ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, దేశీయంగా చమురు, సహజవాయు ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ప్రస్తుత హైడ్రో కార్బన్ రిజర్వుల రికవరీస్థాయిన మెరుగుపరిచే టెక్నిక్‌లు, సంప్రదాయేతర హైడ్రో కార్బన్ (యుహెచ్‌సి)ఉత్పత్తి పద్ధతులు, మెరుగైన రికవరీ(ఐ.ఆర్),మరింత విస్తారిత రికవరీ (ఇఆర్)కి ప్రోత్సాహకాలు , రికవరీని పెంపొందించే పద్ధతులకు సంబంధించి విధానపరమైన కార్యాచరణకు ఆమోదం తెలిపిందిజ
విస్తారిత రికవరీలో విస్తారిత చమురు రికవరీ(ఇఒఆర్), విస్తారిత గ్యాస్ రికవరీ(ఇజిఆర్) సంప్రదాయేతర హైడ్రోకార్బన్(యుహెచ్‌సి) ఉత్పత్తి పద్ధతులు, అలాగే షేల్ ఆయిల్ , గ్యాస్ ఉత్పత్తి , టై్ ట్ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి, షేల్ ఆయిల్ నుంచి ఉత్పత్తి, గ్యాస్ హైడ్రేట్‌లు, హెవీ ఆయిల్ వంటి వి ఇమిడి ఉన్నాయి.
విస్తారిత రికవరీ, మెరుగైన రికవరీ,,సంప్రదాయేతర హైడ్రోకార్బన్ల అన్వేషణ, వెలికితీత వంటివి పెద్ద ఎత్తున ఖర్చుతోకూడుకున్న, సాంకేతికంగా సంక్లిష్టమైన,ప్రకృతిపరంగా సవాలుతో కూడుకున్నవి.ఇందుకు తగిన మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ మద్దతు, వనరులకు సంబంధించిన ప్రోత్సాహకాలు,అందుకు అనుగుణమైన వాతావరణ అవసరం.
ఈ వ్యూహాత్మక విధానం లక్ష్యం, అధ్యయన , పరిశోధన సంస్థల ద్వారా, పరిశ్రమ- అధ్యయన సంస్థల మధ్యకొలాబరేషన్ ద్వారా తగిన అనుకూల వ్యవస్థలను ఏర్పాటుచేయడం. అలాగే చమురు,సహజవాయు రికవరీకి సంబంధించి అన్వేషణ,ఉత్పత్తి ( ఇ అండ్ పి) కాంట్రాక్టర్లు, ఇ.ఆర్, ఐ.ఆర్, యుహెచ్.సి పద్ధతులు, విధానాలు అనుసరించేట్టు చేయడం కూడా ఈ విధాన లక్ష్యం.
ఈ విధానంఅన్ని కాంట్రాక్టు వ్యవస్థలు, కేటాయింపు క్షేత్రాలకు ఇది వర్తిస్తుంది. ఈ విధానపరమైన చొరవ కారణంగా ఈరంగంలోకి కొత్త గా పెట్టుబడులు రావడానికి, ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకోవడానికి, అదనపు ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశం కలుగుతుంది.ఈ విధాన నిర్ణయం వల్ల ప్రస్తుత చమురు సహజవాయు క్షేత్రాలలో ఉత్పాదకతను పెంచేందుకు సాంకేతిక కొలాబరేషన్,అధునాతన , వినూత్నసాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడానికికి వీలు కల్పిస్తుంది.
ఈ విధానం ద్వారా ప్రతి చమురు,గ్యాస్ క్షేత్రాన్ని దాని ఇ.ఆర్ సామర్ద్యం, దానికి అనువైన ఇ.ఆర్ టెక్నిక్‌లు, ఇ.ఆర్‌ప్రాజెక్టులపై ఖర్చుచేసే మొత్తంపై రిస్క్ లేకుండా ఉండేవిధంగా ఇ.ఆర్ ప్రాజెక్టులపై పెట్టుబడులు ఆర్థికంగా అనువైన విధంగా ఉండేందుకు అవసరమైన ఆర్థిక ప్రోత్సాహకాలు వంటి వాటిని ఒక పద్ధతి ప్రకారం అంచా వేస్తుంది. ప్రభుత్వం నోటిఫై చేసిన నిర్దేశిత సంస్థల ద్వారా చమురు,గ్యాస్‌క్షేత్రాలను పరిశీలింపచేయడం తప్పనిసరి చేస్తారు. వాణిజ్యపరంగా ఇ.ఆర్ ప్రాజెక్టును వాస్తవంగా అమలు చేయడానికి ముందు ప్రయోగాత్మకంగా పరిశీలన చేయడం వంటివి ఈ విధానంలో ఉన్నాయి. పెట్రోలియం ,సహజవాయు ముంత్రిత్వశాఖ, డైరక్టరేట్ జనరల్ ఆప్ హైడ్రోకార్బన్స్ (డిజిహెచ్), ఈ రంగానికి సంబంధించిన నిపుణులు, బోధన రంగ నిపుణులతో విస్తారిత రికవరీ (ఇ.ఆర్) కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఈ పాలసీ పర్యవేక్షణ , అమలును చూస్తుంది.
ఈ విధానం కింద సన్‌సెట్ క్లాజ్ కూడా ఉంది. దీనిని నోటిఫై చేసిన నాటినుంచి 10 సంవత్సరాల వరకు మాత్రమే ఇది అమలులో ఉంటుంది. ఇ.ఆర్,, యుహెచ్‌సి ప్రాజెక్టులకు సంబంధించి ఉత్పత్తి ప్రారంభమైన నాటినుంచి 120 నెలల కాలానికి ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తారు. ఐ.ఆర్ ప్రాజెక్టుల విషయంలో, ప్రోత్సాహకాలు వాటి నిర్దేశిత బెంచ్‌మార్క్‌ను సాధించిన నాటి నుంచిఇస్తారు. ఈ విధానం కింద వివిధ ప్రక్రియల పూర్తికి నిర్దేశిత కాలావధులను నిర్ణయించారు. ఆర్థిక ప్రోత్సాహకాలను , నిర్దేశిత క్షేత్రాలలో ఇ.ఆర్ పద్ధతులు వాడినందుకు ఇంక్రిమెంటల్ ఉత్పత్తిపై రాయల్టీ, సెస్ ను పాక్షిక రద్దు రూపంలో వర్తింప చేస్తారు.
పాత చమురు ,గ్యాస్‌క్షేత్రాలలో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంవల్ల హైడ్రోకార్బన్ రిజర్వులను మరింత ఎక్కువగా వెలికితీయడానికి చెప్పుకోదగిన స్థాయిలో అవకాశాలు ఉంటాయి.చమురు ఉత్పత్తికి సంబంధించి 5 శాతం రికవరీ రేటు పెరిగినా రాగల 20 సంవత్సరాలలో 120 మిలియన్‌మెట్రిక్ టన్నుల అదనపు చమురు వెలికితీయగలుగుతాం. గ్యాస్ విషయంలో ప్రస్తుత పరిస్థితి కంటే 3 శాతం రికవరీ రేటు పెరిగినా రాగల 20 సంవత్సరాలలో 52 బిసిఎం ల గ్యాస్ అదనపు ఉత్పత్తిని సమకూర్చుకోగలుగుతాం.
*******