ఛత్తీస్గఢ్ కు ముఖ్యమంత్రి గా శ్రీ విష్ణు దేవ్ సాయి పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు గా శ్రీ అరుణ్ సావ్ మరియు శ్రీ విజయ్ శర్మ లు పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో వారి కి కూడా అభినందనల ను శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –
‘‘ఛత్తీస్గఢ్ కు ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో విష్ణు దేవ్ సాయి గారి కి మరియు ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావ్ గారి తో పాటు విజయ్ శర్మ గారి కి అనేకానేక శుభాకాంక్షలు. సాంస్కృతిక వారసత్వం తో సమృద్ధం అయినటువంటి ఈ రాష్ట్రం లో ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం బిజెపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ ఉంటుందన్న దృఢ విశ్వాసం నాలో ఉంది. రాష్ట్ర వాసుల యొక్క జీవనం లో సమృద్ధి ని మరియు సుఖ సంతోషాల ను తీసుకు రావడం కోసం డబల్ ఇంజన్ ప్రభుత్వం పూర్తి స్థాయి లో కట్టుబడి ఉంది. @vishnudsai @ArunSao3’’ అని పేర్కొన్నారు.
छत्तीसगढ़ के मुख्यमंत्री पद की शपथ लेने पर विष्णु देव साय जी और उप मुख्यमंत्री अरुण साव जी एवं विजय शर्मा जी को बहुत-बहुत शुभकामनाएं! मेरा यह दृढ़ विश्वास है कि सांस्कृतिक विरासत से समृद्ध इस राज्य की भाजपा सरकार जन आकांक्षाओं को पूरा करने के लिए निरंतर प्रयासरत रहेगी।… pic.twitter.com/rbJO68ykQ2
— Narendra Modi (@narendramodi) December 13, 2023