ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్వాడ్ నేతల శిఖర సమ్మేళనం సందర్భం లో 2021, సెప్టెంబర్ 23 న వాశింగ్ టన్ డిసి లో జపాన్ ప్రధాని శ్రీ యోశీహిదే సుగా తో సమావేశమయ్యారు.
తాము ముఖాముఖి సమావేశం అవుతూ ఉండటం పట్ల ప్రధానులు ఇరువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2020 సెప్టెంబర్ లో జపాన్ ప్రధాన మంత్రి గా శ్రీ సుగా పదవీ బాధ్యతల ను స్వీకరించినప్పుడు ఆ నాటి నుంచి వారు ఇరువురి మధ్య మూడుసార్లు జరిగిన టెలిఫోన్ సంభాషణల ను వారు ఎంతో మక్కువ గా గుర్తు కు తెచ్చుకొన్నారు. ప్రధాని శ్రీ సుగా అంతక్రితం చీఫ్ కేబినెట్ సెక్రటరీ గాను, ఆ తరువాత ప్రధాని గాను, భారతదేశం-జపాన్ ప్రత్యేక, వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యం మునుముందుకు సాగిపోయేటట్లు చేయడం లో కనబరచిన నాయకత్వ పటిమ కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు పలికారు. ఒక ప్రపంచ మహమ్మారి నడుమ టోక్యో ఒలింపిక్స్ ను, పారాలింపిక్ గేమ్స్ ను నిర్వహించడం లో సఫలత సాధించినందుకు ప్రధాని శ్రీ సుగా ను ఆయన అభినందించారు.
ఉభయ దేశాల మధ్య గల బహుముఖీన సంబంధాన్ని ప్రధానులు ఇరువురు సమీక్షించారు. అంతేకాకుండా, అఫ్ గానిస్తాన్ తో సహా, ఇటీవలి ప్రాంతీయ పరిణామాల ను, ప్రపంచ పరిణామాల ను వారు సమీక్షించారు. ఒక స్వేచ్ఛాయుతమైన, బాహాటమైన, అన్ని పక్షాల ను కలుపుకుపోయేటటువంటి ఇండో-పసిఫిక్ రిజియన్ ఆవిష్కారం దిశ లో కృషి చేయాలని వారు వారి వచన బద్ధత ను పునరుద్ఘాటించారు. రక్షణ రంగ సామగ్రి మరియు సాంకేతికతల రంగం తో పాటు, రక్షణ పరమైన సహకారాన్ని, ద్వైపాక్షిక భద్రత ను పెంపొందించుకోవాలి అనే విషయం లో వారు అంగీకారాన్ని వ్యక్తం చేశారు.
ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధం బలోపేతం అవుతూ ఉండటం పట్ల ప్రధానులు ఇద్దరు హర్షాన్ని వ్యక్తం చేశారు. వారు ఆటుపోటుల కు తట్టుకొని నిలచేటటువంటి, వైవిధ్యభరితమైనటువంటి, విశ్వసనీయమైనటువంటి సప్లయి చైన్ ల కు మార్గాన్ని సుగమం చేసే ఒక సమన్వయ పూరిత యంత్రాంగం ఏర్పడాలి అనే దిశ లో ఈ ఏడాది ఆరంభం లో జపాన్, భారతదేశం, ఆస్ట్రేలియా ల మధ్య సప్లయ్ చైన్ రెజిలియన్స్ ఇనిశియేటివ్ (ఎస్ సిఆర్ఐ) ప్రారంభం కావడాన్ని స్వాగతించారు. తయారీ, ఎమ్ఎస్ఎమ్ఇ, ఇంకా నైపుణ్యాల అభివృద్ధి రంగాల లో ద్వైపాక్షిక భాగస్వామ్యాల ను అభివృద్ధి పరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రస్తావించారు. ఈ సంవత్సరం మొదట్లో సంతకాలు అయిన స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ (ఎస్ఎస్ డబ్ల్యు) అగ్రిమెంట్ ఆచరణాత్మకం గా మారడం కోసం వచ్చే సంవత్సరం మొదటి నుంచి భారతదేశం లో నైపుణ్య పరీక్షల ను, భాష సంబంధి పరీక్షల ను జపాన్ చేపట్టనుందని ప్రధాని శ్రీ సుగా ఈ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టి కి తీసుకు వచ్చారు.
