స్వామి ఛత్రపతి శివాజి జయంతిని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు స్మృత్యంజలిని ఘటించారు.
“గొప్ప వాడైన ఛత్రపతి శివాజి
మహరాజ్ కు ఆయన జయంతి సందర్భంగా ఇదే నా నివాళి. ఆయన పరాక్రమం బాగా ప్రచారంలో ఉంది. ఆయన మొక్కవోని సాహసాన్ని, యుద్ధ స్ఫూర్తిని వర్ణించాలంటే, అది మాటలతో అయ్యే పని కాదు.
ఛత్రపతి శివాజిని సుపరిపాలన అనే కాగడాను పట్టుకున్న వ్యక్తిగాను, ఇంకా కార్యసాధకుడైన పాలకుడిగాను జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. ఆయన
మన అందరికీ ఒక స్ఫూర్తి మూర్తిగా ఉంటారు” అని ప్రధాన మంత్రి అన్నారు.
Tributes to Chhatrapati Shivaji. pic.twitter.com/h8QDg8G8ba
— Narendra Modi (@narendramodi) February 19, 2016