భారత్ మాతా కీ జై,
భారత్ మాతా కీ జై,
నేను జపాన్‌ను సందర్శించిన ప్రతిసారీ, మీ ప్రేమ, ఆప్యాయతలు కాలంతో పాటు పెరుగుతుండడాన్ని నేను గమనించాను. మీలో చాలా మంది అనేక సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. జపాన్ భాష, దుస్తులు, సంస్కృతి, ఆహారం ఒక విధంగా మీ జీవితంలో ఒక భాగమయ్యాయి. ఇలా మీరు ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని పోవడానికి, అందరితో కలిసిపోయే భారతీయ సమాజం యొక్క సంస్కృతి ఒక కారణం. అయితే, అదే సమయంలో, జపాన్ తన సంప్రదాయం, దాని విలువలు, ఈ భూమిపై దాని జీవితం పట్ల కలిగి ఉన్న నిబద్ధత కూడా మరో ముఖ్య కారణం. మరి ఇప్పుడు ఆ రెండు కారణాలు కలిసాయి. అందువల్ల, సొంతమనే భావన కలగడం చాలా సహజం.
మిత్రులారా,
మీరు ఇక్కడ నివసిస్తున్నారు, మీలో చాలా మంది ఇక్కడ స్థిరపడ్డారు. మీలో చాలామంది ఇక్కడ పెళ్లి చేసుకున్నారని కూడా నాకు తెలుసు. అయితే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా, భారతదేశం పట్ల మీకున్న గౌరవం ఇప్పటికీ చెక్కుచెదర లేదన్నది వాస్తవం. భారతదేశానికి సంబంధించిన ఏ శుభవార్త వచ్చినా, మీరు ఆనందంతో పొంగిపోతారు. అవునా? కాదా? అదేవిధంగా, ఏదైనా చెడు వార్త వచ్చినప్పుడు కూడా, అది మిమ్మల్ని చాలా బాధపెడుతుంది. ఇవే మన ప్రజల గుణగణాలు, మనం పనిచేసే భూమి తో మనం అంతగా సంబంధ, బాంధవ్యాలు పెనవేసుకుంటాము. అదే సమయంలో, మన మాతృభూమి యొక్క మూలాలతో ఎప్పుడూ సంబంధాన్ని కోల్పోవద్దు, అదే మన అతిపెద్ద బలం.
మిత్రులారా,
స్వామి వివేకానంద తన చారిత్రాత్మక ప్రసంగం కోసం చికాగో వెళ్లే ముందు, ఆయన జపాన్‌ను సందర్శించారు. ఆయన మనస్సు మరియు హృదయంపై జపాన్ చెరగని ముద్ర వేసింది. జపాన్ ప్రజల దేశభక్తి; జపాన్ ప్రజల విశ్వాసం; వారి క్రమశిక్షణ; పరిశుభ్రత పట్ల జపాన్ ప్రజల అవగాహన వంటి లక్షణాలను వివేకానంద బహిరంగంగా ప్రశంసించారు. గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా జపాన్ పురాతనమైన మరియు అదే సమయంలో ఆధునికమైన దేశం అని పేర్కొన్నారు. “జపాన్ అనాదిగా తూర్పు నుండి తేలికగా వికసించిన కమలం లా వచ్చింది, అన్ని సమయాలలో అది తాను ఉద్భవించిన లోతైన మూలాల వద్ద దృఢమైన పట్టును కలిగి ఉంటుంది.” అని రవీంద్రనాథ్ అభివర్ణించారు. అంటే, జపాన్ తామర పువ్వులా తన మూలాలకు గట్టిగా అంటిపెట్టుకుని ఉందని, అదే గాంభీర్యంతో అన్ని చోట్లా అందాన్ని కూడా పెంచుతుందని, ఆయన చెప్పారు. అటువంటి మన గొప్ప వ్యక్తుల పవిత్ర భావాలు జపాన్‌తో మన సంబంధాల పటిష్టతను వివరిస్తాయి.
