Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గ్లోబల్ పార్ట్ నర్‌ శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) వార్షిక శిఖర సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

గ్లోబల్ పార్ట్ నర్‌ శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) వార్షిక శిఖర సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి


గ్లోబల్ పార్ట్ నర్‌శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) శిఖర సమ్మేళనాన్ని న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. గ్లోబల్ ఎఐ ఎక్స్ పో లో ఆయన అడుగిడి, పరిశీలించారు. జిపిఎఐ అనేది కృత్రిమ మేథ (ఎఐ) తాలూకు సిద్ధాంతానికి మరియు అభ్యాసానికి మధ్య గల అంతరాయాన్ని భర్తీ చేసే లక్ష్యం తో 29 సభ్యత్వ దేశాలు అవలంభించనున్నటువంటి ఒక మల్టీ-స్టేక్ హోల్డర్ ఇనిశియేటివ్ గా ఉంది. ఈ లక్ష్య సాధన లో ఎఐ సంబంధి ప్రాధాన్య అంశాల పై అత్యాధునిక పరిశోధనల కు మరియు తత్సంబంధి కార్యకలాపాల కు సమర్థన ను అందించడం జరుగుతుంది. 2024 వ సంవత్సరానికి జిపిఎఐ తాలూకు లీడ్ చైన్ గా భారతదేశం ఉంది.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, కృత్రిమ మేధస్సు కు సంబంధించి యావత్తు ప్రపంచం చర్చోపచర్చల లో నిమగ్నం అయిన తరుణం లో వచ్చే సంవత్సరం లో జరుగనున్న జిపిఎఐ సమిట్ కు భారతదేశం అధ్యక్షత వహించనుండడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. సకారాత్మకమైనటువంటి దృష్టి కోణాల తో పాటు నకారాత్మకమైనటువంటి దృష్టి కోణాలు కూడ వెలుగు లోకి వస్తున్నాయి అని ప్రధాన మంత్రి చెప్తూ, ప్రతి ఒక్క దేశం భుజస్కందాల మీద బాధ్యత ఉంది అని నొక్కిపలికారు. జిపిఎఐ సమిట్ విషయం లో ఎఐ తాలూకు వివిధ పరిశ్రమ ప్రముఖుల తో సంభాషణ లు మరియు చర్చ లు జరుగుతూ ఉన్నాయి అని ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. ఎఐ ప్రతి ఒక్క దేశాన్ని ప్రభావితం చేసింది, అది చిన్న దేశం కావచ్చు లేదా పెద్ద దేశం కావచ్చు అని ఆయన అన్నారు; మరి ఈ విషయం లో జాగ్రత గా ముందంజ వేయాలి అని ఆయన సూచించారు. జిపిఎఐ సమిట్ లో చోటు చేసుకొనే చర్చ మానవ జాతి కి ఒక దిశ ను ఇవ్వడం తో పాటుగా మానవ జాతి కి సంబంధించిన మూల ఆధారాల ను సైతం పదిలం గా ఉంచబోతోంది అని ఆయన స్పష్టం చేశారు.

 

ప్రస్తుతం ఎఐ సంబంధి ప్రతిభ తో ముడిపడిన రంగం లో మరియు ఎఐ కి సంబంధించిన ఆలోచనల లో ప్రధానమైన పాత్రధారి గా భారతదేశం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఎఐ సంబంధి సాంకేతిక విజ్ఞానం యొక్క ఎల్లల ను విస్తరిస్తూ, ఈ రంగం లో పరిశోధన లు జరపడం లో భారతదేశాని కి చెందిన యువత ముందడుగు వేస్తున్న నేపథ్యం లో భారతదేశం లో ఎఐ సంబంధి హుషారైన చేతన గోచరిస్తున్నది అని ఆయన అన్నారు. ఎఐ సంబంధి ప్రదర్శన లో ఉంచిన ఉత్పాదనల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, ఆ వస్తువులు సాంకేతిక విజ్ఞానం మాధ్యం ద్వారా సమాజం లో పరివర్తన ను తీసుకు వచ్చేందుకు జరుగుతున్న ప్రయాస లు అంటూ అభివర్ణించారు. ఇటీవలే ప్రారంభం అయినటువంటి ఎఐ ఎగ్రీకల్చర్ చాట్‌బాట్ ను గురించి ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, ఈ పరిణామం రైతుల కు వ్యవసాయం సంబంధి వివిధ అంశాల లో సహాయకారి కానుంది అని వివరించారు. ఆరోగ్య సంరక్షణ మరియు సతత అభివృద్ధి లక్ష్యాల రంగం లో ఎఐ ని వినియోగించుకోవడాన్ని గురించి కూడ ఆయన వివరించారు.

 

 

‘‘భారతదేశం లో అభివృద్ధి మంత్రం అంటే అది సబ్ కా సాథ్, సబ్ కా వికాస్అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వం తన విధానాల ను, కార్యక్రమాల ను ‘‘ అందరికీ ఎఐ’’ అనే స్ఫూర్తి తో రూపొందించింది అని ఆయన చెప్పారు. సామాజిక అభివృద్ధి కోసం మరియు అన్ని వర్గాల వారి వృద్ధి కోసం ఎఐ యొక్క దక్షతల ను ఎక్కువ లో ఎక్కువ గా ఉపయోగించుకోవడం కోసం ప్రభుత్వం పాటు పడుతుంది, అదే కాలం లో ఎఐ ని బాధ్యతాయుక్తం గాను మరియు నీతి యుక్తం గాను వినియోగిస్తుంది అని ఆయన అన్నారు. కృత్రిమ మేధ అంశం లో ఒక జాతీయ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం గురించి, త్వరలో ప్రారంభించబోయే ఎఐ మిశన్ ను గురించి ప్రధాన మంత్రి వెల్లడించారు. ఎఐ మిశన్ అనేది ఎఐ తాలూకు కంప్యూటింగ్ పవర్స్ ను ఖాయం చేస్తుంది అని ఆయన అన్నారు. ఇది భారతదేశం లో స్టార్ట్-అప్స్ కు మరియు నూతన ఆవిష్కర్తల కు మెరుగైన సేవల ను అందిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. దీనితో పాటు గా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఇంకా విద్య బోధన రంగాల లో ఎఐ అప్లికేశన్స్ ను కూడా ప్రోత్సహిస్తుంది అని ఆయన వివరించారు. విద్య బోధన సంబంధి శిక్షణ సంస్థ ల మాధ్యం ద్వారా రెండో అంచె నగరాల లో మరియు మూడో అంచె నగరాల లో ఎఐ సంబంధి నైపుణ్యాల విస్తృతి ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఎఐ సంబంధి కార్యక్రమాల ను ప్రోత్సహించేటటువంటి భారతదేశం యొక్క జాతీయ స్థాయి ఎఐ పోర్టల్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఐరావత్ (AIRAWAT) కార్యక్రమాన్ని ప్రస్తావించారు. పరిశోధనల కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రయోగశాల కోసం, పరిశ్రమ రంగం కోసం మరియు స్టార్ట్-అప్ ల రంగం కోసం ఒక ఉమ్మడి ప్లాట్ ఫార్మ్ ను త్వరలో ప్రవేశపెట్టడం జరుగుతుంది అని ఆయన తెలియజేశారు.

