Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘చెన్నై క‌నెక్ట్’ భార‌త‌దేశం-చైనా సంబంధాల లో స‌హ‌కారభరిత నవ శ‌కాన్ని ఆరంభిస్తుంద‌న్న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోద


భార‌త‌దేశాని కి, చైనా కు మ‌ధ్య ‘‘సహకారం లో ఒక నూత‌న శ‌కాన్ని’’ త‌మిళ‌ నాడు లోని చెన్నై కు స‌మీపం లో ఉన్న మామ‌ల్ల‌పుర‌మ్ లో నేడు జ‌రిగిన లాంఛ‌న‌ప్రాయం కాన‌టువంటి రెండో శిఖ‌ర స‌మ్మేళ‌నం ఆరంభించింది అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

మామ‌ల్ల‌పుర‌మ్ లో ఈ రోజు న అనౌపచారిక శిఖ‌ర స‌మ్మేళ‌నం యొక్క రెండో రోజు న చైనా అధ్య‌క్షుడు శ్రీ శీ జిన్ పింగ్ కు మరియు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి మ‌ధ్య ప్ర‌తినిధివ‌ర్గం స్థాయి చ‌ర్చ‌ లు మొదలవడానికి ముందు ప్ర‌ధాన మంత్రి ఆరంభిక ప్ర‌క‌ట‌న ను వెలువ‌రించారు.

ఉభ‌య దేశాల మ‌ధ్య ఒక‌టో అనౌపచారిక శిఖ‌ర స‌మ్మేళ‌నం కింద‌టి సంవ‌త్స‌రం లో వుహాన్ లో జ‌రిగిన సంగ‌తి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ప్ర‌స్తావించి, ఆ స‌మావేశం ‘‘మ‌న సంబంధాల లో ఒక స‌రికొత్త గ‌తి ని మ‌రియు ఇతోధిక స్థిర‌త్వాన్ని తీసుకొని వ‌చ్చింది’’ అని పేర్కొన్నారు.

‘‘ఇరు దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క క‌మ్యూనికేశ‌న్ విస్తరించింది’’ అని ఆయ‌న అన్నారు.

‘‘మ‌న మ‌ధ్య వున్న అభిప్రాయ భేదాల‌ ను అవి వివాదాలు గా మారక మునుపే వివేక‌వంత‌మైన తీరు లో ప‌రిష్క‌రించుకోవాల‌ని, అదే విధం గా ఒక ప‌క్షం యొక్క ఆందోళ‌న‌ల‌ ను మ‌రొక ప‌క్షం అర్థం చేసుకొంటుంద‌ని, అంతేకాకుండా మ‌న మ‌ధ్య గ‌ల సంబంధాలు ప్ర‌పంచ శాంతి కి, ఇంకా ప్రపంచ స్థిర‌త్వాని కి పాటు ప‌డుతాయి’’ అని కూడా ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

మామ‌ల్ల‌పుర‌మ్ లో జ‌రిగిన రెండో అనౌపచారిక శిఖ‌ర స‌మ్మేళ‌నాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి మ‌ట్లాడుతూ, ‘‘చెన్నై స‌మిట్ లో మ‌నం ఇంత‌వ‌ర‌కు ద్వైపాక్షిక అంశాలను గురించి మరియు ప్ర‌పంచ అంశాల ను గురించి ఒక‌రి అభిప్రాయాల ను మ‌రొక‌రికి వెల్ల‌డి చేసుకొన్నాము. వుహాన్ ఇన్ ఫార్మల్ స‌మిట్ మ‌న ద్వైపాక్షిక సంబంధాల కు ఒక కొత్త గ‌తి ని అందించింది. ఈ రోజు న మ‌న చెన్నై క‌నెక్ట్ తో మ‌న రెండు దేశాల సంబంధాల లో స‌హ‌కారానికి సంబంధించిన ఒక కొత్త శ‌కం ఆరంభ‌మైంది’’ అన్నారు.

‘‘లాంఛ‌న ప్రాయం కాన‌టువంటి రెండో శిఖ‌ర స‌మ్మేళ‌నం లో పాలు పంచుకోవడం కోసం భార‌త‌దేశాని కి విచ్చేసినందుకు అధ్య‌క్షుడు శ్రీ శీ జిన్ పింగ్ కు నేను ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. #ChennaiConnect భార‌త‌దేశం-చైనా సంబంధాల లో గొప్ప గ‌తి ని జోడించ‌గ‌లుగుతుంది. ఇది మ‌న దేశాల ప్ర‌జ‌ల‌ తో పాటు ప్ర‌పంచాని కి సైతం ప్ర‌యోజ‌నకారి అవుతుంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

**************