Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జనవరి 15న మహారాష్ట్రలో ప్రధానమంత్రి పర్యటన


ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జనవరి 15న మహారాష్ట్రలో పర్యటిస్తారుఆరోజు ఉదయం 10:30 గంటలకు ముంబయిలోని నావల్ డాక్ యార్డ్ లో మూడు ఫ్రంట్ లైన్ నేవీ యుద్ధ నౌకలు– ఐఎన్ ఎస్ సూరత్ఐఎన్ ఎస్ నీలగిరిజలాంతర్గామి ఐఎన్ ఎస్ వాఘ్షీర్ లను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారుఅనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు నవీ ముంబయిలోని ఖార్ఘర్ లో ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభిస్తారు.

మూడు ప్రధాన నావికాదళ యుద్ధ నౌకలను ప్రారంభించడం రక్షణ తయారీసముద్ర భద్రతలో ప్రపంచ సారధ్యం వహించాలనే భారతదేశ దార్శనికతను సాకారం చేయడంలో గణనీయమైన ముందడుగును సూచిస్తుందిపి 15 బి గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ లోని నాలుగో చివరి నౌక అయిన ఐఎన్ఎస్ సూరత్ ప్రపంచంలోని అతిపెద్దఅత్యంత అధునాతన శత్రు విధ్వంసక నౌకల్లో ఒకటిఇది 75 శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని అత్యాధునిక ఆయుధసెన్సర్ ప్యాకేజీలుఅధునాతన నెట్వర్క్కేంద్రీకృత సామర్థ్యాలను కలిగి ఉందిఇక ఐఎన్ఎస్ నీలగిరి పి17ఎ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ మొదటి నౌకభారత నావికాదళానికి చెందిన యుద్ధనౌకల డిజైన్ బ్యూరో దీనిని రూపొందించిందిఇది మెరుగైన మనుగడసీ కీపింగ్స్టెల్త్ కోసం అధునాతన లక్షణాలను కలిగి ఉందితరువాతి తరం స్వదేశీ యుద్ధనౌకలకు ప్రతీకపి 75 స్కార్పీన్ ప్రాజెక్ట్ లో ఆరో చివరి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ జలాంతర్గామి నిర్మాణంలో భారతదేశ అభివృద్ధి చెందుతున్న నైపుణ్యాన్ని చాటుతుందిదీనిని నేవల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్ సహకారంతో నిర్మించారు.

భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించే నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి ఈ పర్యటనలో నవీ ముంబయి లోని ఖార్ఘర్ లో ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ ఆలయాన్ని ప్రారంభించనున్నారుతొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులో అనేక దేవతలతో కూడిన ఆలయంవేద విద్యా కేంద్రంప్రతిపాదిత మ్యూజియంలు ఆడిటోరియంహీలింగ్ సెంటర్ ఉన్నాయివైదిక బోధనల ద్వారా విశ్వమానవ సౌభ్రాతృత్వంశాంతిసామరస్యాన్ని పెంపొందించడం దీని లక్ష్యం.

 

***