Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గ్లోబల్ పాటీదార్ బిజినెస్ సమిట్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

గ్లోబల్ పాటీదార్ బిజినెస్ సమిట్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా గ్లోబల్ పాటీదార్ బిజినెస్ సమిట్ (జిపిబిఎస్) ను ప్రారంభించారు. ఈ శిఖర సమ్మేళనాన్ని సర్ దార్ ధామ్ ఏర్పాటు చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్, కేంద్ర మంత్రులు మరియు పరిశ్రమ రంగ ప్రముఖులు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో ఉన్నారు.

ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ, సూరత్ నగరాని కి ప్రపంచం లో అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న నగరాల లో ఒక నగరం అనే స్థాయి ఉంది అన్నారు. ప్రస్తుతం భారతదేశం లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి అంటూ సర్ దార్ పటేల్ ఆడిన మాటల ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. ‘‘మనం చేయవలసిందల్లా మన ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మనిర్భరత తాలూకు భావన ను బలపరచుకోవడమే. ఈ విశ్వాసం ఎప్పుడు వస్తుంది అంటే అది ప్రతి ఒక్కరు అభివృద్ధి లో పాలుపంచుకోవడమనేది జరిగినప్పుడు, అభివృద్ధి లో ప్రతి ఒక్కరి ప్రయత్నం ఇమిడి ఉన్నప్పుడు’’ అని ఆయన అన్నారు.

దేశం లో నవ పారిశ్రామికత్వం తాలూకు ఉత్సాహం వర్ధిల్లుతున్న అంశం పై ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సాధారణ కుటుంబాల కు చెందిన యువతీ యువకులు సైతం ఒక నవ పారిశ్రామికవేత్త లు కావడం, నవపారిశ్రామికవేత్తలు గా అవ్వాలి అనేటటువంటి కలల ను కంటూ ఉండడం, మరి నవ పారిశ్రామికులు అయినందుకు గర్వపడుతూ ఉండే అటువంటి ఒక వాతావరణం దేశం లో ఏర్పడేటట్టు గా ప్రభుత్వం తన విధానాల ద్వారా, తన కార్యాచరణ ద్వారా నిరంతరం యత్నిస్తున్నది అని ప్రధాన మంత్రి వివరించారు. ముద్ర యోజన వంటి పథకాలు ప్రజల కు వారు ఎన్నడూ కలనైనా కననటువంటి వ్యాపారం లోకి అడుగుపెట్టే శక్తి ని ఇస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. అదే విధం గా నూతన ఆవిష్కరణ లు, ప్రతిభ, ఇంకా యూనికార్న్ ల తాలూకు స్వప్నాల ను నెరవేర్చుకోవడం లో స్టార్ట్-అప్ ఇండియా తోడ్పడుతోంది. ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) అనేది సాంప్రదాయిక రంగాల లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది; కొత్త కొత్త రంగాల లో నూతన అవకాశాల ను పిఎల్ఐ కల్పిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. మహమ్మారి సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడాను, దేశం లో ఎమ్ఎస్ఎమ్ఇ రంగం శరవేగం గా పురోగమించింది అని ఆయన తెలిపారు. పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందడం తో ఈ రంగం లో లక్షల కొద్దీ ఉద్యోగాలు పదిలం గా ఉన్నాయి; మరి ప్రస్తుతం ఈ రంగం ఉపాధి తాలూకు కొత్త దారుల ను తెరుస్తోంది. పిఎమ్-స్వనిధి పథకం వీధుల లో తిరుగుతూ వస్తువుల ను విక్రయించే వారికి బ్యాంకింగు ను, ఫినాన్స్ ను అందుబాటు లోకి తీసుకు రావడం ద్వారా వీధి వ్యాపారుల కు వృద్ధి గాథ తో అనుబంధాన్ని కల్పించింది. ఈ పథకం గడువు ను 2024వ సంవత్సరం డిసెంబర్ వరకు ఇటీవలే పొడిగించడం జరిగింది అని ఆయన చెప్పారు.

