ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాసు 56వ స్నాతకోత్సవం లో పాలు పంచుకోవడం కోసం చెన్నై కి విచ్చేశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో ప్రసార మాధ్యమాల ప్రతినిధుల ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భం గా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 2019వ సంవత్సరం లో సాధారణ ఎన్నికల అనంతరం చెన్నై కు నేను రావడం ఇది మొదటి సారి అని ప్రధాన మంత్రి అన్నారు. ఐఐటి మద్రాసు యొక్క స్వర్ణోత్సవాలకు హాజరు కావడం కోసం నేను ఇక్కడ కు వచ్చాను. అయితే, నాకు స్వాగతం పలికేందుకు ఇంత పెద్ద సంఖ్య లో ఇక్కడ కు వచ్చినందుకు మీకు అందరి కీ నేను ఎంతగానో రుణపడి పోయాను.
ఇటీవల అమెరికా ను సందర్శించిన సందర్భం లో, భారతీయ సముదాయం సభ్యుల ను ఉద్దేశించి తమిళ భాష లో నేను మాట్లాడి తమిళం ప్రపంచం లో అతి పురాతనమైనటువంటి భాష అని చెబితే, ఆ విషయం యుఎస్ఎ లోని ప్రసార మాధ్యమాలు అన్నిటిలో వచ్చిందని ఆయన తెలిపారు.
నా యుఎస్ఎ యాత్ర కాలం లో, ప్రపంచం భారతదేశానికేసి గొప్ప ఆశల ను పెట్టుకొందని గ్రహించాను; మరి అంచనా రోజు రోజు కు పెరుగుతోందని గమనించాను అని ప్రధాన మంత్రి అన్నారు. ఇక భారతదేశాన్ని ఒక గొప్ప దేశం గానే కాకుండా ప్రపంచ సముదాయం యొక్క అపేక్షల ను అందుకొనే విధం గా కూడా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది అని ఆయన చెప్పారు.
ఈ పని ఒక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే కాదని, ఇది 130 కోట్ల మంది భారతీయుల ద్వారా మాత్రమే నెరవేర గలదని శ్రీ మోదీ అన్నారు. ఈ కార్యం దేశం లోని ప్రతి ఒక్క ప్రాంతం లోని మరియు దేశం లోని ప్రతి ఒక్కరి ప్రయత్నం ద్వారా.. వారు ధనికులు కావచ్చు లేదా పేదలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, లేదా పల్లెవాసులు కావచ్చు, యువకులు కావచ్చు లేదా వయస్సు మళ్ళిన వారు కావచ్చు.. వారు చేసే ప్రయత్నాల ద్వారా మాత్రమే సంభవమవుతుంది అని ఆయన వివరించారు.
ప్రజల భాగస్వామ్యం ద్వారా మనం ఎన్నో విజయాల ను సాధించడం జరిగింది. మరి అదే విధం గా మనం దేశాన్ని ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ బారి నుండి తప్పించాలి అని ఆయన అన్నారు. భారతదేశం ప్లాస్టిక్ కు చోటు లేనిది గా తయారవ్వాలని నేను కోరుకున్నట్టు కొంత మంది పొరపాటు న పెడర్థాన్ని తీస్తున్నారు. కానీ, నేను అలా అనలేదు. నేను చెప్పింది ఏమిటంటే, దేశం ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ నుండి విముక్తం కావాలి అని నేను కోరుకుంటున్నాను అని. ఈ ప్లాస్టిక్ ను ఒకసారి మాత్రం వినియోగించవచ్చును; ఆ తరువాత అది అనేక సమస్యల ను తెచ్చిపెడుతుంది అని ఆయన పేర్కొన్నారు.
అక్టోబరు 2వ తేదీ నాడు మహాత్మ గాంధీ 150వ జయంతి కి మనం ఒక పాద యాత్ర ను చేయాలి. గాంధీ ఆదర్శాల ను ఈ పాద యాత్రల ద్వారా వ్యాప్తి లోకి తీసుకు రావాలి అని ఆయన అన్నారు.
‘‘నాకు స్వాగతం చెప్పడం కోసం ఇంత భారీ సంఖ్యల లో ఇక్కడ కు తరలి వచ్చినందుకు మీకు మరో సారి నేను ధన్యవాదాల ను తెలియజేస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
ఆయన ఐఐటి-ఎమ్ రిసర్చ్ పార్క్ లో ‘సింగపూర్- ఇండియా హ్యాకథన్ 2019’లో కూడా ప్రసంగించనున్నారు. అక్కడి ఒక డేరా లో ఏర్పాటు చేసిన స్టార్ట్-అప్ లను సందర్శిస్తారు. ఇన్స్ టిట్యూట్ యొక్క విద్యార్థుల కార్యకలాపాల కేంద్రం లో ఆయన స్నాతకోపన్యాసం చేస్తారు.
**
Speaking at Chennai Airport. Watch. https://t.co/7qWBSkMO5R
— Narendra Modi (@narendramodi) September 30, 2019