Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఘర్షణల నివారణ-పర్యావరణ చైతన్యంపై హిందూ బౌద్ధ సమ్మేళనం సంవద్ లో ప్రధాని ప్రసంగం పూర్తి పాఠం

ఘర్షణల  నివారణ-పర్యావరణ  చైతన్యంపై  హిందూ  బౌద్ధ  సమ్మేళనం  సంవద్ లో  ప్రధాని  ప్రసంగం  పూర్తి  పాఠం

ఘర్షణల  నివారణ-పర్యావరణ  చైతన్యంపై  హిందూ  బౌద్ధ  సమ్మేళనం  సంవద్ లో  ప్రధాని  ప్రసంగం  పూర్తి  పాఠం

ఘర్షణల  నివారణ-పర్యావరణ  చైతన్యంపై  హిందూ  బౌద్ధ  సమ్మేళనం  సంవద్ లో  ప్రధాని  ప్రసంగం  పూర్తి  పాఠం

ఘర్షణల  నివారణ-పర్యావరణ  చైతన్యంపై  హిందూ  బౌద్ధ  సమ్మేళనం  సంవద్ లో  ప్రధాని  ప్రసంగం  పూర్తి  పాఠం

ఘర్షణల  నివారణ-పర్యావరణ  చైతన్యంపై  హిందూ  బౌద్ధ  సమ్మేళనం  సంవద్ లో  ప్రధాని  ప్రసంగం  పూర్తి  పాఠం

ఘర్షణల  నివారణ-పర్యావరణ  చైతన్యంపై  హిందూ  బౌద్ధ  సమ్మేళనం  సంవద్ లో  ప్రధాని  ప్రసంగం  పూర్తి  పాఠం

ఘర్షణల  నివారణ-పర్యావరణ  చైతన్యంపై  హిందూ  బౌద్ధ  సమ్మేళనం  సంవద్ లో  ప్రధాని  ప్రసంగం  పూర్తి  పాఠం

ఘర్షణల  నివారణ-పర్యావరణ  చైతన్యంపై  హిందూ  బౌద్ధ  సమ్మేళనం  సంవద్ లో  ప్రధాని  ప్రసంగం  పూర్తి  పాఠం

ఘర్షణల  నివారణ-పర్యావరణ  చైతన్యంపై  హిందూ  బౌద్ధ  సమ్మేళనం  సంవద్ లో  ప్రధాని  ప్రసంగం  పూర్తి  పాఠం

ఘర్షణల  నివారణ-పర్యావరణ  చైతన్యంపై  హిందూ  బౌద్ధ  సమ్మేళనం  సంవద్ లో  ప్రధాని  ప్రసంగం  పూర్తి  పాఠం

ఘర్షణల  నివారణ-పర్యావరణ  చైతన్యంపై  హిందూ  బౌద్ధ  సమ్మేళనం  సంవద్ లో  ప్రధాని  ప్రసంగం  పూర్తి  పాఠం


మయన్మార్కు చెందిన సితాగు ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ అకాడమీ వ్యవస్థాపక చాన్సలర్ గౌరవనీయ సాయదా డాక్టర్ అసిన్ న్యానిసరా

గౌరవనీయ శ్రీలంక మాజీ అధ్యక్షురాలు శ్రీమతి చంద్రికా బండారునాయకే

జపాన్ విదేశాంగ మంత్రి మినోరూ కుయిచీ

పూజ్యశ్రీ రవిశంకర్జీ

నా మంత్రివర్గ సహచరులు డాక్టర్ మహేష్ శర్మ, కిరెన్ రిజిజుజీ

వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేష|న్ డైరెక్టర్ జనరల్ ఎన్సి విజ్

జపాన్కు చెందిన టోక్యో ఫౌండేషన్ ప్రెసిడెంట్ మసహిరో అకియామా

లామా జోబంగ్

అత్యంత గౌరవనీయులైన మత, ఆధ్యాత్మిక నాయకులు, గౌరవనీయ మహాసంఘ సభ్యులు, ధర్మ గురువులారా
ప్రపంచంలో సంఘర్షణల నివారణ, పర్యావరణ చైతన్యం పెంచేందుకు అంతర్జాతీయ హిందూ బౌద్ధ చైతన్య ఉద్యమం సంవద్ను ప్రారంభించే అరుదైన గౌరవం లభించినందుకు నేను ఆనందిస్తున్నాను.

