Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జనవరి 27న ఢిల్లీలో కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి ఇతివృత్తం: యువశక్తి… వికసిత్ భారత్


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 27న సాయంత్రం గంటల 30 నిమిషాలకు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న ఎన్‌సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారుఈ తరహా ర్యాలీని ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు.

 

ఈ సంవత్సరం రిపబ్లిక్ డే క్యాంపులో మొత్తం 2361 మంది ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొన్నారువారిలో 917 మంది బాలికలు కూడా ఉన్నారుబాలికలు ఇంత ఎక్కువ సంఖ్యలో పాలుపంచుకోవడం ఇదే మొదటిసారిఢిల్లీలో నెల రోజులుగా నిర్వహించిన ఎన్‌సీసీ రిపబ్లిక్ డే క్యాంపు ముగింపు కార్యక్రమంగా ఈ ర్యాలీ నిర్వహిస్తారుయువ శక్తివికసిత్ భారత్’ను ఈ ఏడాది ఎన్‌సీసీ పీఎం ర్యాలీకి ఇతివృత్తంగా ఎంపిక చేశారు.

 

ముగింపు రోజు 800కు పైగా కేడెట్లు దేశ నిర్మాణంలో ఎన్‌సీసీ తోడ్పాటు అనే అంశంపై సాంస్కృతిక కార్యక్రమాన్ని సమర్పించనున్నారు. 18 మిత్ర దేశాలకు చెందిన 144 మంది యువ కేడెట్లు పాలుపంచుకోవడం ఈ సంవత్సరం ర్యాలీ ఉత్సాహాన్ని మరింత పెంచనుంది.

దేశవ్యాప్తంగా మేరా యువ (ఎంవైభారత్విద్యాశాఖగిరిజన వ్యవహారాల శాఖలకు చెందిన 650కి పైగా స్వచ్ఛంద కార్యకర్తలు ఎన్‌సీసీ పీఎం ర్యాలీకి ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు.