Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చెన్నై మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్‌-1లోని కారిడార్‌-1 విస్త‌ర‌ణ ప్ర‌తిపాద‌న‌కు కాబినెట్ ఆమోదం


చెన్నై మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్‌-1లోని కారిడార్‌-1 విస్త‌ర‌ణ ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రి మండ‌లి ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. వ్యాష‌ర్‌మ్యాన్ పేట్ నుంచి విమ్ కో న‌గ‌ర్ వ‌రకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు. ఇది 9.051 కిలోమీట‌ర్లు పొడ‌వు వుంటుంది. దీని కోసం అయ్యే వ్య‌యం రూ. 3770 కోట్లు.

ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని భార‌త ప్ర‌భుత్వ ఎస్ పి వి, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం క‌లిసి నిర్మిస్తాయి. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో ఇరు సంస్థ‌ల‌కు 50:50 ఈక్విటీ ఉంది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ ప్రాజెక్ట్ 2018 నాటికి పూర్తి కావాలి.

ఈ విస్త‌ర‌ణ‌వ‌ల్ల ప్ర‌జా ర‌వాణ మెరుగ‌వుతుంది. పారిశ్రామిక కార్మికులు ఎక్కువ‌గా నివ‌సించే ప్రాంతాన్నుంచి న‌గ‌రంలో వ్యాపార కార్య‌క‌లాపాలు ఎక్కువ‌గా ఉండే ప్రాంతానికి ర‌వాణా సౌక‌ర్యం ఏర్ప‌డుతుంది. త‌ద్వారా వారి ఉపాధి మెరుగ‌వుతుంది.

ఈ ప్రాజెక్టు మొత్తం వ్య‌యంలో భార‌త ప్ర‌భుత్వ వాటా రూ.713 కోట్లు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ వాటా రూ.916 కోట్లు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ వాటాలో స్థ‌ల , ఆర్ అండ్ ఆర్ విలువ ఉంటుంది. ఇది రూ. 203 కోట్లు. మిగ‌తా మొతం రూ. 2141 కోట్ల‌ను బ‌హుళ‌ప‌క్ష‌/ ద్వై పాక్షిక / దేశీయ నిధి సౌక‌ర్య సంస్థ‌ల‌నుంచి రుణాలుగా తీసుకుంటారు.

మొద‌టి సంవ‌త్స‌రంలో ప్ర‌యాణించే ప్ర‌యాణికుల రైడ‌ర్‌షిప్‌ను 1.6 ల‌క్షలుగా అంచ‌నా వేయ‌డం జ‌రిగింది.