Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జనవరి 13న జమ్మూ కాశ్మీర్ లో సోనామార్గ్ టన్నెల్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 13న జమ్మూశ్మీర్ లోని సోనామార్గ్ ను సంద ర్శించనున్నారుఆరోజు ఉదయం 11.45 గంటలకు సోనామార్గ్ టన్నెల్ ను ప్రారంభిస్తారుఈ సందర్భంగా జరిగే సభలో ప్రధాని ప్రసంగిస్తారు.

సుమారు 12 కిలోమీటర్ల పొడవైన సోనామార్గ్ టన్నెల్ ప్రాజెక్టును రూ.2,700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారుఇందులో సోనామార్గ్ ప్రధాన సొరంగంఎగ్రెస్ టన్నెల్అప్రోచ్ రోడ్లు ఉన్నాయిసముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉన్న ఈ టన్నెల్ లే.. మార్గంలో శ్రీనగర్సోనామార్గ్‌ మధ్య అన్ని వాతావరణాలలో అంతరాయం లేని ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తుందివిరిగిపడే అవకాశం ఉన్న కొండచరియలనుహిమపాత మార్గాలను అధగమించి వ్యూహాత్మకంగా కీలకమైన లడఖ్ ప్రాంతానికి సురక్షితమైనఅంతరాయం లేని ప్రవేశాన్ని అందిస్తుందిసోనామార్గ్ ను ఏడాది పొడవునా గమ్యస్థానంగా మార్చడంశీతాకాల పర్యాటకంసాహస క్రీడలుస్థానిక జీవనోపాధిని పెంచడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది.

2028 నాటికి పూర్తికానున్న జోజిలా టన్నెల్ తో పాటుఇది మార్గం పొడవును 49 కిలోమీటర్ల నుండి 43 కిలోమీటర్లకు తగ్గిస్తుందివాహనాల వేగాన్ని గంటకు 30 కిలోమీటర్ల నుండి 70 కిలోమీటర్లకు పెంచుతుందిశ్రీనగర్ లోయలడఖ్ మధ్య అంతరాయం లేని ఎన్ హెచ్ -1 కనెక్టివిటీకి దోహదపడుతుంది.

ఈ మెరుగైన కనెక్టివిటీ రక్షణ సంబంధ రవాణా సౌలభ్యాన్ని పెంచుతుందిజమ్మూ కాశ్మీర్లడఖ్ అంతటా ఆర్థిక వృద్ధిసామాజికసాంస్కృతిక సమైక్యతను పెంచుతుంది.

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ టన్నెల్ నిర్మాణానికి అహర్నిశలు శ్రమించిన భవన నిర్మాణ కార్మికుల ఇంజనీరింగ్ ఘనతకు గుర్తింపుగా ప్రధాని వారితో సమావేశం అవుతారు.

 

***