ఇది నిజంగా ఆధ్యాత్మిక గురువులు, పండితులు, బుద్ధిజం జీవనంలో భాగంగా పాటిస్తున్న వివిధ దేశాలకు చెందిన నాయకుల మహా కూటమి.

ఈ సమావేశాన్ని భారతదేశంలోను ప్రత్యేకించి బోధ్గయలోను ఏర్పాటు చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ తరహా మేథోగోష్ఠిని నిర్వహించేందుకు భారత్ సరైన వేదిక. గౌతమ బుద్ధుడు ఈ భూమి నుంచే బుద్ధిజం సిద్ధాంతాన్ని ప్రవచించిన భూమి ఇదే కావడం మాకు చాలా గర్వకారణం.
గౌతమ బుద్ధుని జీవితం సేవాభావం, కరుణ, విప్లవ భావాలకు ప్రతీక. ఆయన రాజ కుటుంబంలో జన్మించాడు. కష్టాలంటే ఏమిటో తెలియదు. అయినా వయసు పెరుగుతున్న కొద్ది ఆయన మానవాళి ఎదుర్కొంటున్న బాధలు, రోగాలు, వృద్ధాప్యం, మరణం గురించి చైతన్యం పెంచుకున్నాడు.

భౌతిక సంపద ఒక్కటే మానవ జీవిత లక్ష్యం కాదని ఆయన గుర్తించాడు. మానవాళి సంఘర్షణలు ఆయనలో కలత నింపాయి. ప్రపంచాన్ని శాంతి, కరుణల బాటలో నడిపించేడానికి కంకణబద్ధుడయ్యాడు. ఆ రోజుల్లోనే ఆయన సమాజాన్ని ఒక దర్పణంలో ప్రజలకు చూపించే సాహసం చేశాడు. ప్రపంచాన్ని తిరోగమన బాటలో నడిపిస్తున్న దురాచారాలు, వ్యవస్థల నిర్మూలనకు ప్రయత్నించాడు.

గౌతమ బుద్ధుడు విప్లవ భావాలు గల వ్యక్తి. మానవుడు మాత్రమే కేంద్ర బిందువైన ఒక విశ్వాసాన్ని ఆవిష్కరించాడు. మానవునిలోని ఆత్మ దైవంతో సమానమని ఆయన ప్రవచించాడు. ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు భౌతికంగా లేని ఒక విశ్వాసాన్ని ఆయన ప్రవచించాడు. దైవత్వం అంటే ఎక్కడో వెలుపల అన్వేషించడం కాకుండా అంతర్ముఖంగా చూడాలన్నది ఆయన ప్రబోధించిన సిద్ధాంతం. ఆయన మూడు శబ్దాలతో కూడిన అప్ప దేవో భవ (నీకు నీవే వెలుగు) అనే గొప్ప మేనేజ్మెంట్ సూత్రాన్ని మానవాళికి అందించాడు. మానవాళి బాధలకు కారణం అవుతున్న అంతర్గత సంఘర్షణలే ఆయనను అధికంగా బాధించాయి. ఆయన విశ్వ దర్శనంలో అహింసా మార్గమే ప్రధానమైనది.

గౌతమ బుద్ధుని బోధనలు, ఆయన మానవాళికి ఇచ్చిన సందేశం ఈ అంతర్జాతీయ గోష్ఠి ప్రధాన చర్చనీయాంశాలైన సంఘర్షణల నివారణ, పర్యావరణ చైతన్య వ్యాప్తి, విశాల దృక్పథంతో ఎలాంటి దాపరికాలకు తావు లేని చర్చలు అనే అంశాలనే ప్రపంచానికి ఎలుగెత్తి ప్రబోధిస్తున్నాయి.

ఈ మూడు అంశాలు ఒక దానితో ఒకటి వేరుగా కనిపించవచ్చు. కాని అవి పరస్పరం ఏ మాత్రం సంబంధం లేనివి కానే కావు.

మొదటి అంశం సంఘర్షణనే తీసుకుందాం. సమాజంలో మతాలు, వర్గాలు, జాతులు, రాజ్యాలు, దేశాలు…ఒక్కటేమిటి? యావత్ ప్రపంచమే సంఘర్షణలకు దూరంగా నిలవాలి. కొన్ని ప్రభుత్వేతర శక్తులు ఇప్పుడు ప్రపంచంలో పెద్ద భూభాగాలను ఆక్రమించి తమ దారుణ మారణకాండతో అమాయక ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు.

