Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గ్రాట్యుటీ చెల్లింపు (స‌వ‌ర‌ణ‌) బిల్లు, 2017ను పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్ట‌డానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం గ్రాట్యుటీ చెల్లింపు (స‌వ‌ర‌ణ‌) బిల్లు, 2017ను పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్ట‌డానికి త‌న ఆమోదాన్ని తెలిపింది.

ప్రైవేటు రంగంలోని మ‌రియు ప్ర‌భుత్వరంగ సంస్థ‌లు/ప‌్ర‌భుత్వం ప‌రిధిలోని స‌్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగిన‌టువంటి సంస్థ‌లు, ఏవైతే సిసిఎస్ (పింఛ‌ను) నియ‌మాల ప‌రిధిలోకి చేరడం లేదో వాటి ఉద్యోగుల గ్రాట్యుటీ గ‌రిష్ఠ ప‌రిమితిని కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా ఈ స‌వ‌ర‌ణ పెంచ‌నుంది.

పూర్వ‌రంగం:

10 మంది లేదా అంత‌క‌న్నా ఎక్కువ మందిని నియ‌మించుకొన్న సంస్థ‌ల‌కు గ్రాట్యుటీ చెల్లింపు చ‌ట్టం, 1972 వ‌ర్తిస్తుంది. శ్రామికుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం- వార్ధ‌క్యం సంబంధిత నియ‌మాల ఫ‌లితంగా గాని లేదా శారీర‌కంగా అశ‌క్త‌త పాల‌వ‌డం గాని లేదా శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌య‌వం ఏదైనా బ‌ల‌హీన‌ప‌డ‌టం గాని జ‌రిగిన ఫ‌లితంగా ఉద్యోగ విర‌మ‌ణ చేయ‌వ‌ల‌సి వ‌చ్చిన‌పుడు- సామాజిక భ‌ద్ర‌త‌ను అందించ‌డం ఈ చ‌ట్టాన్ని చేయ‌డంలోని ప‌ర‌మార్థంగా ఉంది. ఈ కార‌ణంగా గ్రాట్యుటీ చెల్లింపు చ‌ట్టం, 1972 అనేది ప‌రిశ్ర‌మ‌లు, కార్ఖానాలు మ‌రియు సంస్థ‌ల‌లో ప‌ని చేస్తూ వేత‌నం ఆర్జిస్తున్న వారికి సంబంధించి ఒక ముఖ్య‌మైన సామాజిక భ‌ద్ర‌తా చ‌ట్టంగా ప‌రిణ‌మించింది.

ఈ చ‌ట్టంలో భాగంగా గ్రాట్యుటీకి ప్ర‌స్తుతమున్నటువంటి ఉన్న‌త ప‌రిమితి 10 ల‌క్ష‌ల రూపాయ‌లు. కేంద్ర సివిల్ స‌ర్వీసులు (పింఛ‌న్‌) నియ‌మాలు, 1972 లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు గ్రాట్యుటీ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇదే విధంగా ఉన్నాయి. 7వ కేంద్ర వేత‌న సంఘం అమ‌లులోకి రావ‌డాని క‌న్నా ముందు సిసిఎస్ (పింఛ‌ను) నియ‌మాలు, 1972లో భాగంగా ఉన్న‌టువంటి గ‌రిష్ఠ ప‌రిమితి 10 ల‌క్ష‌ల రూపాయ‌లు. అయితే, 7వ కేంద్ర వేత‌న సంఘం అమ‌లులోకి రావ‌డంతో, ప్ర‌భుత్వ ఉద్యోగులకు సంబంధించినంత వ‌ర‌కు, గ‌రిష్ఠ ప‌రిమితి ప్ర‌స్తుతం 1.1.2016 నాటి నుండి 20 ల‌క్ష‌ల రూపాయ‌లుగా ఉంది.

ఈ కార‌ణంగా, ధ‌ర‌ల‌లో పెరుగుద‌ల‌ను మ‌రియు వేత‌నాల‌లో పెరుగుద‌ల‌ను దృష్టిలో ఉంచుకొని- ప్రైవేటు రంగంలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల విష‌యంలోను, గ్రాట్యుటీ చెల్లింపు చ‌ట్టం, 1972 వ‌ర్తిస్తున్న వారి విష‌యంలోను- గ్రాట్యుటీని స‌వ‌రించాల‌న్న ఆలోచ‌నను ప్రభుత్వం చేసింది. దీనికి అనుగుణంగా గ్రాట్యుటీ చెల్లింపు చ‌ట్టం, 1972కు స‌వ‌ర‌ణ చేసే ప్ర‌క్రియ‌ను ప్ర‌భుత్వం మొద‌లుపెట్టింది.