ప్రతి చిన్న, పెద్ద వ్యాపారాలు దేశ ప్రగతి కి వాటి వంతు తోడ్పాటు ను అందిస్తున్నాయి; మరి ఈ యొక్క సబ్ కా ప్రయాస్ అనేది అమృత కాలం లో న్యూ ఇండియా యొక్క బలం గా మారుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సంవత్సరపు శిఖర సమ్మేళనం ఈ దృష్టికోణాన్ని సమగ్రం గా చర్చిస్తోందంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని గుజరాతీ భాష లోకి మార్చివేసి, జాతీయ హితం ముడిపడిన అంశాల పై కృషి చేసి, ఆలోచనల ను, ప్రపంచవ్యాప్తం గా అమలు లో ఉన్న మంచి అభ్యాసాల ను, ప్రభుత్వ విధానాల ను అక్షరబద్ధం చేయడానికి మరి వాటి విశ్లేషణ ను కూడా చేపట్టడానికి అనుభవజ్ఞులతోను, యువ సభ్యుల తోను కూడిన సమూహాల ను ఏర్పాటు చేయవలసింది గా పాటీదార్ సముదాయానికి సూచించారు. ప్రభుత్వం లో మరియు విద్య రంగం లో జోక్యం కోసమని ఫిన్ టెక్, నైపుణ్యాల అభివృద్ధి, ఫినాన్శల్ ఇన్ క్లూఝన్ వంటి విషయాల ను తీసుకోవచ్చును అని ఆయన అన్నారు. అదే మాదిరి గా, మొత్తంమీద అమలు కు ఉత్తమ పద్ధతి ని అన్వేషించడం కోసం, ఇంకా ప్రతి స్థాయి లో ఉపయోగకరమైనటువంటి జోక్యం పై సలహాల ను ఇవ్వడం కోసం జాతీయ విద్య విధానాన్ని కూడా చేపట్టవచ్చును అని ఆయన అన్నారు.

వ్యవసాయాన్ని ఆధునికీకరించే మార్గాల ను అన్వేషించాలని, వ్యవసాయరంగం లోకి పెట్టుబడి ని తీసుకు వచ్చే మార్గాల ను శోధించాలని శిఖర సమ్మేళనాని కి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. సాగు చేయడానికి కొత్త పద్ధతులను, కొత్త కొత్త పంటల ను సూచించడం కోసం గుజరాత్ నేలల ను అధ్యయనం చేయడం కోసం బృందాల ను ఏర్పాటు చేయవచ్చు అని ఆయన సూచించారు. కొన్ని దశాబ్దాల క్రితం గుజరాత్ లో పాడి ఉద్యమం మొదలైంది, అది గుజరాత్ లోని రైతు ల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేసింది అని ఆయన ఒక ఉదాహరణ లాగా ప్రస్తావించారు. వ్యవసాయం పై ఆధారపడే పరిశ్రమల ను ప్రోత్సహించడం కోసం మనం తగ్గ మార్గాల ను వెతకవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. ఆ తరహా ప్రయాసలు ఖాద్య తైలాల దిగుమతి ని తగ్గించడం లో సాయఃపడగలుగుతాయి అని ఆయన అన్నారు. ఫూడ్ ప్రోసెసింగ్ ఇండస్ట్రీ లో ఉన్న అవకాశాల ను గురించి ఆయన నొక్కిచెప్పారు. తెర మీద కు వస్తున్న ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ పిఒ స్) ను గమనించాలని, ఎందుకంటే అవి రంగం లోకి ప్రవేశించడం తో అనేక అవకాశాలు అందివస్తున్నాయని సభికుల తో ఆయన చెప్పారు. ప్రాకృతిక వ్యవసాయం రంగం లో కూడా కృషి చేయాలంటూ ప్రధాన మంత్రి కోరారు. వ్యవసాయ క్షేత్రాల లో విడిచిపెట్టిన చోట్ల ను సోలర్ పేనల్స్ అమర్చేందుకు ఉపయోగించుకొనే అవకాశం ఉందేమో గమనించాలని ప్రధాన మంత్రి అన్నారు. ఇటీవలే ప్రారంభించిన అమృత్ సరోవర్ అభియాన్ కు వారి వంతు తోడ్పాటు ను అందించాలి అని ఆయన వారిని అడిగారు. ఇటీవలే నిర్వహించిన ఆయుర్వేద్ సమిట్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మూలిక లు మరియు ఆయుష్ రంగం లో కొంగొత్త అవకాశాలకేసి దృష్టి సారించవచ్చును అన్నారు.

ఆర్థిక సామ్రాజ్యాల పట్ల ఒక కొత్త దృక్పథం ఏర్పడాలి అంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమల ను పెద్ద నగరాల లో ఏర్పాటు చేసేందుకు బదులు గా చిన్న నగరాల లో ఏర్పాటు చేయవచ్చును అనే నిర్ణయాన్ని తీసుకోవచ్చును అని ఆయన నొక్కిచెప్పారు. పల్లెల లో పారిశ్రామిక కార్యకలాపాల కు కు చోటిచ్చిన జ్యోతిగ్రామ్ యోజన ను గురించి ఆయన ఉదాహరించారు. ఇప్పుడిక చిన్న పట్టణాల లో, చిన్న నగరాల లో అటువంటి కార్యాల ను చేపట్టవచ్చును అని ఆయన అన్నారు.