రెండోది మానవునికి, ప్రకృతికి, మానవునికి, అభివృద్ధికి, మానవునికి, సైన్స్కు మధ్య జరుగుతున్న సంఘర్షణ. ఈ సంఘర్షణలు తొలగిపోవాలంటే ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో చర్చలు ఒక్కటే పరిష్కారం.
వినియోగం, పర్యావరణ చైతన్యం రెండింటికీ సంబంధించిన ఆత్మ నియంత్రణతో కూడిన నైతిక విలువలు ఆసియా ప్రాంత ప్రజల ఆధ్మాత్మిక భావనల్లోను, ప్రత్యేకించి హిందూ, బౌద్ధ మతాల్లోనూ అంతర్గతంగా ఉన్నాయి.

కన్ఫ్యూసియేషనిజం, తావోయిజం, షింతోయిజం వలెనే బుద్ధిజం కూడా పర్యావరణ పరిరక్షణ బోధనను ఒక పెద్ద బాధ్యతగా స్వీకరించింది. మనందరికీ మాతృక అయిన ఈ భూమాతపై బుద్ధిజం, హిందూయిజం అనుసరిస్తున్న నియమావళి ఆయా విభాగాల్లో రావలసిన మార్పులను సూచిస్తున్నాయి.

వాతావరణ మార్పుల అంశం ప్రస్తుతం ప్రపంచానికి పెను సవాలు విసురుతోంది. ఈ వినాశాన్ని అరికట్టడానికి మానవాళి అందరూ సంఘటితంగా కృషి చేయా్ల్సిన అవసరం ఉంది. ప్రాచీన కాలం నుంచి భారత భూభాగంలో విశ్వాసాలకు, ప్రకృతికి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. బుద్ధిజం, పర్యావరణ రెండూ ఒక దానితో ఒకటి లోతైన అనుసంధానం కలిగి ఉన్నాయి..

బౌద్ధ మతం ప్రకారం ఈ భూమండలంపై ఏదీ దేనికీ వేర్వేరు గుర్తింపు ఉండదు గనుక బౌద్ధ సంప్రదాయం ప్రకృతిసిద్ధమైన ప్రపంచంతో అనుసంధానం కావాలనే ప్రవచిస్తోంది. పర్యావరణ కలుషితం అయితే మనసులు కలుషితం అవుతాయి, మనసులు కలుషితం అయితే పర్యావరణం కలుషితం అవుతుంది. అందుకే మనం ముందుగా మనసులను శుద్ధిగా ఉంచుకోవాలి.

పర్యావరణ సంక్షోభం మన మనసుల్లో అసమతుల్యతకు దర్పణం. అందుకే గౌతమ బుద్ధుడు ప్రకృతి వనరులను పరిరక్షించుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. జల సంరక్షణ నియమావళిని రూపొందించాడు. బౌద్ధ సన్యాసులు ప్రకృతిసిద్ధమైన నీటి వనరులు కలుషితం చేయడాన్ని నిషేధించాడు. గౌతమ బుద్ధుని బోధనల్లో ప్రకృతి, అటవీ సంపద, వృక్ష సంపద, భూమండలంపై జీవ రాశులన్నింటి సంక్షేమాన్ని తన బోధనల్లో ప్రవచించాడు.

నేను “కన్వీనియెంట్ యాక్షన్” పేరిట రాసిన ఒక పుస్తకాన్ని కొద్ది కాలం క్రితం మాజీ రాష్ర్టపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ఆవిష్కరించారు. ఒక ముఖ్యమంత్రిగా వాతావరణ మార్పుల విషయంలో నా అనుభవాలను ఆ రచనలో గ్రంథస్థం చేశాను.

వ్యక్తిగతంగా నేను వేదిక్ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వాడిని. మానవాళికి, ప్రకృతి మాతకు మధ్య విడదీయరాని బలీయమైన బంధం ఉన్నదని ఆ సాహిత్యం నాకు బోధించింది. మహాత్మాగాంధీ కూడా మనం ప్రకృతికి ట్రస్టీలం మాత్రమేనన్న సిద్ధాంతం ప్రచారం చేశారు.

ప్రస్తుత తరంలోని మనందరం కూడా అత్యంత విలువైన సహజ వనరులను భావితరాలకు అందించే ట్రస్టీలుగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఇది వాతావరణ మార్పులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు…వాతావరణ న్యాయ సూత్రాలకు సంబంధించిన అంశం. ఈ అంశం నేను మరోసారి నొక్కి వక్కాణిస్తున్నాను.