ప్రధాన మంత్రులు ఇద్దరు కోవిడ్ -19 మహమ్మారి ని గురించి, ఆ మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడం కోసం చేస్తున్న ప్రయత్నాల ను గురించి చర్చించారు. డిజిటల్ టెక్నాలజీ ల ప్రాముఖ్యం పెరగడం గురించి వారు ప్రముఖం గా ప్రస్తావించారు. ఈ విషయం లో భారతదేశం-జపాన్ డిజిటల్ భాగస్వామ్యం లో పురోగతి ని ప్రత్యేకించి స్టార్ట్-అప్స్ లో ప్రగతి ని వారు సానుకూల దృక్పథం తో మదింపు చేశారు. కొత్త గా రూపొందుతున్న వివిధ సాంకేతికత లలో మరింత సహకారాన్ని అందించుకోవాలి అనే విషయం లో వారు వారి ఆలోచన లను వెల్లడించారు. జల వాయు పరివర్తన అంశాల పైన, గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిశన్ పైన కూడా చర్చలు జరిగాయి. భారతదేశం సంకల్పించిన నేశనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిశన్ కు జపాన్ సహకారాన్ని అందించే అవకాశం పైన సైతం చర్చ జరిగింది.
ముంబయి-అహమదాబాద్ హై స్పీడ్ రైల్ (ఎమ్ఎహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు ను అనుకున్న కాలానికే అమలు లోకి తీసుకు రావడం కోసం చేయవలసిన కృషి ని వేగిర పరచాలని ప్రధాన మంత్రులు ఇద్దరు వారి నిబద్ధత ను మరోమారు వ్యక్తం చేశారు.
ఇండియా-జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరమ్ ద్వారా భారతదేశ ఈశాన్య ప్రాంతం లో తలపెట్టిన ద్వైపాక్షిక అభివృద్ధి పథకాల లో పురోగతి ని నేతలు ఇద్దరు స్వాగతిస్తూ ఆ కోవ కు చెందిన సహకారాన్ని మరింత గా వృద్ధి పరచడానికి గల అవకాశాల ను గురించి మాట్లాడుకొన్నారు.
గత కొన్నేళ్ళ లో భారతదేశం-జపాన్ భాగస్వామ్యం ద్వారా లభించిన సిద్ధి జపాన్ లో కొత్త పాలన యంత్రాంగం హయాం లో సైతం కొనసాగగలదన్న విశ్వాసాన్ని ప్రధాని శ్రీ సుగా వ్యక్తం చేశారు. జపాన్ తదుపరి ప్రధాని ని సమీప భవిష్యత్తు లో జరిగే ఇండియా-జపాన్ వార్షిక శిఖర సమ్మేళనం సందర్భం గా స్వాగతించడం కోసం తాను ఎదురు చూస్తూ ఉన్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
***
Japan is one of India’s most valued partners. I had an excellent meeting with PM @sugawitter on a variety of subjects that would further boost cooperation between our nations. A strong India-Japan friendship augurs well for the entire planet. pic.twitter.com/5N9ibqWDzy
— Narendra Modi (@narendramodi) September 24, 2021
Furthering friendship with Japan.
— PMO India (@PMOIndia) September 23, 2021
Prime Ministers @narendramodi and @sugawitter had a fruitful meeting in Washington DC. Both leaders held discussions on several issues including ways to give further impetus to trade and cultural ties. pic.twitter.com/l370XzB1Yt