Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చెన్నై విమానాశ్రయం లో నిర్మాణం పూర్తి అయిన కొత్త అత్యాధునిక ఏకీకృత టర్మినల్ భవనం చెన్నై యొక్క మౌలిక సదుపాయాల వ్యవస్థ లో ఒక ముఖ్యమైన అదనపు చేర్పు కానుంది: ప్రధాన మంత్రి


చెన్నై విమానాశ్రయం లో నిర్మాణం పూర్తి అయిన కొత్త అత్యాధునిక ఏకీకృత టర్మినల్ భవనం చెన్నై యొక్క మౌలిక సదుపాయాల వ్యవస్థ లో ఒక ముఖ్యమైన అదనపు చేర్పు కానుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆ భవనం కనెక్టివిటీ ని వృద్ధి చెందింప చేయడంతో పాటుగా స్థానిక ఆర్థిక వ్యవస్థ కు లాభాన్ని కూడా అందించనుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

చెన్నై విమానాశ్రయం లో నూతనం గా నిర్మించిన అత్యాధునిక ఏకీకృత టర్మినల్ భవనం లోని ఒకటో దశ ను గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఏప్రిల్ 8వ తేదీ నాడు ప్రారంభించనున్నారు అని పౌర విమానయానం మంత్రిత్వ శాఖ కొన్ని ట్వీట్ లలో తెలియ జేసింది.

పౌర విమానాయానం మంత్రిత్వ శాఖ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ –
‘‘ఇది చెన్నై లోని మౌలిక సదుపాయాల వ్యవస్థ కు ఒక ముఖ్యమైనటువంటి అదనపు చేర్పు కానుంది. ఇది కనెక్టివిటీ ని వృద్ధి చెందింప చేస్తుంది. దానితో పాటుగా స్థానిక ఆర్థిక వ్యవస్థ కు కూడా లాభాన్ని అందిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.