నా దృష్టిలో ఈ వాతావరణ మార్పులకు అధికంగా గురవుతున్న వారు పేదలు, సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలే. ప్రకృతి వైపరీత్యాలు సంభవంచినప్పుడల్లా అధికంగా నష్టపోతున్నది వారే. వరదలు ముంచుకొస్తే నిరాశ్రయులయ్యేది వారే…భూకంపాలు వాటిల్లితే వారి ఇళ్ళే నేలమట్టం అవుతాయి. దుర్భిక్షాలు, అతి శీతల పరిస్థితులు…ఇలా ఒక్కటేమిటి…వారిని బాధించని వైపరీత్యం అంటూ ఉండదు.
వాతావరణ మార్పులు ప్రజలందరి జీవితాలతో ఇలాంటి వికృత క్రీడ ఆడడాన్ని మనం అనుమతించరాదు. అందుకే మనందరం ఇక నుంచి మన ప్రచారాన్ని వాతావరణ మార్పుల నుంచి వాతావరణ న్యాయం అన్న దిశగా మరల్చుకోవాలి.

మూడో అంశం మానవ సమాజం మధ్య చర్చకు సంబంధించినది. మనం సైద్ధాంతిక ధోరణులు విడనాడి వైదాంతిక ధోరణుల బాటలో చర్చలను ప్రోత్సహించాలి. సరైన చర్చలు కొరవడితే సంఘర్షణల నివారణకు సంబంధించిన రెండు సూత్రాలను ఆచరణలోకి తీసుకురావడం అసాధ్యం, అనాచరణీయం.

మన సంఘర్షణల నివారణ యంత్రాంగాల్లో ఉన్న పరిమితులు రోజురోజుకీ మరింత బహిర్గతం అవుతున్నాయి. రక్తపాతం, దౌర్జన్యకాండలను నిర్మూలించేందుకు మనందరం ఉమ్మడి వ్యూహాలు అనుసరించడం అవశ్యం. ఇందుకు బుద్ధిజంను ప్రపంచం మార్గదర్శకంగా తీసుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదు.
చారిత్రకమైన ఆసియా సాంప్రదాయాలు, విలువలకు ఇది గుర్తింపుగా కూడా భావించవచ్చు. అదే మన చర్చల ధోరణిని సైద్ధాంతికత నుంచి వైదాంతికత వైపు మరలిస్తుంది.

ఈ సమ్మేళనం ప్రధాన సూత్రం సంఘర్షణల నివారణ, పర్యావరణ చైతన్యం రెండింటినీ “వారు నుంచి మనం” అన్న భావనతో కూడిన చర్చల వేదికకు తీసుకురావడమే…

మన చర్చల ధోరణి సైద్ధాంతికత -మతపరమైనది కావచ్చు లేదా లౌకికం కావచ్చు- నుంచి వేదాంతం వైపు మరలించాల్సిన అవసరాన్ని మనందరం ప్రపంచానికి చాటి చెప్పడం అవసరం. నేను గత ఏడాది ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన సమయంలో కూడా ఈ అంశం సంక్షిప్తంగా ప్రస్తావించాను. ఒక రోజు తర్వాత విదేశాంగ వ్యవహారాల మండలి సమావేశంలో ప్రసంగించిన సమయంలో దీన్ని సవివరంగా తెలియచేశాను. సైద్ధాంతికత ద్వారాలు మూసి ఉంటాయి…కాని ఆధ్యాత్మిక, వైదిక భావనలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. అంటే చర్చల ద్వారా వాస్తవికతను మనం అన్వేషించవచ్చు. ఉపనిషత్ సాహిత్యం కూడా మానవాళి మధ్య ఎలాంటి అరమరికలు లేని చర్చలనే ప్రవచించింది. సైద్ధాంతికత విశృంఖలతను ప్రోత్సహిస్తుంది. అందుకే చర్చల ద్వారాలు మూసి వేసి దౌర్జన్యకాండకు ద్వారాలు తెరుస్తుంది. కాని వైదాంతిక భావాలు చర్చలకు మార్గాలు మరింత విశాలంగా తెరుస్తాయి.

అందుకే హిందూ, బౌద్ధ మతాలు ఒక విశ్వాసాలుగా కాకుండా మరింత వైదాంతికమైనవిగా ప్రాచుర్యం పొందాయి.

