Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఘనం గా జరిగిన కోల్ కాతా పోర్ట్ ట్రస్టు 150వ వార్షికోత్సవాల కు హాజరై, కోల్ కాతా పోర్టు కోసం బహుళ విధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించిన ప్రధాన మంత్ర


కోల్ కాతా లో నేడు ఘనం గా జరిగిన కోల్ కాతా పోర్ట్ ట్రస్టు 150వ వార్షికోత్సవాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలు పంచుకొన్నారు.

కోల్ కాతా పోర్ట్ ట్రస్టు కు 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫలకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. కోల్ కాతా పోర్ట్ ట్రస్టు యొక్క 150వ వార్షికోత్సవాల లో పాలు పంచుకోవడం తన సౌభాగ్యమని ఆయన అన్నారు. ఇది దేశ జల శక్తి తాలూకు ఒక చరిత్రాత్మక ప్రతీక అని ఆయన అభివర్ణించారు.

“ఈ నౌకాశ్రయం దేశం విదేశీ పాలన నుండి స్వాతంత్య్రాన్ని పొందడం వంటి ఎన్నో చారిత్రిక ఘట్టాల కు సాక్షి గా నిలచింది. ఈ పోర్టు సత్యాగ్రహం నుండి స్వేచ్చాగ్రహం వరకు దేశం మార్పు చెందడాన్ని కాంచింది. ఈ రేవు సరుకు లు రవాణా చేసిన వారిని మాత్రమే కాక దేశాన్ని మరియు ప్రపంచాన్ని ప్రభావితం చేసి చెరిగిపోని ముద్ర ను వేసిన అటువంటి జ్ఞానుల ను కూడా చూసింది. భారతదేశ పారిశ్రామిక, ఆధ్యాత్మిక మరియు స్వావలంబన సహిత ఆకాంక్షల కు కోల్ కాతా పోర్టు ఒక ప్రతీక” అని ప్రధాన మంత్రి అన్నారు.

కార్యక్రమం లో భాగంగా ప్రధాన మంత్రి పోర్టు గీతాన్ని కూడా ఆవిష్కరించారు.

గుజరాత్ రాష్ట్రంలోని లోథల్ రేవు నుండి కోల్ కాతా రేవు వరకు ఉన్న పొడవైన కోస్తాతీర ప్రాంతం ఒక్క వాణిజ్యం లో నిమగ్నం కావడం మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తం గా నాగరకత ను మరియు సంస్కృతి ని వ్యాప్తి చేసే పని ని కూడా చేశాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

“మన దేశం లోని తీర ప్రాంతాలు అభివృద్ధికి ద్వారాలు అని మా ప్రభుత్వం నమ్ముతోంది. ఈ కారణం చేతనే ఓడరేవుల మధ్య సంధాయకత పెంచడానికి, మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి ప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టు ను ప్రారంభించింది. ఈ పథకం లో భాగం గా 6 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ విలువైన 3600 ప్రాజెక్టుల ను గుర్తించడం జరిగింది. వాటిలో 3 లక్షల కోట్ల రూపాయల కన్నా విలువైన 200 ప్రాజెక్టు ల పనులు చురుకు గా సాగుతున్నాయి. వాటి లో 125 ప్రాజెక్టు లు పూర్తి అయ్యాయి. నదీ జలమార్గాల నిర్మాణం వల్ల కోల్ కాతా రేవు కు తూర్పు భారతం లోని పారిశ్రామిక కేంద్రాల తో సంబంధాలు ఏర్పడ్డాయి. అంతేకాక నేపాల్, బాంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ ల వంటి దేశాల తో వాణిజ్యం సులభతరం అయింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవు

కోల్ కాతా పోర్ట్ ట్రస్టు కు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు ను పెడుతున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. “డాక్టర్ ముఖర్జీ బెంగాల్ ముద్దు బిడ్డ. దేశ పారిశ్రామికీకరణ కు ఆయన పునాదుల ను వేశారు. చిత్తరంజన్ రైలు ఇంజిన్ ల కర్మాగారం, హిందుస్తాన్ ఎయర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ, సింద్ రీ ఎరువుల కర్మాగారం, దామోదర్ వేలీ కార్పొరేశన్ ల వంటి పలు సంస్థల స్థాపన లో ఆయన చాలా ముఖ్య భూమిక ను నిర్వహించారు. ఈ సందర్భం లో నేను బాబా సాహెబ్ ఆంబేడ్ కర్ ను కూడా గుర్తు కు తెచ్చుకొంటున్నాను. డాక్టర్ ముఖర్జీ, బాబా సాహెబ్ లు ఇరువురూ స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం భారతదేశాని కి ఒక కొత్త దృష్టికోణాన్ని ఇచ్చారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

కోల్ కాతా ఓడరేవు పెన్శనర్ ల సంక్షేమం

కోల్ కాతా పోర్ట్ ట్రస్టు నుండి పదవీ విరమణ చేసిన, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల పెన్శన్ ఫండ్ లో లోటు ను భర్తీ చేయడం కోసం అంతిమ కిస్తీ రూపం లో 501 కోట్ల రూపాయల చెక్కు ను కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందజేశారు. ఆయన కోల్ కాతా పోర్ట్ ట్రస్టు కు చెందిన ఇద్దరు వయోవృద్ధులైన పెన్శనర్ లు 105 ఏళ్ల సంవత్సరాల శ్రీ నగీనా భగత్ ను, 100 ఏళ్ల శ్రీ నరేశ్ చంద్ర చక్రవర్తి ని సమ్మానించారు.

సుందర్ బన్ ఆదివాసీ విద్యార్ధినులు 200 మంది కోసం కౌశల్ వికాస్ కేంద్రాన్ని మరియు ప్రీతిలత ఛాత్రావాస్ ను ప్రధాన మంత్రి ప్రారంభించారు.

పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కి, ముఖ్యం గా పేద లు, అణగారిన వర్గాలు, పీడితుల అభ్యున్నతి కి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ మరియు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పతకాల ను ఆమోదించిన వెంటనే పశ్చిమ బెంగాల్ ప్రజల కు ఈ రెండు పథకాల ప్రయోజనాలు అందడం మొదలవుతుందని ఆయన అన్నారు.

నేతాజీ సుభాష్ డ్రై డాక్ లో కొచీన్ కోల్ కాతా నౌక ల మరమ్మతు విభాగాని కి చెందిన ఉన్నత నౌకా మరమ్మతు సదుపాయాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.

కోల్ కాతా ఓడరేవు నుండి సరుకుల ను బయటకు చేరవేసేందుకు విస్తరించిన రైల్వే లైను ను ప్రధాన మంత్రి ప్రారంభించి దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు. దీనివల్ల సరుకుల ను సులభం గా బయట కు పంపవచ్చును. సమయం బాగా ఆదా అవుతుంది.

హాల్దియా డాక్ కాంప్లెక్స్ వద్ద యాంత్రీకరించిన నంబర్ మూడో బెర్తు ను, ప్రతిపాదిత రివర్ ఫ్రంట్ అభివృద్ధి పథకాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.

***