ఛత్తీస్ గఢ్ నుండి వచ్చినటువంటి చిత్రకారుడు శ్రీ శ్రవణ్ కుమార్ శర్మ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో భేటీ అయ్యారు.
ఆ కళాకారుడు ప్రధాన మంత్రి యొక్క వర్ణ చిత్రాన్ని ఆయన కు కానుక గా ఇచ్చారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ఛత్తీస్ గఢ్ కు చెందిన ప్రతిభావంతుడైన చిత్రకారుఢు శ్రీ శ్రవణ్ కుమార్ శర్మ ను కలుసుకొన్నాను. ఆయన కొన్నేళ్ళుగా చిత్రలేఖనం లో నిమగ్నం అయ్యారు; ఆదివాసీ కళ అంటే ఆయన కు ఎంతో మక్కువ మరి.’’ అని తెలిపారు.
Met a talented artist from Chhattisgarh Shri Shravan Kumar Sharma. He has been painting for years and is very passionate about tribal art. pic.twitter.com/Rgx3IqZWQ3
— Narendra Modi (@narendramodi) January 5, 2023