विकास हो रहा है, कनेक्टिविटी बढ़ रही है, उसने टूरिज्म सेक्टर को भी मजबूत किया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 30, 2022
जम्मू-कश्मीर के लोगों ने हमेशा Transparency पर बल दिया है, Transparency को सराहा है।
— PMO India (@PMOIndia) October 30, 2022
आज जो नौजवान सरकारी सेवाओं में आ रहे हैं, उन्हें Transparency को अपनी प्राथमिकता बनाना है: PM @narendramodi
मैं पहले जब भी जम्मू-कश्मीर के लोगों से मिलता था, उनका एक दर्द हमेशा महसूस करता था।
— PMO India (@PMOIndia) October 30, 2022
ये दर्द था- व्यवस्थाओं में भ्रष्टाचार।
जम्मू-कश्मीर के लोग भ्रष्टाचार से नफरत करते हैं: PM @narendramodi
मैं मनोज सिन्हा जी और उनकी टीम की इस बात के लिए भी प्रशंसा करूंगा कि वो भ्रष्टाचार रूपी बीमारी को समाप्त करने के लिए भी जी-जान से जुटे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 30, 2022
जम्मू-कश्मीर हर हिंदुस्तानी का गौरव है।
— PMO India (@PMOIndia) October 30, 2022
हमें मिलकर जम्मू-कश्मीर को नई ऊंचाई पर ले जाना है: PM @narendramodi