 

 

 

పాటీదార్ సముదాయం యొక్క సామాజిక, ఆర్థిక అభివృద్ధి కి దన్ను గా నిలవడం కోసం సర్ దార్ ధామ్ మిశన్ 2026’ లో భాగం గా గ్లోబల్ పాటీదార్ బిజినెస్ సమిట్ (జిపిబిఎస్) ను ఏర్పాటు చేస్తున్నది. ఈ శిఖర సమ్మేళనాన్ని ప్రతి రెండు సంవత్సరాల కు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఒకటో శిఖర సమ్మేళనం 2018వ సంవత్సరం లో, రెండో శిఖర సమ్మేళనం 2020 వ సంవత్సరం లో గాంధీనగర్ లో జరిగాయి. వర్తమాన శిఖర సమ్మేళనాన్ని సూరత్ లో నిర్వహించడం జరుగుతోంది. ‘‘ఆత్మనిర్భర్ సముదాయం నుంచి ఆత్మనిర్భర్ గుజరాత్ మరియు భారతదేశం’’ అనేది జిపిబిఎస్ 2022 యొక్క ప్రధాన ఇతివృత్తం గా ఉంది. ఈ శిఖర సమ్మేళనం ఉద్దేశ్యం ఏమిటంటే అది పాటీదార్ సముదాయం లోని చిన్న, మధ్యతరహా మరియు పెద్ద వాణిజ్య సంస్థల ను ఒక చోటు కు తీసుకు రావడం, నవ పారిశ్రామికవేత్తల కు ప్రోత్సాహాన్ని మరియు సమర్ధన ను ఇవ్వడం, విద్యావంతులైన యువతుల కు యువకుల కు శిక్షణ ను ఇవ్వడం, ఉపాధి పరంగా వారికి సాయపడడం అనేవే. ఏప్రిల్ 29వ తేదీ మొదలుకొని మే 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాగేటటువంటి ఈ శిఖర సమ్మేళనం లో ప్రభుత్వ పారిశ్రామిక విధానం, సూక్ష్మ, లఘు, మధ్యతరహా వాణిజ్య సంస్థ లు (ఎమ్ఎస్ఎమ్ఇ స్) , స్టార్ట్-అప్స్, నూతన ఆవిష్కరణ ల సంబంధి విభిన్న అంశాలు చర్చ కు రాగలవు.

Speaking at the Global Patidar Business Summit. https://t.co/S2KDxpYTSJ

— Narendra Modi (@narendramodi) April 29, 2022

आज भारत के पास इतना कुछ है।

हमें बस अपने आत्मविश्वास को, आत्मनिर्भरता के अपने जज्बे को मज़बूत करना है।

ये आत्मविश्वास तभी आएगा जब विकास में सबकी भागीदारी होगा, सबका प्रयास लगेगा: PM @narendramodi

— PMO India (@PMOIndia) April 29, 2022

अपनी नीतियों, अपने एक्शन के माध्यम से सरकार का ये निरंतर प्रयास है कि देश में ऐसा माहौल बने कि सामान्य से सामान्य परिवार का युवा भी entrepreneur बने, उसके लिए के सपने देखे, entrepreneurship पर गर्व करे: PM @narendramodi

— PMO India (@PMOIndia) April 29, 2022

मुद्रा योजना आज देश के उन लोगों को भी अपना बिजनेस करने का हौसला दे रही है, जो कभी इसके बारे में सोचते भी नहीं थे।

स्टार्ट अप इंडिया से वो इनोवेशन, वो टैलेंट भी आज यूनिकॉर्न के सपने साकार होते देख रहा है, जिसको कभी रास्ता नहीं दिखता था: PM @narendramodi

— PMO India (@PMOIndia) April 29, 2022

Production Linked incentive यानि PLI योजना ने पुराने सेक्टरों में तो मेक इन इंडिया का उत्साह तो भरा ही है, सेमीकंडक्टर जैसे नए सेक्टर्स के विकास की संभावनाएं भी बनी हैं: PM @narendramodi

— PMO India (@PMOIndia) April 29, 2022

****

DS/AK