రాజ్యసభలో ఈరోజు చమురు క్షేత్రాలు (నియంత్రణ, అభివృద్ది) 1948 చట్టానికి ప్రతిపాదించిన సవరణలను ఆమోదించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు. ఇంధన భద్రతను పెంపొందించడంతో పాటు, సుసంపన్నమైన భారత్‌ను నిర్మించేందుకు దోహదపడే ముఖ్యమైన చట్టంగా ఆయన అభివర్ణించారు.
కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ ఎక్స్‌లో చేసిన పోస్టుకు స్పందిస్తూ ‘‘ఇందన భద్రతను పెంపొందించే, సుసంపన్న భారతదేశాన్ని సాధించేందుకు దోహదపడే ముఖ్యమైన చట్టం ఇది’’ అని శ్రీ మోదీ అన్నారు.
This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India. https://t.co/7DduJWrlU3
— Narendra Modi (@narendramodi) December 3, 2024