మిత్రులారా,
ఈసారి నేను జపాన్‌కు వచ్చినప్పుడు, మనం డెబ్బై సంవత్సరాల మన దౌత్య సంబంధాలను ఏడు దశాబ్దాలుగా జరుపుకుంటున్నాము. మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీకు కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది. భారత, జపాన్ సహజ భాగస్వాములని, భారతదేశంలో కూడా అందరూ భావిస్తారు. భారత దేశ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించింది. జపాన్ తో మన సంబంధం సాన్నిహిత్యం, ఆధ్యాత్మికత, సహకారం, అనుబంధాలతో ముడిపడి ఉంది. ఒక విధంగా, ఈ సంబంధం మన బలం. ఈ సంబంధం గౌరవం తో కూడుకుని ఉంది. ఈ సంబంధం ప్రపంచానికి ఒక సాధారణ సంకల్పంగా కూడా ఉంది. జపాన్ తో మన సంబంధం బుద్ధునిది, జ్ఞానం, తెలివితేటలతో కూడుకుని ఉంది. మనకు మహాకాల్ ఉన్నట్లే, జపాన్‌లో డైకోకుటెన్ ఉంది. మనకు బ్రహ్మ ఉన్నట్లే, జపాన్‌లో బోంటెన్ ఉన్నారు. మనకు అమ్మ సరస్వతి ఉన్నట్లే, జపాన్‌లో బెంజైటెన్ మాత ఉంది. మనకు మహాదేవి లక్ష్మి ఉండగా, జపాన్‌లో కిచిజోటెన్ ఉన్నారు. మనకు గణేశుడు ఉన్నట్లే, జపాన్‌కు కంగీటెన్ ఉన్నారు. జపాన్ లో జెన్ సంప్రదాయం ఉండగా, మనం ధ్యానాన్ని ఆత్మతో కూడిన చర్యగా పరిగణిస్తాము.
21వ శతాబ్దంలో కూడా, మనం భారత, జపాన్ దేశాల ఈ సాంస్కృతిక సంబంధాలను పూర్తి నిబద్ధతతో ముందుకు తీసుకువెళుతున్నాము. జపాన్ మాజీ ప్రధానమంత్రి అబే, కాశీని సందర్శించిన విషయాన్ని, నేను కాశీ పార్లమెంట్ సభ్యుడిని గా చాలా గర్వంగా చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు, ఆయన, కాశీకి ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చారు జపాన్ సహకారంతో ఆ రుద్రాక్షను కాశీ లో రూపొందించారు. ఒకప్పుడు అహ్మదాబాద్ లోని, జెన్ గార్డెన్ మరియు కైజెన్ అకాడెమీ లో నా కార్యాలయంలో ఉంచిన ఆ వస్తువులు మమ్మల్ని మరింత దగ్గరకు చేర్చాయి. జపాన్‌లో ఉన్న మీరందరూ ఈ చారిత్రక బంధాన్ని మరింత పటిష్టంగా, దృఢంగా చేస్తున్నారు.
మిత్రులారా,
బుద్ధ భగవానుడు చూపిన మార్గాన్ని అనుసరించడం నేటి ప్రపంచానికి గతంలో కంటే ఎక్కువ అవసరం. అది హింస, అరాచకం, తీవ్రవాదం లేదా వాతావరణ మార్పు ఏదైనా కావచ్చు, ప్రపంచంలోని ప్రతి సవాలు నుంచి మానవాళిని రక్షించే మార్గం ఇదే. బుద్ధ భగవానుని ప్రత్యక్ష ఆశీర్వాదం పొందడం భారతదేశం అదృష్టం. అతని ఆలోచనలకు అనుగుణంగా, భారతదేశం మానవాళికి సేవ చేస్తూనే ఉంది. ఎలాంటి సవాళ్లు వచ్చినా, ఎంత పెద్దదైనా, వాటికి పరిష్కార మార్గాలను భారతదేశం వెతుకుతూనే ఉంది. వందేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షోభాన్ని కరోనా సృష్టించింది. ఇది మన ముందుకు వచ్చింది. అది ప్రారంభమైనప్పుడు, తరువాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. మొదట్లో ఇది ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. దీన్ని ఎలా నిర్వహించాలో? ఎవరికీ తెలియదు. దీనికి టీకా లేదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు వ్యాక్సిన్ వస్తుందా లేదా అనే సందేహం కూడా నెలకొంది. చుట్టూ అనిశ్చితి వాతావరణం అలుముకుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా భారతదేశం ప్రపంచ దేశాలకు మందులు పంపిణీ చేసింది. టీకా అందుబాటులోకి వచ్చినప్పుడు, భారతదేశం “మేడ్-ఇన్-ఇండియా” టీకాను కోట్లాది మంది భారతదేశ పౌరులతో పాటు ప్రపంచంలోని వందకు పైగా దేశాలకు అందించింది.
