ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న CHAMPIONS (చాంపియన్స్) పేరు తో ఒక టెక్నాలజీ ప్లాట్ ఫార్మ్ ను ప్రారంభించారు. CHAMPIONS సంక్షేపాని కి సంగ్రహ నామం ఏమిటి అంటే అది క్రియేశన్ ఎండ్ హార్మోనియస్ ఎప్లికేశన్ ఆఫ్ మాడర్న్ ప్రోసెసెజ్ ఫార్ ఇంక్రీజింగ్ ద ఆవుట్ పుట్ ఎండ్ నేశనల్ స్ట్రెంథ్.
పేరు సూచిస్తున్నట్లు గానే ఈ చాంపియన్స్ అనే పోర్టల్ ప్రాథమికం గా చిన్న యూనిట్ ల యొక్క ఇబ్బందుల ను పరిష్కరించడం ద్వారా వాటి ని పెద్ద సంస్థలు గా తీర్చిదిద్దడం, ఆ యూనిట్ లకు ప్రోత్సహాన్ని అందించడం, వాటి కి మద్దతివ్వడం, సాయపడటం మరియు వాటికి చేయూతనివ్వడం కోసం ఉద్దేశించినటువంటిది. ఇది ఎమ్ఎస్ఎమ్ఇ మంత్రిత్వ శాఖ తరఫు నుండి ఈ రంగం లోని చిన్న యూనిట్ లకై ఉద్దేశించినటువంటి ఓ వన్ స్టాప్ సాల్యూశన్ గా భావించడం జరుగుతోంది.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితి లో ఎమ్ఎస్ఎమ్ఇల కు సాయపడడం కోసం, మరి అలాగే అవి జాతీయ స్థాయి లో , ఇంకా అంతర్జాతీయ స్థాయి లో విజేతలు గా నిలవడం కోసం వాటి కి చేదోడునివ్వడానికి గాను ఈ ఐసిటి ఆధారిత వ్యవస్థ ను ఏర్పాటు చేయడమైంది.
CHAMPIONS యొక్క సమగ్రమైన లక్ష్యాలు:
i. ఇబ్బందుల నివారణ: ఎమ్ఎస్ఎమ్ఇ ల సమస్యల ను తీర్చడం; మరీ ముఖ్యం గా కోవిడ్ వల్ల ఉత్పన్నమైనటువంటి కష్టమైన పరిస్థితి లో వాటి కి సంబంధించిన ఆర్థిక సమస్యలు, ముడిసరకులు, శ్రామిక సంబంధ సమస్యలు, నియంత్రణ పరమైన అనుమతులు వంటివి పరిష్కరించడం.
ii. నూతన అవకాశాల ను సంపాదించుకొనేటట్టు వాటికి సాయాన్ని అందించడం; ఈ సహాయం లో వైద్య సరంజామా ను మరియు పిపిఇ కిట్స్, మాస్క్ ల తయారీ, ఇత్యాదుల లో సహకరించడం మరియు వాటిని జాతీయ, అంతర్జాతీయ విపణుల కు సరఫరా చేయడం లో సమన్వయం సాధించడం.
iii. మెరికల ను ఆనవాలు పట్టి తగు విధం గా ప్రోత్సహించడం; అంటే, దక్షత కలిగిన ఎమ్ఎస్ఎమ్ఇ లు ఏవయితే వర్తమాన పరిస్థితుల ను తట్టుకొని నిలబడగలిగాయో మరి ఏవయితే జాతీయ స్థాయి లో , ఇంకా అంతర్జాతీయ స్థాయి లో విజేతలు గా నిలదొక్కుకోగలవో ఆ తరహా సంస్థల కు దన్నుగా నిలవడం.
ఇది టెక్నాలజీ అండతో నిర్వహింపబడేటటువంటి కంట్రోల్ రూమ్- కమ్-మేనిజ్ మంట్ ఇన్ ఫర్ మేశన్ సిస్టమ్. టెలిఫోన్, ఇంటర్ నెట్ మరియు వీడియో కాన్ఫరెన్స్ లకు తోడు ఐసిటి సాధనాలు, ఇంకా ఆర్టిఫీశియల్ ఇంటెలిజెన్స్, డేటా ఎనాలిటిక్స్ మరియు మశీన్ లర్నింగ్ ల హంగుల కు దీని లో చోటు ను కల్పించడమైంది. ఈ పోర్టల్ ను భారత ప్రభుత్వం యొక్క ప్రధాన ఫిర్యాదుల నివారణ పోర్టల్ అయినటువంటి CPGRAMS తో మరియు ఎమ్ఎస్ఎమ్ఇ మంత్రిత్వ శాఖ యొక్క ఆధీనం లో నడుస్తున్నవెబ్ ఆధారితమైన అన్య యంత్రాంగాల తో వాస్తవ కాల ప్రాతిపదిక న పూర్తి స్థాయి లో ఏకీకృతం చేయడమైంది. ఎన్ఐసి యొక్క తోడ్పాటు తో ఖర్చేమీ పెట్టకుండానే ఐసిటి కి సంబంధించిన యావత్తు స్వరూపాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదే విధం గా, గోదాము గా మంత్రిత్వ శాఖ ఉపయోగిస్తూ వచ్చిన గదుల లోని ఒక గది లో దీనికి సంబంధించిన భౌతిక మౌలిక సదుపాయాల ను రికార్డు కాలం లో అమర్చడమైంది.
వ్యవస్థ లో భాగం గా కంట్రోల్ రూమ్ ల యొక్క ఒక నెట్ వర్క్ ను ఓ హబ్ ఎండ్ స్పోక్ మాడల్ మాదిరి గా ఏర్పాటు చేయడమైంది. ఈ హబ్ ను న్యూ ఢిల్లీ లోని ఎమ్ఎస్ఎమ్ఇ కార్యదర్శి యొక్క కార్యాలయం లో నెలకొల్పడం జరిగింది. వివిధ రాష్ట్రాల లోని వేరు వేరు కార్యాలయాలు మరియు ఎమ్ఎస్ఎమ్ఇ మంత్రిత్వ శాఖ యొక్క సంస్థ లు దీని కి స్పోక్స్ వలె ఉంటాయి. ఇంతవరకు, రాష్ట్రాల స్థాయి లో 66 కంట్రోల్ రూముల ను సిద్ధం చేసి, వాటి ని పనిచేయిస్తున్నారు కూడా. అవి CHAMPIONS పోర్టల్ కు కలపబడ్డాయి; అదే విధం గా అవి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా కూడా సంధానించబడ్డాయి. అధికారుల కు సమగ్రమైనటువంటి ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్- ఎస్ఒపి) ని జారీ చేయడమైంది. మరి అలాగే సిబ్బంది ని నియమించి, వారి కి శిక్షణ ను ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భం లో, ఎమ్ఎస్ఎమ్ఇ శాఖ, రహదారి రవాణా శాఖ మరియు హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ కూడా పాల్గొన్నారు.
Launched the portal, https://t.co/ZdLkL1rwK5
— Narendra Modi (@narendramodi) June 1, 2020
This is a one stop place for MSME sector. The focus areas are support & hand-holding, grievance redressal, harnessing entrepreneurial talent and discovering new business opportunities. https://t.co/diLjzKeRY5 pic.twitter.com/d9t8XGJcxT