Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘‘జన్ జాతీయ గౌరవ దివస్ ద్వారా దేశం యొక్క ఆదివాసివారసత్వం పట్ల గౌరవాన్ని వ్యక్తం చేయడం, అలాగే ఆదివాసి సముదాయం అభివృద్ధి కోసంసంకల్పం తీసుకోవడం అనేవి ‘పంచ ప్రాణ్’ సంబంధిత శక్తి లో భాగం గా ఉన్నాయి’’

‘‘జన్ జాతీయ గౌరవ దివస్ ద్వారా దేశం యొక్క ఆదివాసివారసత్వం పట్ల గౌరవాన్ని వ్యక్తం చేయడం, అలాగే ఆదివాసి సముదాయం అభివృద్ధి కోసంసంకల్పం తీసుకోవడం అనేవి ‘పంచ ప్రాణ్’ సంబంధిత శక్తి లో భాగం గా ఉన్నాయి’’


భగవాన్ బిర్ సా ముండా మరియు కోట్ల కొద్దీ జనజాతీయ శూరులు కన్న కలల ను నెరవేర్చడం కోసం దేశ ప్రజలు పంచ ప్రాణా’ల అండదండల తో ముందుకు సాగిపోతున్నారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘జన్ జాతీయ గౌరవ్ దివస్ మాధ్యం ద్వారా దేశం యొక్క ఆదివాసి వారసత్వం పట్ల సమ్మానాన్ని వ్యక్తం చేయడం తో పాటు గా ఆదివాసి సముదాయం యొక్క అభివృద్ధి కై సంకల్పాన్ని తీసుకోవడం అనేవి ఈ శక్తి లో ఓ భాగం గా ఉంది’’, అని ఆయన అన్నారు. జన్ జాతీయ గౌరవ్ దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి ఒక వీడియో సందేశం మాధ్యం ద్వారా దేశ ప్రజల కు ఈ రోజు న శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

భగవాన్ బిర్ సా ముండా కు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని సమర్పించారు. నవంబర్ 15వ తేదీ అనేది ఆదివాసి సంప్రదాయాన్ని ఒక ఉత్సవం గా జరుపుకొనే రోజు అని ప్రధాన మంత్రి అన్నారు. ఎందుకంటే భగవాన్ బిర్ సా ముండా కేవలం మన స్వాతంత్య్ర సమరం లో ఒక వీరుడు మాత్రమే కాదు, ఆయన మన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక శక్తి కి ఒక వాహకం గా ఉండేవారు అని ప్రధాన మంత్రి అన్నారు.

స్వాతంత్య్ర సమరం లో ఆదివాసి సముదాయం అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. అంతేకాకుండా, ఆదివాసి సముదాయం పాలుపంచుకొన్న కీలకమైన ఉద్యమాల ను మరియు స్వాతంత్య్రం కోసం వారు సలిపిన యుద్ధాల ను ఆయన స్మరించుకొన్నారు. తిలక్ మాంఝీ గారి నాయకత్వం లో సాగిన దామిన్ సంగ్రామ్, బుద్ధు భగత్ గారి ఆధ్వర్యం లో జరిగిన లర్ కా ఆందోళన్, సిద్ధు-కాన్హూ క్రాంతి, తానా భగత్ ఉద్యమం, బేగ్ డా భీల్ ఉద్యమం, నాయక్ డా ఉద్యమం, సంత్ జోరియా పరమేశ్వర్ మరియు రూప్ సింహ్ నాయక్, లిమ్ దీ దాహోద్ పోరు, మాన్ గఢ్ లో గోవింద్ గురు జీ, ఇంకా అల్లూరి సీతారామరాజు సారథ్యం లో రంప ఉద్యమం లను ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు.

ఆదివాసి సముదాయం యొక్క తోడ్పాటు ను గుర్తించి, మరి వాటిని ఒక ఉత్సవ రూపం లో జరుపుకోవడానికి తీసుకొన్న చర్యల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. దేశం లో వివిధ ప్రాంతాల లో ఆదివాసి వస్తు సంగ్రహాలయాల ను గురించి, అలాగే జన్ ధన్, గోబర్ ధన్, వన్ ధన్, స్వయం సహాయక సమూహాలు, స్వచ్ఛ్ భారత్, పిఎమ్ ఆవాస్ యోజన, మాతృత్వ వందన యోజన, గ్రామీణ్ సడక్ యోజన, మొబైల్ కనెక్టివిటీ, ఏకలవ్య పాఠశాల లు, అటవీ ఉత్పత్తుల లో 90 శాతం వరకు ఉత్పత్తుల కు ఎమ్ఎస్ పి, సికిల్-సెల్ అనీమియ, ఆదివాసి పరిశోధన సంస్థ లు, కరోనా సంబంధి ఉచిత టీకామందు మరియు మిశన్ ఇంద్రధనుష్ వంటి పథకాలు దేశం లో ఆదివాసి సముదాయాని కి పెద్ద ఎత్తున ప్రయోజనాల ను అందించాయి అని ఆయన అన్నారు.

ఆదివాసి సమాజ్ యొక్క పరాక్రమాన్ని గురించి, సాముదాయిక జీవనం గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. ఈ ఘనమైన వారసత్వం నుండి నేర్చుకొని భారతదేశం తన భవిష్యత్తు ను తీర్చిదిద్దుకోవలసి ఉంది. ఇందుకు గాను జన్ జాతీయ గౌరవ్ దివస్ ఒక అవకాశం గా, ఒక మాధ్యం గా తప్పక రూపొందుతుందని నేను తలుస్తున్నాను అంటూ ప్రధాన మంత్రి తన సందేశాన్ని ముగించారు.

DS