Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గ్రీన్ ఎనర్జీ రంగం లో స్థిర అభివృద్ధి కి ప్రభుత్వం పూర్తి గా కట్టుబడిఉంది: ప్రధాన మంత్రి


గ్రీన్ ఎనర్జీ రంగం లో స్థిరాభివృద్ధి సాధన కు ప్రభుత్వం పూర్తి వచనబద్ధత తో ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మహేంద్ర నాథ్ పాండే ట్వీట్ కు శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందిస్తూ ఈ సంగతి ని తెలియ జేశారు. కేంద్ర మంత్రి ఒక ట్వీట్ లో ఫేమ్ ll పథకం లో భాగం గా విద్యుత్తు వాహనాలు 22.9 కోట్ల లీటర్ ల ఇంధనాన్ని ఆదా చేశాయి, దానితో పాటు 33.9 కోట్ల కిలో గ్రాముల కార్బన్ డయాక్సైడ్ ను తగ్గించాయి అని వెల్లడించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘గ్రీన్ ఎనర్జీ రంగం లో స్థిరాభివృద్ధి కి గాను మా ప్రభుత్వం పూర్తి స్థాయి లో నిబద్ధురాలై ఉంది’’ అని పేర్కొన్నారు.