Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జన్ ధన్ ఖాతాల కొత్త మైలురాయి పట్ల హర్షం ప్రకటించిన ప్రధానమంత్రి 50 కోట్లు దాటిన జన్ ధన్ ఖాతాలు


దేశంలో జన్ ధన్  ఖాతాలు కొత్త మైలురాయిని చేరడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు. దేశంలో జన్  ధన్  ఖాతాల సంఖ్య 50 కోట్లు దాటింది.

వీటిలో సగం ఖాతాలు నారీశక్తి ఖాతాలేనని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని శ్రీ మోదీ అన్నారు.

ఈ మేరకు పిఐబి ఇండియా చేసిన ట్వీట్  కు పిఎం స్పందిస్తూ

‘‘ఇది ఒక అద్భుతమైన మైలురాయి. వీటిలో  సగానికి  పైగా ఖాతాలు నారీశక్తివే కావడం ఆనందదాయకం. 67% ఖాతాలు గ్రామీణ, సెమీ-అర్బన్  ప్రాంతాల్లో తెరిపించడమే కాదు, మన దేశంలో ప్రతీ మారుమూల ప్రాంతాలకు ఫైనాన్షియల్  ఇంక్లూజన్  ప్రయోజనాలు అందడానికి మేం హామీ ఇస్తున్నాం’’ అని ట్వీట్  చేశారు.

 

***

DS/ST