 

ఎఐ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, ఎఐ అనేది నూతన భవిత ను తీర్చిదిద్దేందుకు ఒక పెద్ద ఆధారం అవుతోంది అని వ్యాఖ్యానించారు. ఎఐ అనేది ప్రజల ను కలిపి ఉంచడం తో పాటు, ఆర్థిక అభివృద్ధి కే కాకుండా సమానత్వాని కి మరియు సామాజిక న్యాయాని కి సైతం పూచీ పడుతుంది అని ఆయన అన్నారు. ఎఐ ని మరిన్ని వర్గాల వారి చెంతకు తీసుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన ఉద్ఘాటించారు. ‘‘ఎఐ ఎంత విస్తృతం అయితే, ఎఐ యొక్క అభివృద్ధి యాత్ర అంత వ్యాప్తి చెందుతుంది, ఎఐ ఎంత జన బాహుళ్యాని కి సమీపిస్తే, దాని తాలూకు ఫలితాలు అంతగా వృద్ధి చెందుతాయి’’ అని ఆయన అన్నారు. గడచిన శతాబ్ద కాలం లో సాంకేతిక విజ్ఞానం యొక్క ప్రాప్తి అసమానమైంది గా ఉన్న కారణం గా సమాజం లో సమానత్వ లోపం అంతగా పెచ్చుపెరిగింది అని ఆయన అన్నారు. దీనిని నివారించడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని సమానత్వ వ్యాప్తి ప్రధానమైంది గా మలచడం లో ప్రజాస్వామిక విలువల ను నిర్లక్ష్యం చేయకూడదు అంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ‘‘ఎఐ యొక్క అభివృద్ధి గతి అనేది పూర్తి గా మానవీయ విలువల పైన మరియు ప్రజాస్వామిక విలువల పైన ఆధారపడి ఉంటుంది. సామర్థ్యానికి, నైతికత్వానికి, దక్షత కు తోడు భావోద్వేగాల కు కూడా ఒక పీట ను వేయవలసిన అగత్యం మన మీద ఉంది’’ అని ఆయన అన్నారు.

 

ఏదైనా ఒక వ్యవస్థ ను పది కాలాల పాటు మనుగడ లో ఉంచాలి అంటే గనుక దానిని మార్పుల కు వీలు ఉండేటటువంటిది గాను, పారదర్శకమైంది గాను మరియు విశ్వసనీయమైందిగాను మలచడం అనేది ముఖ్యం అని ప్రధాన మంత్రి ఉద్భోదించారు. ‘‘ఎఐ అనేది పరివర్తనాత్మకమైంది అనడం లో ఎటువంటి అనుమానం లేదు. అయితే, దీనిని మరింత ఎక్కువ పారదర్శకమైంది గా తీర్చిదిద్దవలసిన బాధ్యత కూడా ఉంది’’ అని ఆయన అన్నారు. సమాచారాన్ని పారదర్శకత తో కూడుకొన్నది గా మరియు ఎటువంటి పక్షపాతాని కి తావు ఇవ్వనటువంటిది గా ఉంచడం అనేది ఒక మంచి నాంది ప్రస్తావన కాగలుగుతుంది అని ఆయన అన్నారు. కృత్రిమ మేధ తాలూకు అభివృద్ధి యాత్ర లో ఏ ఒక్కరిని విడచిపెట్టి ముందుకు వెళ్ళడం జరుగదు అని అన్ని దేశాల కు హామీ ని ఇవ్వడం తప్పనిసరి అని ఆయన అన్నారు. ఎఐ కి సంబంధించిన నీతి పరమైన, ఆర్థిక పరమైన మరియు సామాజిక పరమైన అంశాల ను పరిష్కరించినప్పుడు మాత్రమే ఎఐ లో విశ్వాసం వర్ధిల్లగలుగుతుంది అని ఆయన అన్నారు. దీనిని సాధించడాని కి ఉన్న ఒక దారి ఏది అంటే అది ఎఐ యొక్క వృద్ధి క్రమం లో అప్‌స్కిలింగు కు మరియు రీస్కిలింగు కు చోటు ను చూపించడం అని ఆయన అన్నారు. సమాచార పరిరక్షణ మరియు వికాసశీల దేశాల (గ్లోబల్ సౌథ్) కు హామీ లు సైతం అనేక ఆందోళనల ను ఉపశమింప చేయగలుగుతాయి అని ఆయన అన్నారు.