మిత్రులారా,
భారతదేశం తన ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు భారీగా పెట్టుబడులు పెడుతోంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఆరోగ్య సౌకర్యాలు సులభతరం చేయడానికి, దేశంలో లక్షలాది కొత్త ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు నిర్మించడం జరుగుతోంది. భారతదేశంలోని ఆశా కార్యకర్తలను డైరెక్టర్ జనరల్ యొక్క గ్లోబల్ హెల్త్ లీడర్ అవార్డుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) సత్కరించిన విషయాన్ని తెలుసుకుంటే మీరు కూడా సంతోషిస్తారు. ఈ రోజు బహుశా మీరు ఈ విషయాన్ని విని ఉండవచ్చు. భారతదేశంలోని మిలియన్ల మంది ఆశా సోదరీమణులు గ్రామ స్థాయిలో మాతా శిశు సంరక్షణ నుంచి టీకా వరకు, పోషకాహారం నుండి పరిశుభ్రత వరకు దేశవ్యాప్త ఆరోగ్య కార్యక్రమాల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. ఆశా కార్యకర్తలు గా సేవలందిస్తున్న మన సోదరీమణులందరికీ ఈరోజు, జపాన్ గడ్డ పై నుండి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి నమస్కరిస్తున్నాను.
మిత్రులారా,
నేడు ప్రపంచ సవాళ్లను ఎదుర్కోడానికి భారతదేశం ఎలా సహాయం చేస్తోంది. దీనికి మరో ఉదాహరణ పర్యావరణం. వాతావరణ మార్పు అనేది – ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సంక్షోభంగా మారింది. భారతదేశంలో కూడా ఈ సవాలు ఎదురయ్యింది. ఆ సవాలు నుంచి పరిష్కారాన్ని కనుగొనే మార్గాలను కనుగొనడానికి మేము ముందుకు సాగాము. 2070 నాటికి భారతదేశం నికర సున్నాకి కట్టుబడి ఉంది. అంతర్జాతీయ సౌర కూటమి వంటి ప్రపంచ కార్యక్రమాలకు కూడా మేము నాయకత్వం వహించాము. వాతావరణ మార్పుల కారణంగా, ప్రపంచంపై ప్రకృతి వైపరీత్యాల ప్రమాదం కూడా పెరిగింది. ఈ విపత్తుల ప్రమాదాలను మరియు వాటి వల్ల కలిగే కాలుష్యాన్ని జపాన్ ప్రజల కంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకోగలరు? జపాన్ కూడా ప్రకృతి వైపరీత్యాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుకుంది. జపాన్ ప్రజలు ఈ సవాళ్లను ఎదుర్కొన్న విధానాన్ని గమనిస్తే, ప్రతి సమస్య నుండి నేర్చుకోవలసినది చాలా ఉంది. పరిష్కారాలు కనుగొనబడ్డాయి. వ్యవస్థలు కూడా అభివృద్ధి చేయబడ్డాయి. వ్యక్తులు కూడా ఆ విధంగా శిక్షణ పొందారు. ఇది నిజంగా ప్రశంసనీయం. ఈ దిశలో కూడా భారతదేశం సి.డి.ఆర్.ఐ. (కోయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) లో ముందంజలో ఉంది.