ఎలాంటి సంక్లిష్ట సమస్యలకైనా చర్చలు పరిష్కారం చూపుతాయన్నది నా ప్రగాఢ విశ్వాసం. బల ప్రదర్శనలతోనే అధికారాన్ని సాధించగలమని గతంలో విశ్వసించేవారు. కాని దాపరికాలు లేని చర్చలు, ఆలోచనా ధోరణులు అందించే బలమే అధికారాన్ని తెస్తుందన్నది నేటి వాస్తవం. పోరాటాల ప్రతికూల ఫలితాలను మనందరం కళ్ళారా చూశాం. 20వ శతాబ్ది ప్రథమార్ధంలో మనం రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన భయోత్పాతాన్ని వీక్షించాం.

ఇప్పుడు పోరాటాల స్వభావం కూడా మారింది. ప్రమాదాలు మరింతగా పెరిగాయి. ఒకప్పుడు కోట్లాది మంది వీరులతో జరిగిన యుద్ధాలు ఇప్పుడు ఒక బటన్ నొక్కడంతోనే నిముషాల వ్యవధిలో జరిగిపోతున్నాయి.
భవిష్యత్ తరాలు శాంతి, ఆత్మగౌరవం, పరస్పర విశ్వాసంతో జీవనం సాగించగల అవకాశాన్ని అందుకునేలా చూడాల్సిన గురుతర బాధ్యత మనందరి పైనా ఉంది. సంఘర్షణల రహిత సమాజానికి బీజాలు వేయాల్సి ఉంది. ఈ కృషిలో హిందూయిజం, బుద్ధిజం ప్రవచించే విశ్వాసాలకు ప్రాధాన్యత కూడా ఉంది.

చర్చల గురించి మనం మాట్లాడాల్సి వస్తే వాటి స్వభావం ఎలా ఉండాలి…? ఆవేశ కావేశాలకు తావు లేని చర్చలు కావాలి. ఆది శంకరులు, మందన మిశ్రాకు మధ్య చోటు చేసుకున్న చర్చ ఇందుకు చక్కని ఉదాహరణ.

మన ఆధునిక సమాజానికి దీన్ని ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆది శంకరులు మూఢాచారాలకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వని ఒక యువ సన్యాసి. పశువుల బలి ఇవ్వడం వంటి మూఢాచారాలను విపరీతంగా నమ్మే ఒక పండితుడు.

ముక్తి సాధనకు ఇలాంటి విశ్వాసాలేవీ పాటించనక్కరలేదనే భావం ఆది శంకరులది అయితే ఇలాంటి మూఢాచారాలపై ఆది శంకరుల అభిప్రాయం తప్పని నిరూపించాలన్నది మందన మిశ్రా పట్టుదల.
వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అందులో ఆదిశంకరులు గెలవగా మందన మిశ్రా పరాజయం చవి చూడాల్సి వచ్చింది. ఇక్కడ చర్చ ప్రధానం కాదు… ఆ చర్చ ఎలా జరిగిందన్నదే ప్రధానం. మానవాళి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే సంభాషణ లేదా గోష్ఠి అది.

