Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘‘చంద్ర శేఖ‌ర్ – ద లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియ‌లోజిక‌ల్ పాలిటిక్స్‌’’ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ‘‘చ‌ంద్ర శేఖ‌ర్ – ద లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియ‌లోజిక‌ల్ పాలిటిక్స్‌’’ గ్రంథాన్ని ఆవిష్క‌రించారు.  ఈ పుస్త‌కాన్ని రాజ్య స‌భ డిప్యూటీ చైర్ మన్ శ్రీ హ‌రివంశ్ మ‌రియు శ్రీ ర‌వి ద‌త్త్ బాజ్‌ పాయీ రాశారు.  ఈ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని పార్ల‌మెంట్ గ్రంథాల‌య భ‌వ‌న స‌ముదాయం లోని బాల‌యోగి సభాభవనం లో నిర్వ‌హించారు. 

http://pibphoto.nic.in/documents/rlink/2019/jul/i201972405.JPG

పుస్త‌కం యొక్క ఒక‌టో ప్ర‌తి ని భార‌త ఉప రాష్ట్రప‌తి శ్రీ వెంక‌య్య నాయుడు కు ప్ర‌ధాన మంత్రి బహూకరించారు.

http://pibphoto.nic.in/documents/rlink/2019/jul/i201972406.JPG

ప్ర‌ధాన మంత్రి ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ, పూర్వ ప్ర‌ధాని చంద్ర శేఖ‌ర్ గారు కన్నుమూసి దాదాపు 12 సంవ‌త్స‌రాలు గ‌డ‌చిపోయాయనీ, అయినప్పటికీ కూడాను ఆయన ఆలోచనలు ప్ర‌స్తుత రాజ‌కీయ సందర్భం లో మ‌న‌ కు దారి ని చూపుతూనే ఉండటం విశేషమని, అవి ఎప్ప‌టి కీ ఉత్సాహాన్ని నింపేవిగా మిగులుతాయ‌న్నారు. 

http://pibphoto.nic.in/documents/rlink/2019/jul/i201972407.JPG

ఈ పుస్త‌కాన్ని వ్రాసినందుకు శ్రీ హ‌రివంశ్ ను ప్ర‌ధాన మంత్రి అభినందిస్తూ, శ్రీ చంద్ర శేఖ‌ర్ తో తాను జ‌రిపిన సంభాష‌ణ‌ల‌ తాలూకు కొన్ని ఉపాఖ్యానాలతో పాటు కొన్ని జ్ఞాప‌కాల ను స‌భికుల‌ సమక్షం లో వెల్ల‌డి చేశారు.

ఆయన 1977వ సంవ‌త్స‌రం లో శ్రీ చంద్ర శేఖ‌ర్ గారి తో తాను భేటీ అయిన సంగతి ని  గుర్తు కు తెచ్చుకొన్నారు.  పూర్వ ఉప రాష్ట్రప‌తి భైరాన్ సింహ్ షెఖావ‌త్ గారి తో కలసి  తాను ప్ర‌యాణిస్తూ, ఢిల్లీ విమానాశ్ర‌యం లో శ్రీ చంద్ర శేఖ‌ర్ ను క‌లుసుకున్నట్లు చెప్పారు.  ఉభ‌య నాయ‌కులు రాజ‌కీయ ప‌రం గా వేరు వేరు సిద్ధాంతాల‌ ను అనుస‌రించే వార‌యినప్ప‌టి కీ, ఒక స‌న్నిహిత బంధాన్ని పంచుకొన్నట్లు ఆయ‌న తెలిపారు.

శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ గారి ని శ్రీ చంద్ర శేఖ‌ర్ గారు ‘‘గురువు గారూ’’ అని సంబోధించార‌ని కూడా ప్ర‌ధాన మంత్రి జ్ఞ‌ప్తి కి తెచ్చుకొన్నారు.  చంద్ర శేఖ‌ర్ గారిని అసాధార‌ణ‌మైన‌టువంటి సంస్కృతి మ‌రియు సంప్ర‌దాయాలు మూర్తీభ‌వించిన వ్య‌క్తి అని ఆయ‌న అభివ‌ర్ణిస్తూ, చంద్ర శేఖ‌ర్ గారు త‌న కాలం లో ప్రధాన రాజ‌కీయ ప‌క్షాన్ని వ్య‌తిరేకించేందుకూ సంకోచించ‌ లేద‌ని, దీనికి కారణం ఆ పార్టీ యొక్క కొన్ని అంశాల తో ఆయ‌న స‌మ్మ‌తించ‌క‌ పోవ‌డ‌మే అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