మిత్రులారా,
ఈ రోజు, భారతదేశం కూడా గ్రీన్-ఫ్యూచర్, గ్రీన్-జాబ్-క్లియర్-రోడ్-మ్యాప్ కోసం చాలా వేగంగా ముందుకు సాగుతోంది. భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ కి విస్తృత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. హైడ్రోకార్బన్లకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ ను మార్చడానికి ప్రత్యేక మిషన్ ప్రారంభించడం జరిగింది. జీవ-ఇంధనానికి సంబంధించిన పరిశోధనలు, మౌలిక సదుపాయాల కల్పన చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ దశాబ్దం చివరి నాటికి తన మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50 శాతాన్ని శిలాజ రహిత ఇంధనం ద్వారా అందజేస్తానని భారతదేశం ప్రతిజ్ఞ చేసింది.
మిత్రులారా,
సమస్యల పరిష్కారంలో భారతీయుల విశ్వాసం ఇదే. ఈ విశ్వాసం నేడు ప్రతి రంగంలో, ప్రతి దిశలో, అడుగడుగునా కనిపిస్తుంది. గత రెండేళ్లలో ప్రపంచ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్న తీరుతో, మొత్తం సరఫరా వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారింది. ఈ రోజు మొత్తం ప్రపంచానికి ఇదే ఒక చాలా పెద్ద సంక్షోభంగా మారింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు, మేము స్వావలంబన సంకల్పంతో ముందుకు సాగుతున్నాము. ఈ స్వావలంబన సంకల్పం భారతదేశానికి మాత్రమే అని కాదు. స్థిరమైన, విశ్వసనీయమైన ప్రపంచ సరఫరా వ్యవస్థ కోసం ఇది భారీ పెట్టుబడి గా నిలుస్తుంది. భారతదేశం పని చేయగల వేగం మరియు స్థాయి అపూర్వ మైనవని ఈ రోజు ప్రపంచం మొత్తం గుర్తిస్తోంది. భారతదేశం తన మౌలిక సదుపాయాలు, సంస్థాగత సామర్థ్య పెంపుదలపై నొక్కిచెప్పే స్థాయి కూడా అపూర్వమైనదన్న విషయాన్ని ఈరోజు ప్రపంచం కూడా గమనిస్తోంది. మన సామర్థ్యాన్ని పెంపొందించడంలో జపాన్ ఒక ముఖ్యమైన భాగస్వామి అయినందుకు నేను సంతోషిస్తున్నాను. అది ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్; ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్; డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కావచ్చు, ఇవి భారత-జపాన్ దేశాల సహకారానికి గొప్ప ఉదాహరణలు.
మిత్రులారా,
భారతదేశంలో వస్తున్న మార్పులకు సంబంధించిన మరొక ప్రత్యేకత ఉంది. మేము భారతదేశంలో బలమైన, దృఢమైన, బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యాన్ని సృష్టించాము. గత ఎనిమిదేళ్లలో, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పుకు మూలంగా మార్చాము. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైనందుకు గర్వించని మన సమాజంలోని ప్రజలు కూడా, ఈ రోజు భారత దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో చేరుతున్నారు. ప్రతిసారీ, ప్రతి ఎన్నికల్లోనూ రికార్డు స్థాయిలో ఓటింగ్ రావడంతో పాటు ఇక్కడ ఉన్న మా మాతృమూర్తులు, సోదరీమణులు సంతోషిస్తున్నారు. మీరు భారత ఎన్నికల పోలింగును జాగ్రత్తగా పరిశీలిస్తే, పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటు వేయడం గమనించవచ్చు. భారతదేశంలో ప్రజాస్వామ్యం సాధారణ పౌరుల హక్కుల గురించి ఎంత స్పృహ కలిగి ఉంది, ఎంత అంకితభావంతో ఉంది, ప్రతి పౌరుడిని ఎంత శక్తివంతం చేస్తోంది అన్న దానికి ఇదే నిదర్శనం.
