ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, భారత దేశంలో ఆధికారిక పర్యటనకు విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఫ్రాంకోయిస్ హోలాండేతో కలసి తమ నిర్దిష్ట కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు చండీగఢ్‌లోని ప్రభుత్వ వస్తు ప్రదర్శనశాల మరియు కళా మందిరాన్ని సందర్శించారు.
నేతలు ఇరువురూ హిమాలయా పర్వత పాదాల ప్రాంతంలో లభించిన పురావస్తు అంశాల ప్రదర్శనను తిలకించారు. ఇవి సుమారు 2.6 మిలియన్ సంవత్సరాల కిందటి మానవ కార్యకలాపాలకు సంబంధించినవిగా భావిస్తున్నారు. అంటే వీటిని బహుశా మానవ జాతికి చెందిన అత్యంత పురాతన అవశేషాలుగా చెప్పుకోవచ్చు. ఫ్రెంచ్ నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ నేచురల్ హిస్టరీ కి చెందిన జాతీయ వస్తు ప్రదర్శనశాల పూర్వ చరిత్ర విభాగం; చండీగఢ్‌లోని సొసైటీ ఆఫ్ ఆర్కియోలాజికల్ అండ్ ఆంత్రోపాలాజికల్ రిసర్చ్, ఇండియా లు సంయుక్తంగా ఏడేళ్ళ పాటు నిర్వహించిన విస్తృత పరిశోధనల ఫలితంగా ఇవి లభించాయి. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం మేరకు ఈ పరిశోధన జరిగింది.
ఈ పరిశోధనలో భాగంగా చండీగఢ్ ప్రాంతానికి సమీపంలోని మాసోల్ వద్ద 50 ఎకరాల్లోని వివిధ ప్రాంతాల్లో నుంచి సుమారు 1500 శిలాజాలను, 200 క్వా ర్ట్ జయిట్ పనిముట్లను సేకరించారు. ఈ పరిశోధన ఫలితాలను వ్యాసాలుగా ద పేలేవాల్ రివ్యూ లో ప్రచురిస్తున్నారు. ఈ ఆవిష్కరణలలో పాలుపంచుకున్న భారత్- ఫ్రాన్స్ బృందాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఫ్రాంకోయిస్ హోలాండే లు అభినందించారు. ఉభయ దేశాల మధ్య దీర్ఘకాలంగా విజయవంతంగా కొనసాగుతున్న సాంస్కృతిక సంబంధాలు, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని అన్వేషించడం, పరిరక్షించడం, ప్రోత్సహించడంలో నిలకడగా ఉంటున్న ద్వైపాక్షిక సమన్వయాలకు ఈ పరిశోధనలు సజీవ ఉదాహరణగా నిలుస్తున్నాయన్నారు. ఇటువంటి పరిశోధనలు భవిష్యత్తులో మరిన్ని సంయుక్త కార్యక్రమాలు చేపట్టడానికి దోహదపడతాయన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.
Viewed displays of archaeological findings from foothills of the Himalayas with President @fhollande at the Government Museum & Art Gallery.
— NarendraModi(@narendramodi) January 24, 2016
The displays are result of years of hardworkbetween Indian & French researchers. Such exchanges are a special aspect of India-French ties.
— NarendraModi(@narendramodi) January 24, 2016
Infact, the research work relating to this archaeological discovery is being published in the PalevolReview. https://t.co/GPLzJ2Qk7I
— NarendraModi(@narendramodi) January 24, 2016