Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చైనా కు బ‌య‌లుదేరి వెళ్లే ముందు ప్ర‌క‌ట‌న‌ ను జారీ చేసిన‌ ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018, ఏప్రిల్ 27 వ మరియు 28 వ తేదీ ల‌లో చైనా లోని వుహాన్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న చైనా కు బ‌య‌లుదేరి వెళ్లే ముందు జారీ చేసిన ప్ర‌క‌ట‌న ఈ కింది విధంగా ఉంది:

‘‘పీపుల్స్ రిప‌బ్లిక్ ఆఫ్ చైనా అధ్య‌క్షులు, శ్రేష్ఠులైన శ్రీ శీ జిన్ పింగ్ తో ఒక ఇష్టాగోష్ఠి శిఖ‌ర స‌మ్మేళ‌నం లో పాలుపంచుకోవ‌డం కోసం నేను 2018 ఏప్రిల్ 27వ మరియు 28 వ తేదీ ల‌లో చైనా లోని వుహాన్ ను సంద‌ర్శించ‌నున్నాను.

ద్వైపాక్షిక మ‌రియు ప్ర‌పంచ స్థాయి ప్రాముఖ్య‌ం క‌లిగి వున్న ప‌లు అంశాల‌పై అధ్య‌క్షులు శ్రీ శీ మ‌రియు నేను ఒక‌రి అభిప్రాయాల‌ను మ‌రొక‌రితో తెలియజెప్పుకోనున్నాము. మేము జాతీయ అభివృద్ధి తాలూకు ప్రాధాన్యాలను, ఇంకా మా మా దార్శ‌నిక‌త‌లను, మ‌రీ ముఖ్యంగా ప్ర‌స్తుత అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల‌కు మ‌రియు భావి అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల‌ను గమనంలోకి తీసుకొంటూ చ‌ర్చించ‌నున్నాము.

మేము భార‌త‌దేశం-చైనా సంబంధాల‌లో పురోగ‌తి ని సైతం వ్యూహాత్మ‌కమైన మ‌రియు దీర్ఘ‌కాలికమైన దృష్టి కోణాల నుండి స‌మీక్షించ‌నున్నాము.’’

***