మిత్రులారా,
ఈ ప్రాథమిక లక్షణాలతో పాటు, మనం భారత దేశ ఆకాంక్షకు కొత్త కోణాన్ని కూడా అందిస్తున్నాము. భారతదేశంలో, సమగ్రత, లోపాలు లేని పాలన ద్వారా అంటే, సాంకేతికతను పూర్తిగా వినియోగించుకుంటూ సరఫరా వ్యవస్థ విస్తరించడం జరుగుతోంది. తద్వారా అర్హులైన వారు ఎటువంటి అవాంతరాలు లేకుండా తమకు రావలసిన ప్రయోజనాలను పొందగలుగుతారు. ఎటువంటి సిఫార్సు లేకుండా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా, మనం దానితో పూర్తిగా నిమగ్నమై ఉన్నాము. ఈ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా, గత రెండేళ్లుగా నెలకొన్న కరోనా కష్టకాలంలో, ఈ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ముఖ్యంగా భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలతో పాటు , అడవులలో నివసించే మన పౌరుల హక్కులను కాపాడింది మరియు రక్షించింది.
మిత్రులారా,
భారత దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఈ క్లిష్ట పరిస్థితులలో కూడా నిరంతరం పనిచేస్తోంది. భారతదేశంలో వచ్చిన డిజిటల్ విప్లవం దీనికి ఒక కారణం. డిజిటల్ నెట్‌వర్క్ సృష్టించిన శక్తి వల్ల ఈ ఫలితాన్ని పొందగలుగుతున్నాము. మిత్రులారా! మీరు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ తో పాటు నగదు రహిత లావాదేవీల గురించి తెలుసుకుని సంతోషంగా ఉండి ఉంటారు. అదేవిధంగా, ఇక్కడ జపాన్ లో కూడా మీరు సాంకేతికత తో బాగా పరిచయం కలిగి ఉండాలి. అయితే, మొత్తం ప్రపంచంలో జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో 40 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయన్న విషయం వింటే, మీరు సంతోషిస్తారు, ఆశ్చర్యపోతారు, గర్వంగా ఉంటారు. కరోనా ప్రారంభ రోజుల్లో, ప్రతిదీ మూసి ఉన్నప్పుడు, అటువంటి సంక్షోభ సమయంలో కూడా, భారత ప్రభుత్వం ఒక బటన్ క్లిక్ సహాయంతో ఒకేసారి కోట్లాది మంది భారతీయులను సులభంగా చేరుకోగలిగింది. ఎవరి కోసం సహాయం ఉద్దేశించబడిందో, వారు దానిని సమయానికి పొందగలిగారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగల శక్తిని కూడా పొందారు. భారతదేశంలో ఈ రోజు ప్రజల నేతృత్వంలోని పాలన నిజమైన అర్థంలో పని చేస్తోంది. ఈ నమూనా పాలనలో సరఫరాన సమర్థవంతంగా జరుగుతోంది.
ప్రజాస్వామ్యంపై నానాటికీ విశ్వాసం పెరగడానికి ఇదే అతిపెద్ద కారణం.
మిత్రులారా,
ఈ రోజు భారతదేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా, స్వాతంత్య్ర అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలో, వచ్చే 25 ఏళ్లలో అంటే స్వాతంత్య్రం వచ్చిన 100వ సంవత్సరానికి భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న విషయమై ప్రణాళిక లు రూపొందిస్తున్నాము. మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలని చూస్తున్నాము. ప్రస్తుతం భారతదేశం ఆ ప్రణాళికల రూపకల్పనలో తీరిక లేకుండా ఉంది.