ఆ గోష్ఠిలో పరాజయం చవి చూడాల్సి వస్తే మందన మిశ్రా గృహస్థాశ్రమం వీడి సన్యాసం స్వీకరించాలన్నది, అలాగే ఆది శంకరులు ఓడిపోతే ఆయన సన్యాసాశ్రమం వీడి గృహస్థుగా మారాలన్నది ఉభయుల మధ్య అంగీకారం. కాకలు తీరిన పండితులైన మందన మిశ్రా ఆ గోష్ఠిలో ఆది శంకరులు ఏ విధంగానూ తనకు సమ ఉజ్జీ కారని భావించి తనకు కావలసిన రిఫరీని ఎంచుకునే స్వేచ్ఛ శంకరులకే వదిలారు. మందన మిశ్రా భార్యనే ఆది శంకరులు రిఫరీగా ఎంచుకున్నారు. మందన మిశ్రా ఓడిపోతే ఆమె తన భర్తను వదులుకోవలసి వస్తుంది. ఆమె ఆ ఇద్దరినీ దండలు ధరించాలని కోరింది. వారిద్దరిలో ఎవరి దండ తాజాదనాన్ని కోల్పోతే వారు పరాజయం పాలైనట్టేనని ఆమె ప్రకటించింది. ఆమె అలా ఎందుకు చేసింది…? ఎవరికైనా కోపం అధికంగా వస్తే శరీరంలో వేడి ఎక్కువైపోతుంది. ఆ వేడిలో సున్నితమైన పూలు త్వరగా వాడిపోతాయి. అంటే కోపం అనేది మన పరాజయానికి అంతర్గత చిహ్నం అన్న మాట. ఈ తాత్విక భావనతోనే మందన మిశ్రా పరాజయం పాలైనట్టు ఆమె ప్రకటించింది. పరాజయంపాలైన మందన మిశ్రా సన్యాసాశ్రమం స్వీకరించి ఆది శంకరుల శిష్యుడుగా మారిపోయాడు. చర్చల ప్రాధాన్యత ఎంతటిది…ఎలాంటి ఆవేశకావేశాలకు లోను కాకుండా చర్చలో పాల్గొనడం ఎంత ముఖ్యం అన్నది ఈ సంఘటన చెబుతుంది.
నేడు ఎందరో మేథావులతో కూడిన ఈ సమ్మేళనంలో భిన్న విశ్వాసాలు, భిన్న జీవనశైలులు, భిన్న జాతీయతలు గల వారందరం ఉన్నాం. కాని మనందరినీ కలిపే దారం మన నాగరికతలు ప్రబోధించిన సిద్ధాంతాలు, చరిత్ర, మనందరి ఘనమైన చారిత్రక వైభవం. ముఖ్యంగా బుద్ధిజం, బౌద్ధ మతం అందించిన చారిత్రక వైభవం మనందరినీ కలిపాయి.

ఈ శకం ఆసియా శకమేనని అందరూ ఎలుగెత్తి చెబుతున్నారు. కాని గౌతమ బుద్ధుని ప్రబోధాలు, ఆయన చూపించిన బాట అనుసరించలేకపోతే మనం దాన్ని సాధించలేమని నేను స్పష్టం చేయదలుచుకున్నాను.
గౌతమ బుద్ధుడు మనందరికీ ఆధ్యాత్మిక సుసంపన్నతను అందిస్తే అంతర్జాతీయ వాణిజ్య మనందరికీ ఆర్థిక సుసంపన్నత చేకూర్చింది. డిజిటల్ ఇంటర్నెట్ మనందరిలోనూ మేథో సుసంపన్నత తీసుకువచ్చింది.

21వ శతాబ్దంలో మనందరి మధ్య ఓర్పు సహనాలతో కూడిన అవగాహనను, తాదాత్మ్య భావనను, సహనాన్ని ప్రబోధిస్తూ గౌతమ బుద్ధుడు ఒక వారధిగా నిలుస్తాడని నేను నమ్ముతున్నాను.

బౌద్ధ మతం అందించిన అపూర్వమైన చారిత్రక సంపద గల దేశాన్ని మీరందరూ సందర్శిస్తున్నారు. నా స్వస్థలం గుజరాత్లోని వద్నగర్ పట్టణం కూడా బౌద్ధ మతానికి చెందిన పురాతన అవశేషాలు లభించిన కొద్ది ప్రదేశాల్లో ఒకటి..చైనా పర్యాటకుడు జియాన్జాంగ్ సందర్శించిన ప్రదేశం.

బౌద్ధ మతానికి చెందిన ఎన్నో చారిత్రక స్థలాలు గలది సార్క్ ప్రాంతం. లుంబిని, బోధ్గయ, సారనాథ్, కుశినగర్ వంటి బౌద్ధ మత ప్రాధాన్యం గల ప్రదేశాలు చైనా, కొరియా, జపాన్, మంగోలియా, రష్యాలతో సహా ఆసియాన్ దేశాల పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

భారతదేశం అంతటా బౌద్ధ మత చారిత్రక సంపదను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నా ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. అంతే కాదు అసియా అంతటా బౌద్ధ మతం చారిత్రక సంపదను వ్యాపింపచేయడంలో కరదీపికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు జరగబోతున్న ఈ సమ్మేళనం అలాంటి ప్రయత్నాల్లో ఒకటి. రానున్న మూడు రోజుల్లో్ భిన్న అంశాలపై చక్కని విశాల దృక్పథంతో కూడిన చర్చలు జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. సంఘర్షణల రహిత, శాంతి సుస్థిరతలతో కూడిన పరిశుభ్రమైన హరిత ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు మనందరం కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం మహత్తరమైనది.

రేపు బోధ్గయలో మీ అందరినీ కలిసేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

ధన్యవాదాలు…

***

MVVS/PR/ARDHA