Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చండీగఢ్ లో అంతర్జాతీయ యోగా దినం కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి; కేపిటల్ కాంప్లెక్స్ లో జరిగిన సామూహిక యోగా ప్రదర్శనలో ఆయన పాలుపంచుకొన్నారు; అక్కడ గుమికూడిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు; మైదానంలో కలియదిరిగారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చండీగఢ్ లో జరిగిన రెండో అంతర్జాతీయ యోగా దినం కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు. అక్కడ గుమికూడిన ఇంచుమించు 30,000 మంది తో కలసి ఉమ్మడి యోగాభ్యాసంలో ఆయన పాల్గొన్నారు.

కేపిటల్ కాంప్లెక్స్ లో పోగయిన ప్రజా సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు యోగా తో సంధానం అయినట్లు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినం అనే ఆలోచనకు మద్దతు పలకడానికి యావత్తు ప్రపంచం ముందుకు వచ్చినట్లు చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల వారు ఈ ప్రయత్నానికి చేదోడుగా నిలుస్తున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు.

అంతర్జాతీయ యోగా దినం అనేది చక్కటి ఆరోగ్యంతో పెనవేసుకొన్న రోజు, ఇది ఒక భారీ ఉద్యమంగా రూపుదాల్చింది. యోగా ఒక వ్యక్తి ఏం పొందుతారనే దానిని గురించి కాక ఒక వ్యక్తి ఏం వదలుకోగలరు అనే దానిని గురించి చాటి చెబుతుంది. నయా పైసా ఖర్చు లేకుండా స్వాస్థ్య బీమాను అందజేస్తుంది, ధనికులు మరియు పేదలు అనే భేద భావాన్ని చూపించదు అంటూ ప్రధాన మంత్రి వివరించారు.

వచ్చే సంవత్సరం యోగా ద్వారా మధుమేహాన్ని ఎలా తగ్గించుకోవచ్చో అనే అంశంపై దృష్టి సారిద్దామని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. యోగాను ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్న వారి గౌరవార్థం రెండు అవార్డులను ప్రవేశపెడతారని, వీటిలో ఒకటి జాతీయ స్థాయిలో, రెండోది అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని వెల్లడించారు.

సామూహిక యోగా ప్రదర్శన కార్యక్రమంలో పాలుపంచుకొన్నవారిని ప్రధాన మంత్రి కలుసుకొన్నారు. తనూ వారి మధ్య యోగాభ్యాసంలో పాల్గొన్నారు. అలా వారితో మమేకమై, వారందరిలోను ఉత్సాహాన్ని నింపారు.