మిత్రులారా,
ఈ స్వాతంత్య్ర అమృతకాలం భారతదేశ శ్రేయస్సు యొక్క ఉన్నతమైన చరిత్రను లిఖించనుంది. ఇవీ మేం తీసుకున్న తీర్మానాలు అని నాకు తెలుసు. ఈ తీర్మానాలు చాలా పెద్దవి. కానీ స్నేహితులారా, నేను పెంచిన పెంపకం, నేను అందుకున్న విలువలు, నేను తీర్చి దిద్దిన వ్యక్తులు కూడా నాకు అలవాటుగా మారారు. నేను వెన్నపై చెక్కడం కంటే, రాయిపై చెక్కడాన్ని ఎక్కువగా ఆనందిస్తాను. అయితే మిత్రులారా , ప్రశ్న మోడీ గురించి కాదు. ఈ రోజు భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజలతో పాటు నేను, జపాన్ లో కూర్చున్న ప్రజల దృష్టిలో అదే చూస్తున్నాము. 130 కోట్ల దేశ ప్రజల విశ్వాసం, 130 కోట్ల సంకల్పం, 130 కోట్ల కలలు, ఈ 130 కోట్ల కలలను నెరవేర్చే ఈ అపారమైన శక్తి నా స్నేహితులకు ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. మన కలల భారతదేశాన్ని చూస్తాం. నేడు భారతదేశం తన నాగరికత, సంస్కృతి, సంస్థలపై కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందుతోంది. నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు భారతదేశం గురించి పెద్ద గర్వంతో, కళ్ళు పెద్దవి చేసుకుని మరీ మాట్లాడుతున్నారు. ఈ మార్పు వచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు, భారతదేశ గొప్పతనానికి ప్రభావితమై తమ జీవితాలను గడుపుతున్న కొంత మందిని చూసే అవకాశం నాకు లభించింది. వారు చాలా గర్వంగా యోగా గురించి విషయాలు చెప్పారు. వారు యోగాకు అంకితమయ్యారు. జపాన్‌లో కూడా యోగా గురించి వినని వారు ఎవరూ ఉండరు. మన ఆయుర్వేదం, మన సాంప్రదాయ వైద్య విధానం, ఈ రోజుల్లో మన సుగంధ ద్రవ్యాలకు దూర ప్రాంతాల నుండి చాలా డిమాండ్ ఉంది. ప్రజలు మన పసుపు కావాలని అడుగుతున్నారు. అంతే కాదు, మిత్రులారా, ఖాదీ విషయంలో కూడా చెప్పుకుంటే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రమంగా ఇది నాయకుల వేషధారణలో భాగం అయ్యింది. ఈ రోజు అది ఇంకా పుంజుకుంది. ఖాదీ ప్రపంచవ్యాప్తమవుతోంది. మిత్రులారా, ఇది ప్రస్తుతం భారతదేశం యొక్క మారుతున్న ముఖ చిత్రం. నేటి మన భారతదేశం తన గతం గురించి ఎంతగా గర్విస్తుందో, సాంకేతికత, శాస్త్ర విజ్ఞాన సారథ్యం, ఆవిష్కరణల్లో, ప్రతిభా పాటవాల్లో ముందడుగుతో భవిష్యత్తు గురించి కూడా అంతే ఆశాజనకంగా ఉంది. జపాన్ తో ప్రభావితమైన స్వామి వివేకానంద ఒకసారి మాట్లాడుతూ, భారతీయ యువకులమైన మనం మన జీవితంలో ఒక్కసారైనా జపాన్ ని సందర్శించాలని సూచించారు. ఈ వాక్యాలను చదివిన తర్వాత మీరు జపాన్ కు వచ్చి ఉంటారని, నేను భావించడం లేదు. అయితే, వివేకానందుడు భారతదేశ ప్రజలతో మాట్లాడుతూ, “సోదరా, మీరు ఒకసారి వెళ్లి జపాన్ ఎలా ఉందో చూడండి.” అని సూచించారు.
