ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 వ సంవత్సరం జనవరి 6 వ, 7వ తేదీల లో జయ్పుర్ లోని రాజస్థాన్ ఇంటర్నేశనల్ సెంటర్ లో జరుగనున్న డైరెక్టర్ జనరల్స్ / ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత సమావేశం 2023 లో పాలుపంచుకొంటారు.
జనవరి 5 వ తేదీ నాడే ప్రారంభం కానున్న మొత్తం మూడు రోజుల సమావేశం లో సైబర్ క్రైమ్ పోలీసు విభాగం లో, సాంకేతిక విజ్ఞానం, ఉగ్రవాదం తో తలపడడం లో ఎదురవుతున్న సవాళ్ళు, వామపక్ష తీవ్రవాదం, జైళ్ళ సంస్కరణలు తదితర అంశాలు సహా, పోలీసు విభాగం మరియు అంతర్గత భద్రతల కు సంబంధించిన అనేక అంశాల పై చర్చించడం జరుగుతుంది. క్రొత్త క్రిమినల్ చట్టాల యొక్క అమలుకు గాను ఒక మార్గసూచీ ని రూపొందించడం పైన చర్చోపచర్చలు జరపాలి అనేది ఈ సమావేశం యొక్క మరొక కీలకమైనటువంటి కార్యక్రమం గా ఉండబోతోంది. దీనికి తోడు, ఎఐ, డీప్ ఫేక్ మొదలైనటువంటి సరిక్రొత్త సాంకేతికతల వల్ల ఎదురవుతున్న సవాళ్ళ ను దృష్టి లో పెట్టుకొని పోలీసు విభాగం మరియు భద్రత విభాగాల లో భావి కార్యాచరణ అనే అంశం పైన కూడా సమావేశం లో చర్చోపచర్చలు జరుగనున్నాయి. ప్రధాన మంత్రి కి ప్రతి సంవత్సరం లో నివేదించేటటువంటి నిర్ధిష్ట కార్యాచరణ సంబంధి అంశాలు మరియు వాటి విషయం లో పురోతిని పర్యవేక్షించడం లకు కూడా ఈ సమావేశం ఒక అవకాశాన్ని అందించనుంది.
గుర్తించిన అంశాల విషయం లో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిల కు చెందిన పోలీసు అధికారులు మరియు నిఘా విభాగం అధికారులు విస్తృత చర్చోపచర్చలు జరిపిన మీదట తుది విడతగా ఈ సమావేశం ఏర్పాటయింది. ప్రతి ఒక్క విభాగం లో రాష్ట్రాల నుండి/కేంద్ర పాలిత ప్రాంతాల నుండి అత్యుత్తమమైన అభ్యాసాల ను ఈ సమావేశం లో నివేదించడం జరుగుతుంది. తద్ద్వారా రాష్ట్రాలు ఒకదాని నుండి మరొకటి పరస్పరం నేర్చుకొనేందుకు వీలు కలుగుతుంది.
2014 వ సంవత్సరం నాటి నుండి ప్రధాన మంత్రి డిజిపి సమావేశం పట్ల ఎంతో ఆసక్తిని ప్రదర్శించారు. ఇది వరకటి ప్రధానులు ప్రతీకాత్మకం గా ఈ సమావేశాల కు హాజరు కాగా, ఆ పద్ధతి కి భిన్నం గా ప్రస్తుత ప్రధాన మంత్రి సమావేశం లో అన్ని ప్రధాన సదస్సుల లోను స్వయం గా పాలుపంచుకొంటున్నారు. సమావేశం దృష్టి కి తీసుకు వచ్చిన అన్ని విషయాల ను ప్రధాన మంత్రి ఓపిక గా ఆలకించడం ఒక్కటే కాకుండా, స్వేచ్ఛాయుక్తమైన మరియు లాంఛనప్రాయం అయిన చర్చల ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ విధం గా చేయడం వల్ల క్రొత్త క్రొత్త ఆలోచన లు తెర మీద కు వచ్చేందుకు వీలు కలుగుతోంది. అల్పాహారం, భోజనం మరియు రాత్రిపూట భోజనం వేళల్లో నిర్ధిష్ట అంశాల పై అరమరికల కు తావులేనటువంటి చర్చలు ఈ సంవత్సరం సమావేశం లో చోటు చేసుకోవాలని కూడా సంకల్పించడమైంది. ఇది చిరకాల అనుభవం కలిగిన పోలీసు అధికారుల కు వారి వారి ఆలోచనల ను వెల్లడి చేయడానికి మరియు పోలీసు విధులు, ఇంకా అంతర్గత భద్రతల కు సంబంధించి వారి వారి సిఫార్సుల ను సమర్పించడాని కి ఒక అవకాశాన్ని ఇవ్వబోతోంది.
ప్రధాన మంత్రి 2014 వ సంవత్సరం మొదలుకొని దేశవ్యాప్తం గా డిజిపి సమావేశాల ను ప్రతి ఏటా నిర్వహించడాన్ని సైతం ప్రోత్సహించారు. ఈ సమావేశాన్ని 2014 వ సంవత్సరం లో గువాహాటీ లో; 2015 లో రణ్ ఆఫ్ కచ్ఛ్ లోని ధోర్డో లో; 2016 లో హైదరాబాద్ లోని నేశనల్ పోలీస్ అకాడమీ లో; 2017 లో టేకన్పుర్ లోని బిఎస్ఎఫ్ అకాడమీ లో; 2018 లో కేవడియా లో; 2019 లో పుణె లోని ఐఐఎస్ఇఆర్ లో; 2021 లో లఖ్నవూ లోని పోలీసు ప్రధాన కేంద్రం లో; మరి అలాగే 2023 వ సంవత్సరం లో దిల్లీ లోని పూసా లో గల నేశనల్ ఎగ్రికల్చర్ సైన్స్ కాంప్లెక్స్ లో నిర్వహించడం జరిగింది. ఈ సంప్రదాయాని కి కొనసాగింపు గా తాజా సమావేశాన్ని ఈ సంవత్సరం లో జయ్ పుర్ లో నిర్వహించడం జరుగుతున్నది.
ఈ సమావేశాల లో పాలుపంచుకొనేవారి లో కేంద్ర హోం శాఖ మంత్రి, జాతీయ భద్రత సలహాదారు, దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, కేబినెట్ సెక్రట్రి, భారత ప్రభుత్వం లో సీనియర్ అధికారులు, రాష్ట్రాల డిజిపి లు/కేంద్ర పాలిత ప్రాంతాల డిజిపి లు, కేంద్రీయ సాయుధ పోలీసు దళాల ప్రధానాధికారుల తో పాటు, కేంద్రీయ పోలీసు సంస్థలు, తదితర వర్గాలు ఉన్నాయి.
***