మోహ‌న్ ధారియా గారు మ‌రియు జార్జ్ ఫెర్నాండెజ్ గారు ల వంటి రాజకీయ నాయకులు ఇరువురూ చంద్ర శేఖ‌ర్ గారి ని గురించి ఎంతో గౌర‌వం గా మాట్లాడారు అని ప్ర‌ధాన మంత్రి తన ప్రసంగం లో ప్ర‌స్తావించారు.

శ్రీ చంద్ర‌ శేఖ‌ర్ గారి తో త‌న క‌డ‌ప‌టి స‌మావేశాన్ని శ్రీ న‌రేంద్ర‌ మోదీ గుర్తు కు తెచ్చారు.  జ‌బ్బుప‌డిన పూర్వ ప్ర‌ధాని టెలిఫోన్ ద్వారా త‌న‌ తో మాట్లాడారని, ఢిల్లీ కి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా  క‌లుసుకోవలసిందిగా తన ను ఆయన ఆహ్వానించార‌న్నారు. శ్రీ చంద్ర శేఖ‌ర్ గారు ఆ సంభాష‌ణ క్ర‌మం లో, గుజ‌రాత్ యొక్క అభివృద్ధి ని గురించి అడిగి తెలుసుకొని అనేక జాతీయ అంశాల విష‌యం లో ఆయన యొక్క దృష్టి కోణాన్ని గురించి వివరించార‌ని శ్రీ మోదీ తెలిపారు. 

ఆయ‌న‌కు ప్ర‌జాస్వామిక సూత్రాల ప‌ట్ల గల స‌మ‌ర్ప‌ణ భావం, ప్ర‌జ‌ల ప‌ట్ల గల నిబ‌ద్ధ‌త మ‌రియు ఆలోచ‌న‌లలో స్ప‌ష్ట‌త ఉన్నాయంటూ ప్రధాన మంత్రి ప్ర‌శంసలు కురిపించారు.

రైతులు, పేద‌లు మ‌రియు నిరాద‌ర‌ణ కు గురైన వర్గాల వారి కోసం శ్రీ చంద్ర‌శేఖ‌ర్ గారు చేప‌ట్టిన చ‌రిత్రాత్మ‌క‌మైన పాద యాత్ర ను కూడా ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు.  ఆయ‌న కు ఆ కాలం లో ఇవ్వ‌వ‌ల‌సిన గౌర‌వాన్ని ఇవ్వ‌డం లో మ‌నం విఫ‌లం కావ‌డం దుర‌దృష్ట‌క‌రం

 అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

డాక్టర్ ఆంబేడ్కర్ మ‌రియు స‌ర్ దార్ ప‌టేల్ లు స‌హా కొంత మంది భార‌తీయ నాయ‌కుల ప‌ట్ల ప్ర‌తికూల అభిప్రాయాల ను ఏర్ప‌ర‌చదలచుకొన్న వ్య‌క్తుల ముఠా అంటూ ఒక‌టి ఉన్న‌ద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  పూర్వ ప్ర‌ధానులు అంద‌రికీ ఢిల్లీ లో ఒక  మ్యూజియ‌మ్ ను ఏర్పాటు చేయనున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  పూర్వ ప్ర‌ధానుల జీవితం మ‌రియు వారు చేసిన కృషి తాలూకు వివ‌రాల‌ను అందించాల‌ని వారి యొక్క కుటుంబ స‌భ్యుల కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.  రాజ‌కీయ అస్పృశ్య‌త కు అతీతం గా, ఒక క్రొత్త రాజ‌కీయ సంస్కృతి అవసరం దేశాని కి ఎంతైనా ఉంద‌ని ఆయ‌న చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మానికి లోక్ స‌భ్ స్పీకర్ శ్రీ ఓం బిర్లా,  రాజ్య స‌భ డిప్యూటీ చైర్ మన్ శ్రీ హ‌రివంశ్ మ‌రియు రాజ్య స‌భ లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు శ్రీ గులాం న‌బీ ఆజాద్ హాజ‌ర‌య్యారు.  వారు కూడా స‌భికుల‌ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

**