మిత్రులారా,
ఆ రోజుల్లో స్వామి వివేకానంద చెప్పిన దాని లోని అదే చిత్తశుద్ధిని ముందుకు తీసుకు వెళుతూ, నేటి యుగానికి అనుగుణంగా, జపాన్‌లోని ప్రతి యువకుడు తన జీవితంలో ఒక్కసారైనా భారతదేశాన్ని సందర్శించాలని నేను చెప్పాలనుకుంటున్నాను. మీ నైపుణ్యాలు, మీ ప్రతిభ, మీ వ్యవస్థాపకత లతో జపాన్ యొక్క ఈ గొప్ప భూమిని మీరు మంత్రముగ్ధులను చేసారు. మీరు జపాన్ కు భారతీయత యొక్క రంగులను, భారతదేశ అవకాశాలను నిరంతరం పరిచయం చేయాలి. విశ్వాసం లేదా సాహసం కావచ్చు, భారతదేశం జపాన్ కు సహజమైన పర్యాటక ప్రదేశం. అందువల్ల, భారతదేశానికి రండి, భారతదేశాన్ని దర్శించండి, భారతదేశంతో నిమగ్నమై ఉండండి, ఈ సంకల్పంతో జపాన్ లోని ప్రతి భారతీయుడిని దానితో నిమగ్నమవ్వమని నేను అభ్యర్థిస్తున్నాను. మీ అర్థవంతమైన ప్రయత్నాలతో భారత-జపాన్ దేశాల మధ్య స్నేహం నూతన శిఖరాలకు చేరుకుంటుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైన ఆదరణకు నేను ఎంతో సంతోషించాను. అదేవిధంగా, నేను ఇక్కడ లోపలికి వస్తున్నప్పుడు చూశాను, చుట్టూ ఉన్న ఉత్సాహం, నినాదాలు, మీలో మీరు భారతీయతతో జీవించడానికి ప్రయత్నిస్తున్న తీరు, ఇది నిజంగా నా హృదయాన్ని బరువెక్కించింది. మీలో ఉన్న ఈ ప్రేమ, ఈ ఆప్యాయతలు ఎప్పటికీ నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. కొంతమంది స్నేహితులు టోక్యో నుండి మాత్రమే కాకుండా బయట నుండి కూడా ఇక్కడికి వచ్చారని నాకు చెప్పారు. ఇంతకు ముందు నేను సందర్శించేవాడిని. ఈసారి వెళ్లలేకపోయాను, మీరంతా ఇక్కడికి వచ్చారు. తద్వారా, మీ అందరినీ కలిసే అవకాశం రావడం నాకు బాగా నచ్చింది.
మరోసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు.
మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
భారత్ మాతా కీ జై,
భారత్ మాతా కీ జై,
మీకు అనేక కృతజ్ఞతలు.
గమనిక – ప్రధానమంత్రి వాస్తవ ప్రసంగానికి ఇది స్వేచ్చానువాదం. వాస్తవ ప్రసంగం హిందీలో అందుబాటులో ఉంచడం జరిగింది.
*****
Grateful to the Indian community in Japan for their warm reception. Addressing a programme in Tokyo. https://t.co/IQrbSvVrns
— Narendra Modi (@narendramodi) May 23, 2022
स्वामी विवेकानंद जब अपने ऐतिहासिक संबोधन के लिए शिकागो जा रहे थे, तो उससे पहले वो जापान भी आए थे।
— PMO India (@PMOIndia) May 23, 2022
जापान ने उनके मन-मस्तिष्क पर एक गहरा प्रभाव छोड़ा था: PM @narendramodi
जापान के लोगों की देशभक्ति, जापान के लोगों का आत्मविश्वास, स्वच्छता के लिए जापान के लोगों की जागरूकता, उन्होंने इसकी खुलकर प्रशंसा की थी: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 23, 2022
भारत और जापान natural partners हैं।
— PMO India (@PMOIndia) May 23, 2022
भारत की विकास यात्रा में जापान की महत्त्वपूर्ण भूमिका रही है।
जापान से हमारा रिश्ता आत्मीयता का है, आध्यात्म का है, सहयोग का है, अपनेपन का है: PM @narendramodi
जापान से हमारा रिश्ता सामर्थ्य का है, सम्मान का है, विश्व के लिए साझे संकल्प का है।
— PMO India (@PMOIndia) May 23, 2022
जापान से हमारा रिश्ता बुद्ध का है, बोद्ध का है, ज्ञान का है, ध्यान का है: PM @narendramodi
आज की दुनिया को भगवान बुद्ध के विचारों पर, उनके बताए रास्ते पर चलने की बहुत ज़रूरत है।
— PMO India (@PMOIndia) May 23, 2022
यही रास्ता है जो आज दुनिया की हर चुनौती, चाहे वो हिंसा हो, अराजकता हो, आतंकवाद हो, क्लाइमेट चेंज हो, इन सबसे मानवता को बचाने का यही मार्ग है : PM @narendramodi
जब वैक्सीन्स available हुईं तब भारत ने 'मेड इन इंडिया' वैक्सीन्स अपने करोड़ों नागरिकों को भी लगाईं और दुनिया के 100 से अधिक देशों को भी भेजीं: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 23, 2022
World Health Organisation ने भारत की आशा बहनों को Director Generals- Global Health Leaders Award से सम्मानित किया है।
— PMO India (@PMOIndia) May 23, 2022
भारत की लाखों आशा बहनें, मैटेरनल केयर से लेकर वैक्सीनेशन तक, पोषण से लेकर स्वच्छता तक, देश के स्वास्थ्य अभियान को गति दे रही हैं: PM @narendramodi
हमारी इस कैपेसिटी के निर्माण में जापान एक अहम भागीदार है।
— PMO India (@PMOIndia) May 23, 2022
मुंबई-अहमदाबाद हाई स्पीड रेल हो, दिल्ली-मुंबई इंडस्ट्रियल कॉरिडोर हो, dedicated freight corridor हो, ये भारत-जापान के सहयोग के बहुत बड़े उदाहरण हैं: PM @narendramodi
हमने भारत में एक strong और resilient, responsible democracy की पहचान बनाई है।
— PMO India (@PMOIndia) May 23, 2022
उसको बीते 8 साल में हमने लोगों के जीवन में सकारात्मक बदलाव का माध्यम बनाया है: PM @narendramodi
भारत में आज सही मायने में people led governance काम कर रही है।
— PMO India (@PMOIndia) May 23, 2022
गवर्नेंस का यही मॉडल, डिलिवरी को efficient बना रहा है।
यही democracy पर निरंतर मज़बूत होते विश्वास का सबसे बड़ा कारण है: PM @narendramodi
आज का भारत अपने अतीत को लेकर जितना गौरवान्वित है, उतना ही tech led, science led, innovation led, talent led future को लेकर भी आशावान है: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 23, 2022
जापान से प्रभावित होकर स्वामी विवेकानंद जी ने कहा था कि हर भारतीय नौजवान को अपने जीवन में कम से कम एक बार जापान की यात्रा ज़रूर करनी चाहिए।
— PMO India (@PMOIndia) May 23, 2022
मैं स्वामी जी की इस सद्भावना को आगे बढ़ाते हुए, मैं चाहूंगा कि जापान का हर युवा अपने जीवन में कम से कम एक बार भारत की यात्रा करे: PM
India and Japan are natural partners. pic.twitter.com/P3AsXBCIek
— Narendra Modi (@narendramodi) May 23, 2022
The teachings of Lord Buddha are more relevant than ever before. They can help mitigate several global challenges. pic.twitter.com/RTJVn5Z922
— Narendra Modi (@narendramodi) May 23, 2022
Here is how India is helping fight climate change, create disaster resilient infrastructure and strengthen global prosperity. pic.twitter.com/ZltoCotPzj
— Narendra Modi (@narendramodi) May 23, 2022
My request to the people of Japan… pic.twitter.com/anZEfPomVK
— Narendra Modi (@narendramodi) May 23, 2022
बीते 8 वर्षों में हमने एक Strong, Resilient और Responsible Democracy की पहचान बनाई है। भारत की Democratic Process से आज समाज के वैसे लोग भी जुड़ रहे हैं, जो पहले कभी इसका हिस्सा बन ही नहीं पाते थे। pic.twitter.com/gMB47jCnOa
— Narendra Modi (@narendramodi) May 23, 2022
मैं जानता हूं कि आजादी के इस अमृतकाल में हमने जो संकल्प लिए हैं, वो बहुत बड़े हैं। लेकिन 130 करोड़ भारतीयों में जो उत्साह और आत्मविश्वास आज दिख रहा है, उससे मैं इन संकल्पों की सिद्धि के प्रति आश्वस्त हूं। pic.twitter.com/JOAWBMLUzD
— Narendra Modi (@narendramodi) May 23, 2022